ఫేక్ రాజకీయాలు చేస్తే ఊరుకోను
ఆధార్ ఆధారంగా ఎవరికి ఎంత యూరియా కావాలో పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.;
ఫేక్ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని, రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అంటూ పరోక్షంగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఫేక్ పార్టీ అని, నేరాలు నమ్ముకున్న పార్టీ అని, అలాంటి పార్టీ ఎరువుల విషయంలో విషప్రచారం చేస్తోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయంలో మాట్లాడుతూ సకాలంలో రైతులకు యూరియా, ఇతర ఎవురులను అందిడమే తమ లక్ష్యమని చెప్పొకొచ్చారు.
కృష్ణా జిల్లాలో యూరియా లారీని అడ్డుకొని ఓ వైసీపీ నేత వివాదం సృష్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే యూరియా దారి మళ్లింపులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కొందరు యూరియాను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు. అలా దారిమళ్లించిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.