అనుమానంతో నడిరోడ్డుపైనే భార్య పీక కోసి చంపేశాడు
విధులు ముగించుకుని బయటకు వచ్చిన వెంటనే సరస్వతిపై భర్త విరుచుకుపడ్డాడు.
విజయవాడలో దారుణ హత్య జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపైనే భర్త భార్యను చంపేశాడు. భర్త విజయ్.. భార్య సరస్వతిని కత్తితో పీక కోసి కిరాతకంగా హత్య చేశాడు. విజయవాడ నగరంలోని విన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న సరస్వతి.. డ్యూటీ ముగించుకుని బయటికి వచ్చిన వెంటనే ఆమెపైన భర్త దాడికి పాల్పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై రాక్షసుడిలా విరుచుకుపడ్డాడు. మెడపై పొడిచి పీక కోయడంతో తీవ్ర రక్తస్రావమైన సరస్వతి అక్కడికక్కడే కుప్పకూలింది.
ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రాణాలు నిలవలేదు. గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాలతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. సరస్వతి తన రెండేళ్ల కుమారుడితో ఒంటరిగా నివసిస్తోంది. 2022 ఫిబ్రవరి 14న లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ దంపతుల మధ్య అనుమానాలు రేకెోత్తాయి. అవి తీవ్ర గొడవలకు దారి తీశాయి. నిందితుడు విజయ్ భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ప్రత్యక్ష సాక్షి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ను ఆపే ప్రయత్నం చేశాను. ‘నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. జైలుకి పంపించింది.. అందుకే చంపేస్తున్నా’ అంటూ అరుస్తూ మెడపై కత్తితో పొడిచారు. వద్దని వారించినా రాక్షసుడిలా ప్రవర్తించాడు’’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.