మోహిత్ రెడ్డికి చుక్కెదురు

మద్యం కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్ను కొట్టేసిన హైకోర్టు

Update: 2025-10-07 07:35 GMT

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది. మోహిత్ రెడ్డి పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.సుదీర్ఘ వాదనల అనంతరం ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి 39వ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తుడా చైర్మన్‌గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది మోహిత్ రెడ్డిపై వున్న ఆరోపణ.తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కేసులో ఇరికించారని, దర్యాప్తుకు సహకరిస్తానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని మోహిత్‌రెడ్డి కోర్టుకు తెలుపుతూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు .అయితే సుదీర్ఘ వాదనలు అనంతరం మోహిత్ రెడ్డి తరుపు వాదనలను పరిగణలోనికి తీసుకోని కోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.
Tags:    

Similar News