పిన్నెల్లి బ్రదర్స్ కు హైకోర్ట్ షాక్
టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు .;
టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో నిందితులుగా వున్న పిన్నెల్లి బ్రదర్స్ కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న పోలీసుల వాదనను పరిగణ లోనికి తీసుకొని పిటీషన్ను కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. బాధితులనువారికి బెయిల్ ఇస్తే కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆగస్టు 21న ఈ కేసులో విచారణ జరుగగా,ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును ఆగస్టు 29కి వాయిదా వేసింది.ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నాడు.