’సాంత్వన‘ కింద రూ.5 కోట్లతో సాయం

అనారోగ్యంతో మరణించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమవసతి గృహాల విద్యార్థుల కుటుంబాలకు భరోసాగా రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా

Update: 2025-12-03 13:24 GMT

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి భరోసాగా సాంత్వన పథకం కింద కూటమి ప్రభుత్వం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు సాంత్వన చెక్కులను బుధవారం నాడు అమరావతి తాడేపల్లిలోని AP SWREIS కార్యాలయంలో మంత్రి డా.స్వామి అందజేశారు. పల్నాడు జిల్లా ఆర్కేపురం అంబేద్కర్ గురుకులం 10 వ తరగతి విద్యార్థి టి.నిహారిక, ప్రకాశం జిల్లా రాచర్ల గురుకులం 10 వ తరగతి విద్యార్థిని కొఠారి కర్ణ, బాపట్ల జిల్లా బాపట్ల అంబేద్కర్ గురుకులం 7వ తరగతి విద్యార్థిని బి. శ్వేత ఇటీవల దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించారు. బుధవారం నాడు వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మంత్రి డా.స్వామి ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.9 లక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ....దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో రూ.5 కోట్ల నిధులు కేటాయించి సాంత్వన పథకం తీసుకొచ్చాం. అనారోగ్యంతో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి భరోసానిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు ఇలాంటి పథకం లేదు. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అనారోగ్యానికి గురైన విద్యార్థులను గుర్తించి వెంటనే వైద్యం అందిస్తున్నాం. ఇప్పటివరకు 30 మందికి పైగా విద్యార్థుల ప్రాణాలు కాపాడామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి. లావణ్య వేణి, AP SWREIS అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్, డా.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News