చెట్టుకూలి ఉద్యోగి మృతి
పాయకరావుపేట అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.;
ఉద్యోగ విధుల కోసం ద్విచక్ర వాహనం మీద బయలుదేరిన ఓ ఉద్యోగి మీద వర్షాలని నానిపోయిన భారీ చెట్టు పడటంతో అతను అక్కడిక్కడే ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని పెదరామభద్రాపురంలో చోటుచేసుకుంది. డెక్కన్ పరిశ్రమలో పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ అనే ఉద్యోగి తన కార్యాలయానికి వెళ్లేందుకు పాయకరావుపేట మండలంలోని పెదరామభద్రాపురం నుంచి శ్రీరాంపురం వెళ్లేదారి గుండా ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నానిపోయి ఉన్న ఓ పెద్ద చెట్టు నేలకొరిగి సరిగ్గా అదే సమయంలో ప్రయాణిస్తున్న శ్రీనివాస్ మీద కుప్పకూలీపోయింది. భారీ చెట్టు ఒక్కసారిగా మీదపడటంతో శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయి స్పాట్‌లోనే మరణించాడు. ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న పాండు సాయి ప్రాణాలతో బయటపడినా.. తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.