పిన్నెల్లి సోదరులపై జంటహత్యల కేసు

ఎన్నికల సమయంలో పిన్నెల్లి మీద ఈవీఎంను ధ్వంసం చేశారనే ఆరోపణల మీద కేసు నమోదు చేశారు.;

Update: 2025-05-25 13:45 GMT

వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మాచర్చ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై జంట హత్య కేసు నమోదైంది. వీరిపై 302 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరితో పాటు మరి కొందరి మీద కేసులు నమోదు చేశారు. జంట హత్యల ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గాను, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7 నిందితుడుగా చేర్చుతూ పోలీసులు కేసులు నమోదు చేశారు.

పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆలియాస్‌ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వర్లు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలోకి హుజూర్‌నగర్‌ జిల్లాలో ఓ వివాహానికి హాజరై తిరిగి గుండ్లపాడుకు వస్తుండగా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో వీరిద్దరు హత్యకు గురయ్యారు. వెల్దుర్తి మండలం బొదిలవీడు ప్రాంతానికి చేరుకున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఒక స్కార్పియో ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లింది, అయితే బైక్‌మీద ఉన్న వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావు చనిపోయారా లేదా అని బైక్‌ను ఢీకొట్టిన స్కార్పియోలో ఉన్న నలుగురు నిందితులు పరిశీలించారు. అయితే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని రాయితో మోది చంపారనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆ స్కార్పియో వాహనాన్ని స్పాట్‌లోనే వదిలేసి నలుగురు నిందితులు పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఈ జంట హత్యలు కలకలం రేపాయి.
అయితే ఈ జంట హత్యల వెనుక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని సిట్టింగ్‌ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్న నేప«థ్యంలో పిన్నెల్లి సోదరులతో పాటు మరో ఏడుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 ఎన్నికల సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మిషన్‌ను ధ్వంసం చేస్తున్న వీడియో సంచలనం సృష్టించింది. ఆ మేరకు పిన్నెల్లి మీద కేసు నమోదు చేశారు. రెండు టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో ఈ జంట హత్యలు జరిగాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, వీటి వెనుక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News