అన్ని శాఖల బండారం బయటపడుతోంది.. బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో అవినీతి విళయతాండవం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా అవినీతే జరిగిందని, అన్ని అంశాల్లో అవినీతే అని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-07-14 10:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో అవినీతి విళయతాండవం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా అవినీతే జరిగిందని, అన్ని అంశాల్లో అవినీతే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి పేదలకు అందించే పథకాల విషయంలో కూడా అక్రమాలు చేశారంటూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు బాలకృష్ణ. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కోటిపిలో అర్ధాంతరంగా నిర్మాణం నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఆయన తాజాగా పరిశీలించారు. వాటి స్థితిగతుల గురించి అధికారులను ఆరా తీశారు. వాటి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలంటే అయ్యే ఖర్చు, పునఃనిర్మాణం వీలవుతుందా లేదా? నిర్మాణాల స్థితిగతులెలా ఉన్నాయి, ఎన్ని ఇళ్లు పూర్తయ్యాయి, ఏవి ఎంత మేరా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి వంటి పలు అంశాలకు సంబంధి పూర్తి విరాలను అందించాలని అధికరులను కోరినట్లు సమాచారం.

కొటిపిలో పర్యటించిన బాలకృష్ణ

కొటిపిలో దాదాపు రూ.4 కోట్ల వ్యవయంతో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు పనులను కూడా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అక్కడ చేసిన భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం అక్కడి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. సబ్‌స్టేషన్ ఔట్‌పుల్, ఇన్‌పుట్, అక్కడి ఉన్న విద్యుత్ అవసరాలు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. విధుల విషయంలో అందరూ అలెర్ట్‌గా ఉంటూ బాధ్యతగా పనిచేయాలని, అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు బాలకృష్ణ. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి శాఖలో గత ఐదేళ్లలో భారీగా అవినీతి జరిగిందని, అదంతా కూడా బయట పడే సమయం వచ్చిందని ఆయన వెల్లడించారు.

వైసీపీ హయాంలో అంతా నాశనమే

‘‘వైసీపీ హయాంలో రాష్ట్రం ప్రతి వ్యవస్థ నిర్వీర్యమైంది. అన్ని శాఖల్లో అవినీతి తాండవం చేసింది. ఇసుక, మద్యం, మైనింగ్‌లలో అక్రమాలు చేసి కమీషన్ల నొక్కేసింది వైసీపీ ప్రభుత్వం. పాలించడం చేతకాక మూడు రాజధానులు, నవరత్నాలు అంటూ ప్రజలను మోసం చేశారు. టీడీపీ హయాంలో పేదలను అందించాలని లేటెస్ట్ టెక్నాలజీ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. అవి పూర్తయ్యేసరికి ప్రభుత్వం మారింది. కానీ వాటిని పూర్తి చేసి ఇచ్చిఉండొచ్చు. అలా చేస్తే ప్రజలకు ఇళ్లు ఇచ్చింది చంద్రబాబు అంటారన్న భయంతో ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించేశారు. నమ్మి ఓటేసిన పేదలను నిలువునా మోసం చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ లక్ష్యం ఒక్కటే

రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు అందివ్వాలన్నదే టీడీపీ లక్ష్యం అని బాలకృష్ణ చెప్పారు. ‘‘ఆ లక్ష సాధనలో భాగంగానే టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. పేదలను ఇల్లు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపాలని అనుకున్నాం. కానీ వ్యక్తిగత లబ్ది పొందాలన్న దురుద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం వీటి నిర్మాణాన్ని ఆపేసింది. టిడ్కో ఇళ్లలోని సామాగ్రిని కూడా నాశనం చేసింది. అయినా ప్రజలకు భయం అక్కర్లేదు. ఆరునెలల్లో వీటిని సరిచేసి ప్రతి నిరుపేదలకు అందిస్తాం. గతంలో హిందూపురం ప్రాంతాన్ని మా నాన్న స్వర్గీయ ఎన్‌టీ రామారావు అభివృద్ధి చేశారు. ఆయన ఆశయాలను మరింత ముందుకుతీసుకెళ్తాం. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో చర్చించాను. అందుకు ఆయన సానుకూలంగానే స్పందించారు’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News