ఏపీ అధికారుల్లో ఆందోళనలు

ప్రభుత్వం మారితే మేము ఇక్కడ పని చేయలేమని, మమ్మల్ని ఇక్కడ నుంచి బదిలీ చేయాలని సీఎస్‌ చుట్టూ తిరుగుతున్న అధికారులు.

Update: 2024-05-27 11:34 GMT

ఆంధ్రప్రదేశ్‌ బ్యూరో క్రెసీలో ఓ గమ్మల్తైన వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరిగిన ప్రతి సారి ఇది రివాజుగా మారింది. అప్పటి వరకు ఉన్న ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన అధికారులు ఎన్నికలు వచ్చాయంటే వారిలో గుబులు మొదలవుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా అధికారుల్లో అందోళనలు మొదలవుతున్నాయి. తాజాగా మే 13 ఎన్నికలు జరగడం, జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపధ్యంలో ఈ రకమైన వాతావరణం అధికారుల్లో నెలకొంది. ఎన్నికల్లో ఫలితాలు తారుమైరై ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం వస్తే ఇక మన పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందనే ఆందోళనల్లో ఉన్నారు. ఇది ఎక్కువుగా ఐఏఎస్‌ అధికారులు, డిప్యుటేషన్‌లపై వచ్చిన సెంట్రల్‌ సర్వీసు అధికారులతో పాటు మరి కొందరు ఐపీఎస్‌ అధికారులు ఇదే భావనలో ఉన్నట్లు అధికార వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఎన్నికల ముందు వరకు సీఎం జగన్‌ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, రెండో సారి కూడా జగన్‌ ప్రభుత్వమే వస్తుందని భావనలో ఉన్న ఉన్నతాధికారులు, ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, పెరిగిన పోలింగ్‌ పర్సెంటేజీ, రాజకీయ విశేషకులు ఇలా ఎటు చూసినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వస్తుందనే టాక్‌ వినిపిస్తుంటంతో ఇక ఇక్కడ నుంచి సర్థుకోవడం మంచిదనే భావనలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సమస్యలు చుట్టుముట్టుతాయని, వీటి నుంచి బయట పడాలంటే ఇక్కడ నుంచి సర్థుకోవడమే మంచిదనే ఆలోచనల్లో ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రేల్వే శాఖకు పంపించండి
కొంత మంది తెలంగాణకు, మరి కొంత మంది మదర్‌ డిపార్ట్‌మెంట్‌లకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. వీరిలో ఇది వరకు ఆంధ్రప్రదేశ్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా విధులు నిర్వహించి, ఎన్నికల ముందు బదిలీ అయిన వాసుదేవరెడ్డి ఒకరు. ఈయన ఇంటియన్‌ రైల్వే సర్వీసుకు చెందిన అధికారి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యుటేషన్‌పై వాసుదేవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా పోస్టు వేయించుకున్నారు. సహజంగా ఎక్సైజ్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి గతంలో దీనికి ఎండీగా వ్యవహరించే వారు. జగన్‌ ప్రభుత్వంలో మాత్రం దానికి తిలోదకాలిచ్చి ఫారిన్‌ సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారికి ఈ పోస్టు కట్టబెట్టారు. దీనిపై అప్పట్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఈయన రైల్వే అధికారిగా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో పని చేసారు. ఆ సమయంలో ప్రస్తుతం సీఎం కార్యాలయంలో పని చేస్తున్న ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రైల్వేస్‌ కు సంబంధించిన సమాచారాన్ని వైఎస్‌ర్‌సీపీకి చేరవేస్తూ ఆ పార్టీ నేతలకు చేరువయ్యారని, దీంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి నచ్చిన అధికారి కాబట్టి మొదటి మూడేళ్ల డిప్యూటేషన్‌ గడువు ముగినినా, కేంద్రంలో తమ పరపతిని ఉపయోగించి మరో మూడేళ్ల పాటు వాసుదేవరెడ్డి డిప్యూటేషన్‌ను కొనసాగించేలా కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చారనే టాక్‌ కూడా ఉంది. ఎన్నిలకు ముందు ప్రతిపక్షాలు వాసుదేవరెడ్డిపై విమ్శలు చేస్తూ వచ్చాయి. ఎన్నికల సమయంలో వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తూ.. వాసుదేవరెడ్డికి ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇదే బాటలో ఆర్థిక శాఖ అధికారులు
ఆర్థిక శాఖ అధికారులు కూడా ఇదే బాటలో ఉన్నట్లు చర్చ ఉంది. ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, అదే శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మరో ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌ కూడా ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. బిల్లుల చెల్లింపుల్లో కేవీవీ సత్యనారాయణ చక్రం తిప్పినట్లు విమర్శలు ఉన్నాయి. మరో ఆర్థిక కార్యదర్శి గుల్జార్‌ కూడా లైన్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ మేకు ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపధ్యంలో ఇది వరకే ఆయనకు అవకాశం వచ్చిందని టాక్‌ నడుస్తోంది. ఇక రావత్‌ గతేడాదిలో తెలంగాణకు వెళ్లేందుకు గతేడాదే దరఖాస్తులు పెట్టుకున్నారని, దానిని పరిశీలించాలని సీఎస్‌ చుట్టూ తిరుగుతున్నట్లు చర్చ ఉంది. కానీ అది ఇంకా వర్క్‌ అవుట్‌ కాలేదనే టాక్‌ ఉంది.
ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఐపీఎస్‌ అధికారుల్లో కూడా ఇదే వాతావరణం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ ఉంది. సిట్‌ ఐజీగా, సీఐడీ ఐజీగా ఉన్న కొల్లురఘురామిరెడ్డి వంటి పలువురు ఐపీఎస్‌ అధికారులు కూడా డిప్యూటేషన్‌లపై వేరే ప్రాంతలకు వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవీవీ సత్యనారాయణ డిప్యూటేషన్‌ పూర్తి అయినా తిరిగి కొనసాగేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. తనను రైల్వే శాఖకు బదిలీ చేయాలని వాసుదేవరెడ్డి, తనను కూడా రిలీవ్‌ చేయాలని కేవీవీ సత్యనారాయణలు ఇటీవల సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి కోరినట్లు అధికార వర్గాల్లో చర్చ ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి వీరు అనుకూలంగా పని చేయడం, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నడుచుకోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే చర్చ కూడా అధికార వర్గాల్లో చర్చ ఉంది. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు కీలక పోస్టుల్లో పని చేసిన కొందరు అధికారులు డిప్యుటేషన్‌లు, ఉన్నత చదువుల పేరుతో బయట ప్రాంతాలకు వెళ్లారనే టాక్‌ కూడా ఉంది.
Tags:    

Similar News