పేదల కళ్లలో ఆనందం కోసం.. టెంకాయ కొట్టనున్న బాబు
అన్నమయ్య జిల్లాలో ఈ రోజు సీఎం చంద్రబాబు పర్యటన.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-12 06:13 GMT
పేదలకు సొంతింటి కల సాకారం చేయడానికి టిడిపి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. సొంతింటి కల నిజం చేసుకుంటున్న పేద కుటుంబాలకు శుభాకాంక్షలు తెలపడానికి బుధవారం ఆయన అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో..
"పేదల ఇంటి వద్ద టెంకాయ కొట్టి, శుభాకాంక్షలు తెలియజేయడ. గృహప్రవేశాలు చేయించనున్నారు"
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాక నేపథ్యంలో దేవగుడిపల్లి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగా నిర్మించిన ఇండ్ల వద్ద పండుగ వాతావరణంలో తీర్చిదిద్దారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దేవగుడి పల్లెకు చేరుకుంటారు ఆ తర్వాత పేదలకు ప్రభుత్వం నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
మూడు లక్షల ఇళ్లు ప్రారంభం..
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడి పల్లి నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని మూడు లక్షల ఇళ్ళను వచ్చువల గా ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
పటిష్ట ఏర్పాట్లు
దేవగుడిపల్లెలో భద్రత ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమీక్షించారు. దేవగూడిపల్లిలో ఏర్పాటను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలకు ఇబ్బంది లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబెల్లి చెప్పారు.
దేవగుడి పల్లెలో పర్యటన ఇలా..
రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 10.40 గంటలకు చేరుకుంటారు. 10.55 గంటలకు ముఖ్యమంత్రి ఏం చంద్రబాబు పేదలతో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు చిన్నమండెం లో ఏర్పాటుచేసిన ప్రజా వేదిక సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ఎన్ చంద్రబాబు ప్రసంగిస్తారు. 0 2.30 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న తర్వాత సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లో విశాఖపట్నం బయలుదేరి వెళతారు.