సీఎం చంద్రబాబు, పవన్‌లు క్షమాపణలు చెప్పాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

Update: 2024-09-30 13:28 GMT

శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబు ఇప్పటికైన క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి వెల్లంపల్లి డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబు మాటలను తప్పు పట్టిందన్నారు. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌తో వాస్తవాలు వెల్లడి కావన్నారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్నారు. ఆ విచారణ సంస్థే చంద్రబాబును కూడా ప్రశ్నించాలన్నారు. సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లను కోరారు. ఎన్‌డీడీబీ రిపోర్టు టీడీపీ కార్యాలయంలో విడుదల చేయడంపైన విచారణ జరపాలన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా కల్తీ జరగలేదనే ఆరోపణలు ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారన్నారు. సిట్‌ వేయాల్సిన అవసరం ఏమిటన్నారు. సెకండ్‌ ఒపీనియన్‌ను ఎందుకు తీసుకోలేదని సీప్రీం కోర్టు ప్రశ్నించిందన్నారు. మూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కోర్టు వివాచరణ ద్వారా అనేక అనుమానాలు తొలిగి పోయాయన్నారు.

Delete Edit
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా వ్యవహరించిందని మాజీ మంత్రి రోజా అన్నారు. సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు కనుసైగల్లోనే సిట్‌ అంటే సిట్, స్టాండ్‌ అంటే స్టాండ్‌ అంటూ వ్యవహరించే టీమ్‌పై తమకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. ఈ కేసులో సుప్రీం కోర్టు కలగజేసుకోవాలన్నారు.
Tags:    

Similar News