ఆశా వర్కర్లపై వేధింపులు.. టీడీపీ నేతలపై చర్యలకు డిమాండ్

తిరుపతి జిల్లాలో ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై కఠిన చర్యలకు చొరవ చూపాలని సిఐటియు కోరింది.

By :  Admin
Update: 2024-07-27 10:59 GMT

తిరుపతి జిల్లాలో ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై కఠిన చర్యలకు చొరవ చూపాలని సిఐటియు ఆధ్వర్యంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీహరికి వినతి పత్రం సమర్పించారు. శనివారం మధ్యాహ్నం డిఎంహెచ్ ఓ కార్యాలయంలో డాక్టర్ శ్రీహరిని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు జి. బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, నేతలు మునిరాజ, ఆర్. వెంకటేష్, రాధాకృష్ణ, ఎన్ డి శ్రీనివాసులతో కలిసి డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు.

జిల్లాలో రాజకీయ వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయని స్కీం వర్కర్లను అదేపనిగా అధికార పార్టీ నేతలు జిల్లాలో పలుచోట్ల ఇబ్బందులకు గురి చేస్తున్నారని కందారపు మురళి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో స్థానిక ఆశా వర్కర్ కస్తూరి కృష్ణవేణిని తొలగించమని స్థానిక అధికార పార్టీ నాయకులు అధికారులపై తీవ్రస్థాయిలో వత్తిడి తెచ్చారని వత్తిడికి తలొగ్గక వాస్తవాల కనుగుణంగా వ్యవహరించినందుకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని మహిళా డాక్టర్ పై దాడికి పూనుకున్నారని ఇక్కడ ఎలా పని చేస్తారో? తాము చూస్తామని హెచ్చరించారని కందారపు మురళి ఆ డి ఎం హెచ్ ఓ కి వివరించారు.

దాడికి పాల్పడిన స్థానిక టిడిపి నేతలపై పోలీస్ కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని వారు డిఎంహెచ్ఓ కు విజ్ఞప్తి చేశారు. దాడికెత్తించిన వారి గురించిన సమాచారం జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో ఉందని తాము ఇలాంటి అనుమతించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఆర్. లక్ష్మి, మునిరాజా ఆర్ వెంకటేష్ రాధాకృష్ణ ఎండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News