నీతి అయోగ్ భేటీలో వికసిత్ ఏపీ-2047ను వివరించనున్న చంద్రబాబు

ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఇందులో దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను ఆయన వివరించనున్నారు.

Update: 2024-07-27 05:16 GMT

ఢిల్లీలో ఈరోజు జరగనున్న నీతి అయోగ్ కీలక భేటీకి ఏయే రాష్ట్ర సీఎంలు హాజరవుతారు.. ఎవరెవరు డుమ్మా కొడతారన్నది హాట్ టాపిక్‌గా మారింది. బడ్జెట్‌లో నిధులు లభించని రాష్ట్రాలు అన్నీ ఈ సమావేశానికి దూరం పాటించాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బాయ్‌కాట్ నీతి అయోగో నినాదాన్ని వారు స్మరిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి హాజరయ్యే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల నిర్ణయాలు విభిన్నంగా ఉన్నాయి. ఈ భేటీ ఆంధ్ర సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. అందుకోసం ఇప్పటికే ఢిల్లీకి కూడా బయలుదేరారు. కాగా తెలంగాణ సీఎం రేవంత్ మాత్రం డుమ్మా కొట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

చంద్రబాబు చర్చించే అంశాలివే!

ఢిల్లీ వేదికగా జరిగే నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు కీలక అంశాలను లేవనెత్తనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, అమరావతి నిర్మాణంపైనే బాబు దృష్టి పెట్టనున్నారు. దీంతో పాటుగా వికసిత్ భారత్ 2047 అజెండాగా సాగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలను చంద్రబాబు ప్రస్తావించనున్నారు. ఇందులో భాగంగానే వికసిత్ భారత్‌ 2047లో భాగంగానే ఏపీ సర్కార్.. వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఈ భేటీలో వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యసాధనలో పోలవరం, అమరావతి స్థానం ఎలా ఉంటుంది అన్న అంశాలపై చంద్రబాబు ఈ భేటీలో మాట్లాడనున్నారు. దీంతో పాటుగానే డిజిటల్ కరెన్సీ ఆవశ్యకత, జీడీపీ వృద్ధి రేటు పెరుగుదలకు తీసుకునే చర్యలను కూడా ఆయన వివరించనున్నారు. ఈ సమావేశానికి ముందు, సమావేశం తర్వాత కూడా అందుబాటులో ఉండే కేంద్రమంత్రులతో భేటీ కావడానికి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


ఆంధ్ర పరిస్థితిపై చర్చ


కేంద్ర మంత్రులతో జరిగే భేటీలో బడ్జెట్‌లో ఏపీకి జరిగిన కేటాయింపులపై చంద్రబాబు కృష్ణతలు తెలపనున్నారు. అంతేకాకుండా ఢిల్లీ వచ్చి మారీ ఆంధ్ర మాజీ సీఎం చేసిన ధర్నా, అందులోని వాస్తవాలపై కూడా చంద్రబాబు వివరించనున్నట్లు సమాచారం. ఈ అంశాలపై ముఖ్యంగా కేంద్ర హోమంత్రి అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై షాతో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. అదే విధంగా పలు ఇతర శాఖల మంత్రులతో కూడా రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి చర్చిస్తారని, కేంద్రం ఏవియేషన్ మంత్రితో ఆంధ్రలో నిర్మించాలని భావిస్తున్న కొత్త విమానాశ్రలపై కీలకంగా భేటీ కానున్నట్లు సమాచారం. వీటన్నింటితో పాటు పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై ప్రత్యేక భేటీ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. పోలవరం నిర్మాణానికి సహకరిస్తామన్న కేంద్రం.. ఎంత మేరా నిధులను కేటాయించవచ్చు.. ఎన్ని విడతల్లో నిధులనుఅందించే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ పునఃనిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభించాలి. వంటి విషయాలపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News