శబ్దంతో సాగే అద్భుత క్రికెట్ క్రీడ

పాకిస్తాన్ లో జరిగిన తొలి అంథ బాలికల టీ20 క్రికెట్ మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది.

Update: 2025-11-26 04:50 GMT
Blind Woman International Cricketers

కొలంబో (శ్రీలంక)లో జరిగిన తొలి అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ జట్టు దక్షిణాఫ్రికాను 59 పరుగుల తేడాతో ఓడించి చాంపియన్ అయింది. ఈ విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం అంధుల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని పాంగి కరుణ కుమారి కీలక పాత్ర పోషించింది. కానీ చాలా మందికి ఒక్కటే సందేహం “అంధులు క్రికెట్ ఆడతారా? అది ఎలా సాధ్యం.?”

అవును అంధుల క్రికెట్ (Blind Cricket) పూర్తిగా శబ్దంపై ఆధారపడి ఆడే అద్భుతమైన ఆట. దీన్ని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) నిర్వహిస్తుంది. మహిళల మ్యాచ్‌లను కూడా ఇదే నియమాలతో నిర్వహిస్తారు.

బంతి ఎలా ఉంటుంది?

సాధారణ ప్లాస్టిక్ బంతి కాదు. లోపల గుండు బేరింగ్ లు (bearings) ఉండే గట్టి ప్లాస్టిక్ బంతి. బౌలింగ్ చేసినప్పుడు, బ్యాటింగ్ చేసినప్పుడు, ఫీల్డింగ్‌లో బంతి దొర్లినప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని బట్టే ఆటగాళ్లు బంతి దిశను, వేగాన్ని అంచనా వేస్తారు.

ఆటగాళ్లు ఎలా వర్గీకరిస్తారు?

అంధత్వం స్థాయి బట్టి మూడు వర్గాలు

B1 – పూర్తిగా దృష్టి లేనివాళ్లు.

B2 – కొంచెం కాంతి మాత్రమే కనిపించేవాళ్లు.

B3 – కొంత దృష్టి ఉన్నవాళ్లు (ఫింగర్ కౌంటింగ్ వరకు).

ఒక్కో జట్టులో కనీసం 4 మంది B1 ఆటగాళ్లు తప్పనిసరి. మిగతా వాళ్లు B2, B3 కావచ్చు.

మైదానం, నియమాల్లో మార్పులు

పిచ్ పొడవు 20.12 మీటర్లు (సాధారణ 22 యార్డులకు బదులు)

బౌండరీ 40-45 యార్డులు మాత్రమే.

ఒక్కో ఇన్నింగ్స్ 20 ఓవర్లు.

బౌలర్ “బౌల్” అని, బ్యాటర్ “ప్లే” అని అరవాలి. అప్పుడే బౌలింగ్ చేయవచ్చు.

రన్ అవుట్, స్టంప్ అవుట్ కాకుండా బౌల్డ్ మాత్రమే ఏకైక వికెట్ తీసే మార్గం కాదు. రనౌట్, క్యాచ్ కూడా ఉంటాయి.


అంధబాలికల క్రికెట్ భారత జట్టులో ఏపీ విద్యార్థిని కరుణ అద్భుత ప్రతిభ

భారత జట్టులో ఆంధ్రప్రదేశ్ బలం

ఈసారి ఛాంపియన్ అయిన భారత జట్టులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా క్రీడాకారులు ఉన్నారు. వారిలో విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని పంగి కరుణ కుమారి (B1 వర్గం) ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.

ఆ ఆనందంలోనే కిషోర్ గ్రానైట్స్ అధినేత గొట్టిపాటి హర్ష రూ.5 లక్షల నగదు బహుమతి ప్రకటించచారు. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ సందర్భంగా గొట్టిపాటి హర్షకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

శబ్దంతో బంతిని చూసే ఈ ఆటగాళ్లు మనకు ఒకటే నేర్పుతున్నారు. కళ్లు మూతబడినా కలలు మూసుకోరాదని!

Tags:    

Similar News