kTR corruption evidence|కేటీఆర్ పిటీషన్ డిస్మిస్ అయిన కారణలివేనా ?
కేటీఆర్ వాదనలో పసలేదని గుర్తించింది. ఇదేసమయంలో కేసునమోదు చేయటంలో ఏసీబీ దగ్గర సరైన సాక్ష్యాధారాలున్నట్లు గుర్తించింది.;
ఫార్ములా కార్ రేసు అవినీతి కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటీషన్ను హైకోర్టు కొట్టేసింది. మంత్రిగా ఉన్నపుడు కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని, అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఏసీబీతో విచారణ చేయిస్తోంది. ఏసీబీ విచారణకోసం కేటీఆర్ కు నోటీసులు ఇవ్వగానే తనపై నమోదుచేసిన కేసును కొట్టేయాలని కేటీఆర్(KTR) హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే సుదీర్ఘవిచారణ తర్వాత కేటీఆర్ వేసిన పిటీషన్నే హైకోర్టు(Telangana Highchourt)లోని జస్టిస్ కే. లక్ష్మణ్ ధర్మాసనం కొట్టేసింది. తనపిటీషన్ విచారించిన హైకోర్టు ఏసీబీ కేసు చెల్లదని తీర్పువస్తుందని కేటీఆర్ బలంగా నమ్మారు. అలాంటిది పూర్తిగా రివర్సులో తీర్పు వచ్చేటప్పటికి కేటీఆర్ తో పాటు యావత్ పార్టీనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే అర్జుంటుగా హైకోర్టు తీర్పును సవాలుచేస్తు సుప్రింకోర్టులో మరో పిటీషన్ వేశారు.
సరే, సుప్రింకోర్టులో ఏమవుతుందన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే కేటీఆర్ పిటీషన్ను హైకోర్టు ఎందుకని కొట్టేసింది ? ఎందుకంటే కేటీఆర్ వాదనలో పసలేదని గుర్తించింది. ఇదేసమయంలో కేసునమోదు చేయటంలో ఏసీబీ దగ్గర సరైన సాక్ష్యాధారాలున్నట్లు గుర్తించింది. అందుకనే కేటీఆర్ వేసిన పిటీషన్ను కొట్టేసింది. తీర్పులో జస్టిస్ కే. లక్ష్మణ్ కొన్నికామెంట్లు చేశారు. ఆ కామెంట్లను గమనిస్తే ప్రభుత్వ నిధులదుర్వినియోగం జరిగిందని జస్టిస్ పూర్తిగా కన్వీన్స్ అయినట్లే అర్ధమవుతోంది. కేసుదర్యాప్తుకు ప్రాధమిక ఆధారాలున్నట్లు విచారణ సందర్భంగా జస్టిస్ చెప్పారు. ఏసీబీ దర్యాప్తును ప్రాధమిక దశలోనే నిలిపేయటం సాధ్యంకాదన్నారు. కేసుదర్యాప్తును అడ్డుకోవటమంటే తొందరపాటు అవుతుందని చెప్పారు. ఏసీబీ దర్యాప్తును కోర్టు తనచేతుల్లోకి తీసుకోబోదని స్పష్టంగా ప్రకటించారు.
హెచ్ఎండీఏ(HMDA) నిధులు సుమారు రు. 55 కోట్లను రెండు విడతలుగా విదేశీకంపెనీకి చెల్లించింది అనేందుకు అవసరమైన సాక్ష్యాధారాలున్నట్లు జస్టిస్ నూరుశాతం కన్వీన్స్ అయ్యారు. నిధుల బదిలీ దురుద్దేశ్యంతో జరిగిందా ? తన లబ్దికోసమే మాజీమంత్రి నిధులను బదిలీచేయాలని ఆదేశించారా ? లేకపోతే మూడోపార్టీకి లబ్దిజరిగేట్లుగా మాజీమంత్రి వ్యవహరించారా ? అన్నవిషయాలు తేలాలంటే దర్యాప్తు జరగాల్సిందే అని కే. లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేసిందని, అనుమతి లేకుండానే కోట్లరూపాయలు బదిలీ జరిగింది అనేందుకు ప్రాధమిక సాక్ష్యాలున్నట్లు జస్టిస్ చెప్పారు. అవినీతి కేసులో ప్రాధమికసాక్ష్యాలు కనబడుతున్నపుడు కేసును దర్యాప్తు చేయనీకుండా ఏసీబీని అడ్డుకోవటం సాధ్యంకాదన్నారు. అందుకనే కేసుదర్యాప్తును అడ్డుకోవాలని కోర్టు అనుకోవటంలేదని చెప్పారు. దురుద్దేశ్యం, ఆరోపణలు, నిజాయితీ, అవినీతి అన్నవిషయాలు దర్యాప్తులోనే తేలుతాయన్నారు. అందుకనే కేసుదర్యాప్తుకు ఏసీబీ(ACB)కి అనుమతిస్తు కేటీఆర్ పిటీషన్ను కొట్టేస్తున్నట్లు జస్టిస్ ప్రకటించారు.
హైకోర్టు జస్టిస్ కే. లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు, గుర్తించిన అంశాలను గమనిస్తే ఫార్ములా కేసు నిధులబదిలీలో అవినీతి జరిగినట్లు అర్ధమైపోతుంది. అవినీతి జరిగింది అనేందుకు మరో రెండుఆధారాలు కూడాఉన్నాయి. అవేమిటంటే రు. 55 కోట్లను విదేశీకంపెనీకి బదిలీ చేసేటపుడు ఆర్ధికశాఖ అనుమతి, క్యాబినెట్ ఆమోదం తీసుకోకపోవటం. ఇక రెండో ఆధారం ఏమిటంటే ఏదైనా విదేశీకంపెనీకి నిధులు బదిలీచేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)(RBI) అనుమతి తప్పనిసరి. ఫార్ములా కేసు(Formula E Car Race)లో బ్రిటన్లో ఉన్న ఎఫ్ఈవో(FEO) కంపెనీకి రు. 55 కోట్ల బదిలీలో హెచ్ఎండీఏ ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. నిబంధనలను ఉల్లంఘించింది కాబట్టే తెలంగాణా ప్రభుత్వానికి ఆర్బీఐ రు. 8 కోట్ల జరిమానా విధించింది. నిధుల బదిలీలో హెచ్ఎండీఏ తప్పుచేసింది కాబట్టే తెలంగాణ ప్రభుత్వం రు. 8 కోట్ల జరిమానా చెల్లించింది. తప్పుజరగకపోతే ఆర్బీఐ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేదే కాదు. ఇక్కడే కేటీఆర్ కోర్టుకు దొరికిపోయారు.
అడ్డుగోలు వాదనేనా ?
జరిగిన తప్పు ఇంతస్పష్టంగా కనబడుతున్నా, అవినీతి జరిగింది అనేందుకు ప్రాధమిక సాక్ష్యాలున్నాయని కోర్టు చెప్పిన తర్వాత కూడా కేటీఆర్, హరీష్ తదితరులు అడ్డుగోలు వాదన వినిపిస్తున్నారు. ఫార్మాలా కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, గ్రీన్ కో(GreenKo) కంపెనీకి ప్రభుత్వం నిధులు బదిలీచేయలేదని పదేపదే సమర్ధించుకుంటున్నారు. ప్రభుత్వం నుండి గ్రీన్ కో కంపెనీకి నిధులు బదిలీనే జరగలేదు కాబట్టి అవినీతి జరిగిందన్నమాటే తప్పని అడ్డదిడ్డమైన లాజిక్ వినిపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం కూడా హెచ్ఎండీఏ నుండి గ్రీన్ కో కంపెనీకి నిధులు బదిలీ అయ్యిందని ఎక్కడా చెప్పలేదు. హెచ్ఎండీఏ నుండి నిధులు బదిలీ అయ్యింది ఎఫ్ఈవో కంపెనీకి. ఎఫ్ఈవో కంపెనీ నుండి గ్రీన్ కో కంపెనీకి నిధులు మళ్ళినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. హెచ్ఎండీఏ నుండి ఎఫ్ఈవో కంపెనీకి నిధులు మళ్ళించటం, ఆర్బీఐ ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలు జరిమాన విధించటాన్ని మాత్రం కేటీఆర్, హరీష్ తదితరులు ఎవరూ మాట్లాడటంలేదు. ఈ పాయింట్ దగ్గరే అర్ధమైపోతోంది అవినీతి జరిగిందని. అవినీతి బయటపడిన తర్వాత ఎలా బయటపడాలో అర్ధంకాక కేటీఆర్ అండ్ కో అడ్డదిడ్డమైన వాదనలు వినిపిస్తున్నారంతే.