విశాఖలో దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకుల హాహాకారాలు

విశాఖపట్నంలో భారీ ముప్పు తప్పింది. నగరంలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది.;

Update: 2025-08-29 06:13 GMT
Flames in RTC Bus
విశాఖపట్నంలో భారీ ముప్పు తప్పింది. నగరంలోని శాంతిపురం వద్ద ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బస్సు దగ్ధమైంది. బస్సు ఇంజిన్ లో మంటలు గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ బస్సు దగ్ధమైన చోటుకి పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని రెండు వాహనాలతో మంటలార్పారు. బస్సు కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు తెలిపారు. బస్సు సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం చేశారన్నారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరక్కుండా చూసిన డ్రైవర్ ను అధికారులు అభినందించారు.
Tags:    

Similar News