జర్మనీలో మరణించిన ఏపీ విద్యార్థిని..తల్లడిల్లిన తల్లిదండ్రులు
ఉన్నత చదువులకెళ్లి జర్మనీకి వెళ్లింది. అక్కడ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణించింది.;
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని ఆశించింది. జర్మనీ దేశమైతే అనుకూలంగా ఉంటుందని భావించింది. 2022లో అక్కడకు వెళ్లింది. ప్రస్తుతం ఆల్ అనే పట్టనంలో ఆమె ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది. భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ ఆమె భవిష్యత్‌ను నాశనం చేసింది. ఆరోగ్యం విషమించడంతో విదేశాలలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే ఆశతో పాటు తన కుటుంబానికి బాసటగా నిలవాలనే కోరికలు నెరవేరకుండానే గత సోమవారం ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న ఆ కుటుంబం తల్లడిల్లి పోయింది. దీర్ఘాయుష్షుతో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోకుండానే చిన్న వయస్సులోనే మృత్యువాత పడటంతో ఆమె తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగి పోయారు. గుండెలు బాదుకుంటూ విలిపించారు. స్థానికులను సైతం కన్నీరుమున్నీరయ్యారు.