నామినేటెట్ పోస్టుల్లో మాజీ ఐఏఎస్ లు.. పీ కృష్ణయ్య తర్వాత పీవీ రమేషేనా

నామినేటెట్‌ పోస్టుల్లో మాజీ ఐఏఎస్‌ అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పీసీబీకి చైర్మన్‌గా పీ కృష్ణయ్యను నియమంచింది. తర్వాత పీవీ రమేష్‌ లైన్‌లో ఉన్నట్లు చర్చ సాగుతోంది.

Update: 2024-09-19 07:24 GMT

చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేష్‌కు నామినేటెడ్‌ పోస్టు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతన్నాయనే టాక్‌ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మాజీ ఐఏఎస్‌ పీ కృష్ణయ్యకు ఏపీపీసీబీ చైర్మన్‌గా ఇచ్చినట్లే రమేష్‌కు కూడా మంచి నామినేటెడ్‌ పోస్టు ఇస్తారనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

నాడు చంద్రబాబు అరెస్టు సమయంలో చాలా మంది టీడీపీ లీడర్లతో పాటు మాజీ అధికారులు మాట్లాడేందుకు వెనకడుగు వేశారు. తమ పైన కూడా కేసులు నమోదు చేస్తారనే భయంతో సాహసం చేయలేక పోయారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పి కృష్ణయ్య కూడా ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడింది లేదు. కానీ మరో మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పీవీ రమేష్‌ మాత్రం అలాంటివేమీ లెక్క చేయలేదు. ధైర్యం చేశారు. సాహసం చేసి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టును ఆయన తీవ్రంగానే ఖండించారు. అదే విషయాన్ని మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో నిజం లేదన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మేఘా కంపెనీలో సలహాదారు పదవిని కూడా వదులుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో పీవీ రమేష్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఈ సమయంలో ఆర్థిక పరమైన పలు అంశాలను చక్కబెట్టారు. పెద్ద ఎత్తున ఆర్థిక లోటు తలెత్తినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఎంతగానో శ్రమించారు. ఈ సమయంలో చంద్రబాబు, పీవీ రమేష్‌ల మధ్య బాండ్‌ ఇంకా స్ట్రాంగ్‌ అయింది. మే 2, 2014 నుంచి డిసెంబరు 2016 వరకు నాటి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలోను ప్రతి యాక్టివిటీలోను తన ఇన్వాల్వ్‌మెంట్‌ కూడా ఉందని, స్కిల్‌డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి తప్పులు జరగలేదని, నిధులు దుర్వినియోగం కాలేదని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ రమేష్‌ స్వయంగా చెప్పారు.
జగన్‌ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా కూడా పీవీ రమేష పని చేశారు. అయితే అది కొద్ది కాలమే. జగన్‌ సీఎం అయిన తర్వాత తొలి విదేశీ పర్యటనను విజయవంతం చేయడంలో పీవీ రమేష్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే మరో సలహాదారుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి అజయ్‌కల్లంతో తలెత్తిన విభేదాల కారణంగా ప్రభుత్వ సలహాదారు పదవిని తృణ ప్రాయంగా వదిలేశారు. తర్వాత మేఘా కంపెనీలో సలహాదారుగా చేరారు. చంద్రబాబు అరెస్టుతో సినారియో అంతా మారిపోయింది. దీంతో దానిని కూడా వదిలేశారు.
చంద్రబాబు పట్ల జగన్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును పీవీ రమేష్‌ ఎండగడుతూ వచ్చారు. జగన్‌ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్‌ గాడి తప్పిందని, కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నారని, అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని విమర్శించారు. దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సభలు, సమావేశాలు, సదస్సులు, మీడియా చర్చలు వంటి పలు వేదికలపై నుంచి స్వరం వినిపించారు. అప్పులు తెచ్చి పథకాలను అమలు చేయాల్సిన అవసరం లేదని, తిరిగి ఆ భారమంతా ప్రజలపైనే పడుతుందని, ప్రాథమిక విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి ప్రాథమిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, జగన్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగానే వ్యవహరించిందనే విషయాలపైన ఆయన గతంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
పీవీ రమేష్‌ చేసిన చర్చలు, ప్రసంగాలు, విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులతో పాటు వివిధ తరగతుల ప్రజలను ఆలోచింప చేశాయని, దీంతో నాటి జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత చంద్రబాబుకు ప్లస్‌ గా మారిందనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది. అయితే ఇదంతా చంద్రబాబు అధికారంలోకి వస్తే తనకు పదవి ఇస్తారనే ఉద్దేశంతోనో, ఆశతోనో చేయలేదని, జరిగిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే లక్ష్యంతోనే ప్రయత్నం చేశానని, ఒక వేళ చంద్రబాబుకు నచ్చి పదవి ఇస్తే నిస్వార్థంగానే పని చేసి మంచి పేరు వచ్చేలే కృషి చేస్తానని తన సన్నిహితుల వద్ద అన్నట్లు చర్చ కూడా ఉంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత వరకు ఏ నామినేటెడ్‌ పోస్టుకు నియామకాలు చేపట్ట లేదు. మాజీ ఐఏఎస్‌ అధికారి పీ కృష్ణయ్యదే తొలి నియామకం. కృష్ణయ్యకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు చైర్మన్‌గా చంద్రబాబు అవకాశం కల్పించడంతో మరో మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌కు కూడా నాటిమినేటెట్‌ పోస్టు ఇవ్వొచ్చనే చర్చ అటు అధికార వర్గాలు, ఇటు టీడీపీ శ్రేణుల్లోను చర్చగా మారింది. అయితే ఏ పోస్టు ఇస్తారనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయనే టాక్‌ కూడా వినిపిస్తోంది. కృష్ణయ్యకు, చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. గత 34 ఏళ్లుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌గా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014–19 చంద్రబాబు హయాంలో కూడా కృష్ణయ్యకు ఏపీఐఐసీ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ ఈవోగా కూడా పని చేశారు.
Tags:    

Similar News