కడపలో ఓట్ల లెక్కింపు

రేపు మధ్యాహ్నానికి జడ్పిటిసి ఫలితాలు వెల్లడి.;

By :  Admin
Update: 2025-08-13 16:20 GMT

కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలను మించిన ప్రాధాన్యతను ఈ ఉపఎన్నిక సంతరించుకుంది. ఈ ఉపఎన్నిక ఓటింగ్ మంగళవారం పూర్తయింది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఓట్ల లెక్కింపు, విజేత ఎవరు కానున్నారు? అన్న అంశాలపైనే ఉంది. అయితే ఆగస్టు 14వ తేదీ ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనికోసం కడపలో ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పులివెందుల, ఒంటిమిట్ట zptc స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వైసిపి ఫిర్యాదుల నేపథ్యంలో పులివెందులలోని రెండు కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ బ్యాలెట్ బాక్స్ లు అన్నిటిని కడపకు తరలించారు. కడప నగరం పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఓటింగ్ లెక్కింపు జరగనుంది.

ఏర్పాట్లు ఇవి

కడప పాలిటెక్నిక్ కాలేజీ లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు.

1. పులివెందుల జడ్పిటిసి కౌంటింగ్ కోసం 10 టేబుల్లు ఏర్పాటు చేశారు.

2. ఒక టేబుల్ లో వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు

3. మొత్తం ఒకే రౌండ్లో లెక్కింపు పూర్తి చేయడం ద్వారా తుది ఫలితం వెల్లడించనున్నారు.

ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానం

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్టలో కూడా జడ్పిటిసి స్థానానికి ఊపి ఎన్నికలు జరిగింది. ఈ ఓటును కూడా కడప పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో లెక్కించనున్నారు.

1. ఇందుకోసం 10 టేబుల్ లను ఏర్పాటు చేశారు.

2. ఒక్కో రౌండ్లో 1000 ఓటు లెక్కించడానికి వీలుగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

3. రెండు రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు.

గురువారం మధ్యాహ్నం రెండు జడ్పిటిసి స్థానాల ఫలితాలను వెల్లడించడానికి అవసరమైన ఏర్పడడానికి పోటీ చేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ ప్రకటించారు.

Tags:    

Similar News