మాజీ మంత్రి రోజాకు ఇక షాకేనా?

ఒకటి రెండు రోజులలో డీజీపీకి చేరనున్న ఆడుదాం ఆంధ్ర స్కాం విజిలెన్స్ నివేదిక;

Update: 2025-08-10 07:51 GMT

వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలలో భారీ అవినీతి జరిగిందని ,కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.ఇందులో ఏకంగా 119 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు.ఈ మొత్తం స్కాం లో ఆనాటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా హస్తం వుందన్న తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో పూర్తి స్థాయి విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం తమ నివేదికను సిద్దం చేసింది.విచారణ పూర్తవడంతో తమ నివేదికను ఒకటి రెండు రోజులలో డీజీపీకి అందించనున్నట్లు తెలుస్తోంది.క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి.

'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి నివేదిక అందిన వెంటనే వైసీపీ నేత మాజీ మంత్రి రోజా తప్పకుండా టార్గెట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.ఇటీవల కాలంలో రోజా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు.సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపధ్యంలో ఆడుదాం ఆంధ్ర అవకతవకల విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి చేరుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే గ్రామీణ స్థాయిలో సైతం క్రీడలను ప్రోత్సహించడానికి చేపట్టిన మంచి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అంటూ అందులో లాంటి అవకతవకలు జరగలేదని రోజాతో సహా వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
Tags:    

Similar News