TIRUMALA || జూన్ నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు
శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం.;
By : Dinesh Gunakala
Update: 2025-07-02 02:12 GMT
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, హుండీలో కానుకలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.
జూన్ నెలలో భారీగా ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారిని గత నెలలో 24.08 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీకి కానుకల రూపంలో రూ.119.86 కోట్లు ఆదాయం వచ్చింది. జూన్ నెలలో సగటున రోజుకు 80వేలమంది శ్రీవారిని దర్శించుకున్నారు. గత నెల 14న అత్యధికంగా 91,720మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
జూన్ నెలలో ఐదు రోజుల పాటూ ఏకంగా 90 వేలకు పైగా. మరో పది రోజులు 80 వేల మందికిపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా కాల తర్వాత జూన్ నెలలోనే అత్యధికంగా ఒక్కరోజులోనే 91వేలకుమందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
జూన్ నెలలో వేసవి సెలవులు ముగిశాయి. ఈ క్రమంలో భక్తులు భారీగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. జూన్ నెలలో రోజుకు సగటున రూ.4 కోట్ల ఆదాయం సమకూరింది. జూన్ 30న అత్యధికంగా రూ.5.30 కోట్లు ఆదాయం వచ్చింది. గత నెలలో 10.05 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జూన్ నెలలో 7వ తేదీన అత్యధికగా 45,068 మంది తలనీలాలు ఇచ్చారు. మే నెల విషయానికి వస్తే. ఆ నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకుంటే. హుండీ ఆదాయం రూ.106.83 కోట్లు సమకూరింది. దాదాపు గత మూడేళ్లుగా తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నెలకు రూ.100 కోట్లకు తగ్గకుండా వస్తోంది. ఆ రికార్డు కొనసాగుతోంది. ఈ నెలలో టీటీడీ 1.19 కోట్ల లడ్డూలను విక్రయించింది.