ఎస్పీ బాలుకి తమిళనాడులో అరుదైన గౌరవం

ప్రపంచ ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు నాట లభించని అరుదైన గౌరవం తమిళనాట లభించింది.

Update: 2024-09-26 06:58 GMT

గానగంధర్వుడు, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం దిక్కింది. తెలుగు వాడైన బాలసుబ్రహ్మణ్యంకు తెలుగు నేలపైన దొరకని ఆ గుర్తింపు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో లభించడం విశేషం. చెన్నై నగరంలోని ఓ ప్రముఖ రోడ్డుకు బాలు పేరును పెట్టాలని ఖరారు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాలుపై ఉన్న గౌరవాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆ విధంగా చూపించారు. నుంగంబాక్కంలోని కాందార్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డుకు బాలు పేరు పెట్టారు. కాందార్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డును ఇక నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవనున్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగులోనే కాదు తమిళం, మళయాళం, హిందీ, కన్నడ ఇలా అనేక భాషల్లో పాటలను పాడి ప్రజలను అలరించారు. దాదాపు 40వేలకు పైగా పాటలు పాడిన బాలు అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం చెన్నై నగరంలోనే ప్రారంభమైంది. చిన్న చిన్న కచేరీలతో మొదలైన ఆయన కెరీర్‌ సినీ ప్రపంచానికి దగ్గర చేసింది. తిరిగులేని నేపధ్య గాయకుడిగా ఆయన గొంతుకను ప్రపంచ ఎల్లలు దాటేలా చేసింది. ౨౦౨౦లో బాలు మరణించారు. 
ఎస్పీ బాలు చెన్నైలో నుంగంబాక్కం ఏరియాలో నివసించేవారు. ఈ నేపథ్యంలో నుంగంబాక్కంలోని కాందార్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డుకు బాలు పేరు పెట్టారు. కాందార్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డును ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా నామకరణం చేశారు. ఆ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కార్యాలయం నుంచి ప్రకటనను విడుదల చేసింది.
ఎస్పీ బాలు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా భాషల్లో కూడా పాటలు పాడారు. 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్‌ రికార్డు కూడా అందుకున్నారు. కేంద్రం ఆయనకు 2001లో పద్మ శ్రీ, 2011లో పద్మ భూషణ్, 2021లో పద్మ విభూషణ్‌ అందించింది. కేవలం నేపధ్య గాయకుడుగానే కాకుండా నటుడిగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. హిందీలో రూపొందించిన ఏక్‌ దుజే కేలియే చిత్రం ద్వారా ఉత్తరాదిలో కూడా ఆయన పాగా వేశారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రదారులుగా నటించిన ఆ చిత్రంలోని పాటలు నార్త్‌ ఇండియా ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయి. 80వ దశకంలో తెలుగు నాట కుర్రకారును ఉర్రూతలూగించిన మరోచరిత్ర సినిమానే హిందీలో ఏక్‌ దుజే కేలియేగా తీసారు. మరోచరిత్రలో కమల్‌ హాసన్, సరిత హీరో హీరోయిన్‌లుగా నటించారు.
Tags:    

Similar News