కూతురింటికెళ్లొచ్చే లోపే 100 సవర్లు దోచేశారు

కేసు నమోదు చేసుకున్న పల్నాడు జిల్లా పోలీసులు దొంగల కోసం వేట ముమ్మరం చేశారు.

Update: 2025-11-10 04:22 GMT

పల్నాడు జిల్లాలో భారీ దోపిడి జరిగింది. లక్షల విలువైన బంగారు ఆభరణాలను, నగదను దోొచుకెళ్లారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో గాడిపర్తి సుబ్బారావు, భారతీదేవి దంపతుల ఇంట్లో ఈ భారీ చోరీ జరిగింది. నవంబర్ 4న కుమార్తె ఇంటికి వెళ్లిన దంపతులు ఆదివారం మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ దంపతులు బీరువా తాళాలు కూడా పగులగొట్టి ఉంది. ఇంటి తాళాలతో పాటు బీరువా తాళాలు పగలగొట్టి, బీరువా తెరిచి అందులో దాచుకుని ఉన్న  100 సవర్ల బంగారం, 1 కిలో వెండి ఆభరణాలు, రూ.45 వేల నగదు దోచుకెళ్లారు. దీంతో దంపతులు ఒక్క సారిగా కుప్పకూలారు. కష్టపడి సంపాదించుకున్న బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లడంతో గుండెలు బాధుకున్నారు. 

దీంతో పోలీసులను ఆశ్రయించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ ఫిరోజ్ స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దర్యాప్తు కొనసాగుతోంది. దొంగలు ఎవరో గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల సమాచారం ఆధారంగా గాలిస్తున్నారు. ఈ చోరీ మొత్తం విలువ సుమారు రూ.80-90 లక్షలు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంటి యజమానులు లేని సమయంలో జరిగిన ఈ ఘటన పట్టణంలో భద్రతపై ఆందోళన రేకెత్తించింది. ఇలాంటి చోరీలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇళ్ల ముందు సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు ఏర్పాటు చేసుకోవడం, విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లలో ఉంచడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. అయితే చోరీకి పాల్పడిన దొంగలను  త్వరలోనే  పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News