అతలాకుతలం చేసిన 10 తుపాన్ లు
దివిసీమ ఉప్పెన గురించి ఇప్పటికీ కథలు, కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమ అత్యంత విషాద ఘటనగా నిలిచిపోయింది.
'మొంథా' తుపాన్ మంగళవారం సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటనున్న నేపథ్యంలో చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని భయంకర తుఫానుల గుర్తులు మళ్లీ మనసులో మెదులుతున్నాయి. 1977 దివిసీమ ఉప్పెన నుంచి 2025 మొంథా తుపాను వరకు చర్చనీయాంశంగా మారాయి. గత ఘటల్లో కోల్పోయిన వేలాది ప్రాణాలు, కోట్లాది ఆస్తి, నష్టాలు, వ్యవసాయ విధ్వంసాల మీద చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం ప్రపంచంలోనే అత్యధిక తుఫానులకు గురైన ప్రదేశాల్లో ఒకటి. భారత వాతావరణ శాఖ IMD డేటా ప్రకారం, 1975 నుంచి 2025 వరకు 60కి పైగా తుఫానులు ఆంధ్రప్రదేశ్ ను ప్రభావితం చేశాయి. వీటిల్లో 40కి పైగా తీవ్రమైనవి. ఈ తుఫానులు కోనసీమ, దివిసీమ, ఉత్తర ఆంధ్ర తీరప్రాంతాలను అతలాకుతలం చేసిన తుపానులుగా చరిత్రలో నిలిచిపోయాయి. అయితే తర్వాత కాలంలో ముందస్తు హెచ్చరికలు, ఎవాక్యుయేషన్ వల్ల మరణాలు తగ్గాయి, కానీ ఆర్థిక నష్టం మాత్రం భారీగానే ఉంది.
చరిత్రలోని అత్యంత భయంకర తుఫానులు
క్రింది టేబుల్‌లో 1977 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన ప్రధాన తుఫానుల వివరాలు:
| సం. | తుఫాను పేరు / సంవత్సరం | తీరం దాటిన ప్రదేశం | గాలి వేగం (కి.మీ./గం) | మరణాలు | నష్టం (సుమారు) | ప్రధాన ప్రభావం |
|---|---|---|---|---|---|---|
| 1 | దివిసీమ తుఫాను (1977) | దివిసీమ (కృష్ణా జిల్లా) | 250 | 10,000+ | ₹500 కోట్లు | 20 అడుగుల సముద్ర తరంగాలు; 64 గ్రామాలు పూర్తి నాశనం. |
| 2 | మచిలీపట్నం తుఫాను (1979) | మచిలీపట్నం | 200 | 700+ | ₹800 కోట్లు | 300 మత్స్యకారులు మరణం; 18 అడుగుల తరంగాలు. |
| 3 | 1990 తుఫాను (BOB 05) | మచిలీపట్నం సమీపం | 230 | 967 | ₹1,200 కోట్లు | కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 1.5 మిలియన్ ఇళ్లు దెబ్బ. |
| 4 | 1996 తూర్పు గోదావరి తుఫాను | కాకినాడ దక్షిణం (కోనసీమ) | 215 | 1,077+ | ₹2,026 కోట్లు | లక్షల కొబ్బరి చెట్లు, 4 లక్షల హెక్టార్ల వరి పంటలు నాశనం. |
| 5 | 2003 తుఫాను | కాకినాడ సమీపం | 150 | 100+ | ₹2,500 కోట్లు | వరి, పత్తి పంటల్లో భారీ నష్టం. |
| 6 | లైలా (2010) | కాకినాడ-భద్రాచలం మధ్య | 110 | 65 | ₹1,300 కోట్లు | గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి వరదలు. |
| 7 | ఫైలిన్ (2013) | శ్రీకాకుళం సమీపం | 215 | 65 | ₹11,500 కోట్లు | 9 లక్షల మంది ఎవాక్యుయేషన్; తక్కువ మరణాలు. |
| 8 | హుద్‌హుద్ (2014) | విశాఖపట్నం | 185 | 124 | ₹61,000 కోట్లు | విశాఖ నగరం పూర్తి విధ్వంసం; 2 లక్షల చెట్లు కూలాయి. |
| 9 | మైచుంగ్ (2023) | తీర్పు రాజమహేంద్రవరం | 110 | 50+ | ₹10,000 కోట్లు+ | తీవ్ర వర్షాలు, వరదలు; చెన్నైలో కూడా ప్రభావం. |
| 10 | BOB 06 (2024) | ఆంధ్ర తీరం (అక్టోబర్) | 80-100 | 20+ | ₹5,000 కోట్లు | భారీ వర్షాలు, వరదలు; పుడుచ్చేరి, చెన్నైలో నిలిచిపోయాయి. |
పాత తుఫానుల పాఠాలు: 1977 నుంచి మార్పులు
1977 దివిసీమ తుఫాను ఆంధ్ర చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విపత్తు. 10,000కి పైగా మరణాలు, 5 లక్షల పశువులు కోల్పోవడం చోటు చేసుకుంది. ఇది ముందస్తు హెచ్చరికల లేకపోవడం వల్ల ఈ రకమైన వినాశనం మిగిల్చింది. అలాగే 1996 కోనసీమ తుఫానులో కూడా 1,077 మంది మరణించారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు పూర్తిగా కకావికలమయ్యాయి. ఈ రెండు తుఫానులు రాష్ట్రాన్ని 10-15 సంవత్సరాలు వెనక్కి నెట్టాయి.
కానీ 2013 ఫైలిన్, 2014 హుద్‌హుద్ సంభవించిన నాటికి చాలా మార్పు వచ్చింది. డాప్లర్ రాడార్లు, SMS అలర్ట్ లు, ముందస్తు సమాచారం చేరవేసి జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం, అధికార యంత్రాంగం అన్ని రకాలుగా చర్యలు చేపట్టడం, సుమారు 5-10 లక్షల మంది ఎవాక్యుయేషన్ వల్ల మరణాలు వేలల నుంచి వందలకు తగ్గాయి. 2023 మైచుంగ్‌లో 50కి పైగా మరణాలు జరిగినా, ప్రభుత్వ సహాయంతో త్వరగా కోలుకున్నారు. 2024లో BOB 06 (అక్టోబర్)లో సంభవించిన తుపాను రాజమహేంద్రవరం సమీపంలో తాకి, భారీ వర్షాలతో వరదలు తెచ్చింది. పుడుచ్చేరి, చెన్నైలో కూడా భారీ ప్రభావం చూపింది.
పునరావాసం & పాఠాలు
ఈ తుఫానులు ఆంధ్ర ప్రజల స్థిరత్వాన్ని పరీక్షించాయి. ప్రపంచ బ్యాంకు, రెడ్‌క్రాస్ సహాయంతో 1996 తర్వాత కోనసీమ 15 సంవత్సరాల్లో కోలుకుంది. ఇప్పుడు APSDMA, 500+ సైక్లోన్ షెల్టర్లు, మంగ్రోవ్ అడవులు రక్షణగా నిలుస్తున్నాయి.