టీ20 లో రోహిత్ రోల్ సంజూకే అప్పగిస్తారా ?

న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. అది కూడా స్వదేశంలో జరిగిన సిరీస్ ను క్లీన్ స్వీప్ కు గురైంది. అయితే యువజట్టు ఈ గాయానికి మందు..

By :  491
Update: 2024-11-07 09:56 GMT

భారత క్రికెట్ సంధి దశలో ఉంది. సీనియర్ క్రికెటర్లందరి వయస్సు 30 దాటింది. కొన్ని రోజులుగా టీ20 సిరీస్ కు యువజట్టునే బీసీసీఐ ఎంపిక చేస్తోంది. సంధి దశను దృఢంగా అధిగమించేందుకు తగిన ప్రణాళికలతో సిద్దంగా ఉంది.

తాజాగా దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు డర్బన్ చేరుకుంది. రేపు ఇరు జట్లు వాండర్స్ వేదికగా తొలి టీ20 జరగనుంది. మరోసారి ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కనీసం 30 పరుగులు కూడా సాధించలేదు.

తాము రిజర్వ్ బ్యాచ్ ఆటగాళ్లము ఏ మాత్రం కాదు అనే ట్యాగ్ ను తొలగించుకోవడానికి వారికి ఈ సిరీస్ ఓ మంచి అవకాశం. ముఖ్యంగా సంజూ శాంసన్ కు నిలకడగా ఫామ్ కొనసాగించగలను అని నిరూపించుకోవడానికి కూడా ఈ సిరిస్ ను ఉపయోగించుకుంటానడంలో సందేహం లేదు. బంగ్లాతో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించాడు.
T20Iలలో రోహిత్ శర్మ అనంతర కాలంలో తానే రెగ్యూలర్ విధ్వంసకర ఓపెనర్ పాత్రను సమర్థవంతంగా పోషించగలనే ట్యాగ్ రావాలంటే ప్రోటీస్ కు వ్యతిరేకంగా మంచి స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాలి. ఈ సిరీస్ లో విజయం సాధిస్తే రోహిత్ స్థానం సంజూకి అప్పగించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉంటుంది.
అభిషేక్‌కి కూడా ఇది ముఖ్యమైన సిరీస్. జులైలో హరారేలో జింబాబ్వేపై 47 బంతుల్లో సెంచరీ సాధించే సమయంలో డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ తన అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించాడు. కానీ తరువాత ఆడిన అంతర్జాతీయ టీ20 లలో 0, 10, 14, 16, 15, 4 మాత్రమే సాధించాడు.
అభిషేక్ తన స్థానాన్ని కాపాడుకోవడానికి మరింత స్థిరంగా పరుగులు సాధించడానికి ప్రయత్నించాలి. అభిషేక్ ఉపయుక్తమైన ఎడమచేతి స్పిన్నర్ కూడా. అందుకే అతనికి తుది జట్టులో చోటు ఉంటోంది. తిలక్ వర్మ కూడా ఆగష్టు 2023 లో వెస్టీండీస్ పర్యటనలో మంచి బ్యాటింగ్ అలరించినప్పటికీ తరువాత తన ఫామ్ ను కోల్పోయాడు.
12 టీ20 మ్యాచ్ లలో కేవలం ఓకే ఒక హఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సిరీస్ తరువాత తిలక్ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించలేదు. అయితే జట్టులో చోటు కోసం క్రమంగా తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ కు పదును పెట్టడం ప్రారంభించాడు. ఈ మధ్య జరిగిన స్వదేశీ సిరీస్ లలో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించి సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నాడు.
దక్షిణాఫ్రికాపై తలపడే భారత జట్టులో ఎలాంటి అనుభవం లేని పేస్ బౌలింగ్ యూనిట్ ను పంపారు. అర్ష్ దీప్ సింగ్ పూర్తి పేస్ భారాన్ని మోయనున్నారు. తన తో పాటు ఎవరు కొత్త బంతిని పంచుకుంటారో చూడాలి. సింగ్ తో పాటు అవేశ్ ఖాన్, వైశాఖ్ కుమార్, యశ్ దయాల్ ఎలా రాణిస్తారో కూడా సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తారు.
దయాల్, వైశాక్ దేశీయ క్రికెట్ లో, ఐపీఎల్ లో తమ ప్రతిభను చూపారు. అలాగే కొత్త ఆల్ రౌండర్ రమణ్ దీప్ సింగ్ ఎలా రాణిస్తాడో కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రమణదీప్ దేశీయ క్రికెట్ లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఆర్డర్ డౌన్ డేరింగ్ బ్యాట్స్ మెన్, ఉపయోగకరమైన మీడియం పేసర్ అవుట్‌ఫీల్డ్ ఫీల్డర్ కూడా.
సారథి సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి సీనియర్లు బలమైన ఔటింగ్ కోసం ఆశతో ఉన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్ తో  దారుణమైన ఓటమి తరువాత జరుగుతున్న సిరీస్ గెలిచి అభిమానుల ఆగ్రహం  కాస్త చల్లార్చాలని అనుకుంటున్నారు.
జూన్‌లో టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది, ఈ రెండు జట్లు చివరిసారిగా ప్రపంచకప్ లోనే తలపడ్డాయి.
జట్లు (అంచనా) : సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ , విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.
దక్షిణాఫ్రికా: అడైన్ మార్క్‌రామ్ (సి), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెర్రీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, ర్యాన్ సిమిప్లాన్, ర్యాన్ సిమిప్లామ్‌టన్ ట్రిస్టన్ స్టబ్స్.
IST రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Tags:    

Similar News