ఇది మాకు మంచి సీజన్ కాదు: సీఎస్కే కోచ్ ప్లెమింగ్

టాప్ ఆర్డర్ బాగా రాణిస్తుందని ప్రశంసలు కురిపించిన కివీస్ కెప్టెన్;

Update: 2025-04-09 13:34 GMT

చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ చాలా నిరూత్సాహపరించిందని కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ అన్నారు. కానీ మిగిలిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ లో టాప్ ఆర్ఢర్ చాలా మెరుగ్గా రాణించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎస్కే తను ఆడిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది. తరువాత వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే బ్యాట్స్ మెన్లు చివరి దాక పోరాడిన ఓటమి తప్పలేదు.

18 పరుగుల తేడాతో వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ ఓటమి పాలయ్యారు. మ్యాచ్ అనంతరం కోచ్ మీడియాతో మాట్లాడారు. ‘‘క్యాచింగ్ పేలవంగా ఉంది. పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు.

కానీ ఖచ్చితంగా మాకు ఆందోళన కలిగించే విషయం’’. సీఎస్కే ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో 11 క్యాచ్ లలను వదిలించుకుంది.

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ ఒపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర తొలి వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తరువాత దూబే(42) తో కలిసి మూడో వికెట్ కు మరో 89 పరుగులు జోడించారు. అయితే చెన్నై జట్టు బ్యాటింగ్ మెరుగుపడిందని కివీస్ మాజీ కెప్టెన్ అన్నారు.
‘‘సరే సానుకూలంగా చెప్పాలంటే, మేము కొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేసాము. టాప్ ఆర్డర్ మాకు కొంత ఉపశమనం కలిగించింది. చివర్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాము’’ అని ఆయన అన్నారు.
పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్ ప్రియాంష్ ఆర్యపై ప్లెమింగ్ ప్రశంసలు కురిపించాడు. ఒక ఎండ్ లో క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి 42 బంతుల్లో 103 పరుగులు చేశాడు.
అతను మొదటి బంతి నుంచే చాలా బాగా ఆడుతున్నాడు. మొదటి బంతికే ఔటైనప్పుడే అలాంటి షాట్లు ఆడాలని చూడటం చాలా ధైర్యం కావాలని ప్లెమింగ్ అన్నాడు.
మా తప్పు ఏమిటంటే మేము చాలా వైడ్ గా ఉన్నాము. స్టంప్స్ వద్ద నేరుగా బౌలింగ్ చేసి ఈ విధంగా కొంత ఒత్తిడిని సృష్టించాలనేది ప్రణాళిక. కానీ ఆ ప్రణాళిక మేము అమలు చేయాలేకపోయాము.
పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52 పరుగులు చేసి 83/5 అనే ప్రమాదకరమైన స్థితి నుంచి తన జట్టు నుంచి కోలుకోవడానికి కీలకంగా వ్యవహరించాడు. ఆర్య వంటి ప్రతిభను కనుగొనడానికి రాష్ట్ర ఆధారిత టీ20 పోటీలు ముఖ్యమని అన్నాడు.
‘‘రాష్ట్ర స్థాయిలో ఈ లీగ్ లు నిజంగా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఈ రోజు ప్రియాంశ్ ఆర్య, దిగ్వేష్ రతి వంటి మంచి ప్రతిభ వంటి ఆటగాళ్లను చూస్తున్నారు’’ అని అతను చెప్పాడు.


Tags:    

Similar News