టెస్ట్ క్రికెట్ లో కొత్త రికార్డులు లిఖించిన టీమిండియా

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అత్యంత వేగంగా 50, వంద పరుగుల మార్క్ ను..

By :  491
Update: 2024-09-30 12:51 GMT

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ లో రెండో టెస్ట్ ఆడుతున్న భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కొత్త రికార్డులు నెలకొల్పింది.టెస్ట్ క్రికెట్ లో ఫాస్టెస్ట్ 50 పరుగులు, 100 పరుగులు పూర్తి చేసిన జట్టుగా రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఒపెనర్లు యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో బుల్లెట్ వేగంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

రోహిత్ శర్మ (11 బంతుల్లో 23, 3x6, 1x4), యశస్వి పది ఫోర్లు, ఓ సిక్స్ తో విరుచుకుపడ్డారు. వీరి దూకుడుతో 3 ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోరు 50 పరుగుల మార్క్ ను చేరుకుంది. ఈ క్రమంలో జైశ్వాల్ తన హఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ ఏడాది జూలైలో ట్రెంట్ బ్రిడ్జ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4.2 ఓవర్లలోనే అత్యంత వేగంగా యాభై పరుగులు చేసిన ఇంగ్లండ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. జైస్వాల్ తన దూకుడు విధానాన్ని కొనసాగించగా, అతడికి జోడిగా శుభ్‌మన్ గిల్ కూడా చేరాడు. వీరి టీ20 తరహాలో షాట్లు ఆడటంతో 11.ఓవర్లలో ట్రిపుల్-ఫిగర్ మార్క్‌ను అధిగమించింది.
2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల మార్క్ ను 13 ఓవర్లలో భారత్ చేరుకుంది. ఇప్పటి వరకూ అదే ఫాస్టెస్ట్ హండ్రెడ్. ఈ రోజు ఆ రికార్డు కూడా భారత్ బద్దలు కొట్టింది. చివరకు భారత్ 285/9 వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీనితో తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా ఆట ముగిసే సమయాని రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు సాధించింది.
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్‌ కావడంతో వచ్చిరాగానే భారత బ్యాట్స్ మెన్లు రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదటి మూడు రోజులు నిరంతర వర్షాలు, మైదాన పరిస్థితుల కారణంగా కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
మూడు వందల వికెట్ల మైలురాయికి చేరుకున్న జడేజా
భారత స్పిన్ అల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో మూడు వందల వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో చేరాడు. బంగ్లా బ్యాట్స్ మెన్ ఖలీద్ మహ్మద్ ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఓవర్ గా మూడు వందల వికెట్లు తీసిన ఏడో భారత బౌలర్ అయ్యాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 524 వికెట్లు, కపిల్ దేవ్ 434, హర్భజన్ సింగ్ 417, ఇషాంత్ శర్మ 311, జహీర్ ఖాన్ 311 జడేజా కంటే ముందున్నారు.
27 వేల పరుగుల క్లబ్ లో విరాట్..
అంతర్జాతీయ క్రికెట్ లో వేగవంతంగా 27 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడి కోహ్లి రికార్డు సృష్టించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఈ పరుగులు సాధించడానికి 623 ఇన్సింగ్స్ లు అవసరంగా కాగా కోహ్లి 594 ఇన్సింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. అత్యధిక పరుగుల జాబితాలో లంక లెజెండరీ ఆటగాడు కుమార సంగర్కర 28, 106 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ దిగ్గజం పాంటింగ్ 27, 483 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ అత్యధికంగా 34, 357 పరుగులు సాధించాడు.
కోహ్లి టెస్టుల్లో 8,870 పరుగులు, వన్డేల్లో 13,906 (295 వన్డేలు), టీ20 ల్లో 4, 188(125 టీ20లు) సాధించాడు. ఈ ఏడాది జూన్ లో టీ20 లకు రిటైర్ మెంట్ ప్రకటించిన కోహ్లి టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కింగ్ 35 బంతులను ఎదుర్కొని 47 పరుగులు సాధించాడు.



Tags:    

Similar News