బంగ్లాను ఆటాడుకున్న తమిళ తంబీ
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో తొలిటెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్ ఘన విజయం సాధించింది. లంచ్ లోపే అతిథ్య జట్టుకు ఆలౌట్ చేసిన టీమిండియా..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు(6/88) వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కుప్పకూలింది. మూడో రోజు 158/4 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన జట్టు 234 పరుగులకు ఆలౌట్ అయింది.
పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్ట్ లో పాకిస్తాన్ ఓవర్ కాన్పిడెంట్ తో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయగా, బంగ్లాదేశ్ అనూహ్యంగా భారీ స్కోర్ సాధించింది. దీనితో రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఆటగాళ్లు ఒత్తిడి లోనై చిత్తయ్యారు. ఇలా తొలి టెస్ట్ లో గెలిచిన బంగ్లా.. రెండో టెస్ట్ లోనూ విజయం సాధించింది.
దీనితో భారత్ తోనూ జరిగే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తామని బంగ్లా కెప్టెన్ ప్రకటించారు కూడా. అనుకున్నట్లుగానే తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్ల ధాటికి 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. జడేజా కూడా బ్యాట్ ఝలిపించడంతో భారత్ 376 పరుగులకు ఆలౌట్ అయింది. తరువాత బంగ్లాదేశ్ ను కుప్పకూల్చి పట్టు బిగించింది.