భారత్- పాక్ జట్ల మధ్య కొత్త వివాదం

క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారన్న పాక్;

Update: 2025-09-15 12:24 GMT
పాకిస్తాన్ ఆటగాళ్లు

క్రికెట్ ప్రపంచంలో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్- పాక్ మ్యాచ్ చప్పగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కొత్త వివాదం చెలరేగింది.

భారత్ ఈ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆట ముగిశాక పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి నిరాకరించారు. సహయక సిబ్బందిలోని ఒక ముఖ్యమైన సభ్యుడు తీసుకున్న సమష్టి నిర్ణయాన్ని ఆమోదించి బీసీసీఐ ఆమోదం తెలిపింది.
ఈ తిరస్కరణ ఆ క్షణంలో వచ్చిన పిలుపు కాదు. మ్యాచ్ కు ముందు, మ్యాచ్ అనంతరం జరిగిన లాంఛనాల గురించి భారత జట్టు ముందుగానే చర్చించినట్లు తెలిసింది. ఆ సహాయక సభ్యుడు మ్యాచ్ కు ముందు, తరువాత పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయకూడదనే నిబంధనను బీసీసీఐ ఆమోదించింది.
‘‘మేము మా ప్రభుత్వం, బీసీసీఐ అనుసరిస్తున్న దారిలోనే వెళ్తున్నాము’’ అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మీడియా సమావేశంలో అసిస్టెంట్ కోచ్, ర్యాన్ టెన్ డస్కాటే, సితాన్షు కొటక్ చెప్పిన విషయాలను వివరించారు.
జీర్ణించుకోలేని పాక్..
దుబాయ్ లో జరిగిన మ్యాచ్ తరువాత భారత ఆటగాళ్లు తమతో కరచాలనం చేయడానికి నిరాకరించడంపై పాకిస్తాన్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి నిరసన తెలిపింది. ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్ చర్యలను క్రీడరహితమైనదిగా పేర్కొంది.
‘‘భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై పట్ల మేనేజర్ నవీద్ చీమా నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడకు విరుద్దమైనదిగా పరిగణించింది. నిరసనకు మేము మా కెప్టెన్ ను మ్యాచ్ తరువాత జరిగిన ఎలాంటి సెర్మనికి హాజరు కాలేదు’’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమానికి కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా హాజరుకాకపోవడం భారత జట్టుపై నిరసన వ్యక్తం చేయడమేనని పీసీబీ కూడా ధృవీకరించింది.
‘‘భారత జట్టు ప్రవర్తనకు నిరసనగా సల్మాన్ అలీ అఘా మ్యాచ్ తరువాత ప్రజేంటేషన్ ను దాటవేశారు. ఎందుకంటే వేడుకకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి కూడా భారతీయుడే’’ అని పీసీబీ తెలిపింది.
భారత్ రక్షణ..
ఏప్రిల్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను సంఘీభావం తెలిపే మార్గమే ప్రత్యర్థులతో కరచాలనం చేయకూడదనే నిర్ణయమని సూర్యకుమార్ అన్నారు.
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తి కంటే ముందుంటాయని నేను భావిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
‘‘పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులందరికి మేము అండగా నిలుస్తాము. వారి కుటుంబాలకు కూడా మేము అండగా నిలుస్తాము. మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. నేను చెప్పినట్లుగా ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న ధైర్య సాయుధ దళాలను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాము’’ అన్నారు.
కాశ్మీర్ లో జరిగిన దారుణమైన దాడి ఆ తరువాత మే నెలలో సరిహద్దు వెంబడి ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తరువాత చిరకాల ప్రత్యర్థులు క్రికెట్ మైదానంలో మొదటిసారి తలపడ్డారు. అన్ని విభాగాల్లోనూ భారత్, పాకిస్తాన్ అధిగమించడంతో ఇది చప్పగా మారింది.
పెద్ద చర్చనీయాంశం..
పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాశంగా మారింది. ఆపరేషన్ సిందూర్ లో ప్రాణాలు కోల్పోయిన సైనికులను, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో విషాదకరంగా మరణించిన పౌరులను గౌరవిస్తూ భారత్ జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వకుండా దూరంగా ఉంది. రెండు దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తత ఉండటంతో పాక్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
జట్టు పిలుపు..
కెప్టెన్ సూర్యకుమార్ సిక్స్ తో పోటీని ముగించిన తరువాత అతను డగౌట్ వైపు తిరిగి ప్రత్యర్థి ఆటగాళ్ల వైపు చూడకుండా నడవడం ప్రారంభించారు.
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తన సహచరులతో కలిసి కరచాలనం కోసం క్యూలో నిలబడ్డారు. భారత డగౌట్ వైపు నడిచే ప్రయత్నం చేశారు. కానీ మన ఆటగాళ్లు ఎవరూ స్పందించలేదు.
‘‘మేము జట్టుగా పిలుపునిచ్చాము. మేము ఇక్కడికి ఆడటానికి మాత్రమే వచ్చాము. మేము వారికి సమాధానం ఇచ్చాము. కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తికి అతీతమైనవి.
ఈ విజయాన్ని ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న మా సాయుధ దళాలకు అంకితం చేస్తున్నాము. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాము’’ అని సూర్యకుమార్ అన్నారు.
పాక్ కోచ్ నిరాశ..
భారత చర్యపై పాక్ కూడా అలాగే స్పందించింది. పోస్ట్ మ్యాచ్ సెర్మనీని ఆ జట్టు బహిష్కరించింది. ‘‘మేము కరచాలనం చేయాలని అనుకున్నాం. కానీ ప్రత్యర్థి అలా చేయకపోవడం నిరాశపరిచింది.
మేము ఆడిన తీరుతో నిరాశ చెందాము. కానీ కరచాలనం మాత్రం చేయాలనుకున్నాము’’ అని పాక్ కోచ్ మైక్ హస్సీ పేర్కొన్నారు. ఇద్దరు కెప్టెన్లు తమ తమ జట్టు షీట్లను జింబాబ్వేకు చెందిన మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కు సమర్పించారు. టాస్ నిర్వహిస్తున్న టీవీ వ్యాఖ్యాత రవిశాస్త్రి మాట్లాడి వారి స్థానాలకు వెళ్లిపోయారు.
పాక్ అసంతృప్తి..
దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ లో భారత్ ప్రవర్తనపై పీసీబీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మెహ్ సిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ లో ఆయన.. మ్యాచ్ కు ముందు మ్యాచ్ తరువాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.
ఇది క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించడమే అని ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటీ క్రీడా స్ఫూర్తి లేకపోవడం పట్ల నేను పూర్తిగా నిరాశ చెందాను. రాజకీయాలను ఆటలోకి లాగడం క్రీడా స్ఫూర్తికి విరుద్దం. భవిష్యత్ విజయాలను అన్ని జట్లు ఘనంగా జరుపుకుంటాయని ఆశిద్ధాం’’ అని నఖ్వీ రాశారు.
భారత్- పాక్ మధ్య వచ్చే ఆదివారం సూపర్ ఫోర్ దశలో ఇక్కడే మ్యాచ్ జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.


Tags:    

Similar News