ఐపీఎల్: పంత్ తన ధరకు ఈ మ్యాచ్ లో అయినా న్యాయం చేస్తాడా?
నేడు లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్;
By : Praveen Chepyala
Update: 2025-04-03 13:13 GMT
ఐపీఎల్ లో నేడు వరసుగా విఫలమవుతున్న రెండు జట్లయిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సమరం జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టి మాత్రం భారత కెప్టెన్ రోహిత శర్మ తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్, ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ పైనే ఉంది.
వీరు ఇద్దరు ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనే విఫలమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా పంత్ ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నోకు ఏ మాత్రం ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని అసంతృప్తి ఉంది.
అలాగే ముంబైని ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మ ఇప్పటి వరకూ తన ఫామ్ ను అందుకోలేకపోయాడు. ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫిలో బాగానే పరుగులు రాబట్టిన రోహిత్ స్వల్పకాలంలోనే మరోసారి తన ఫామ్ ను కోల్పోవడం ముంబైకి ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు ముంబై ఏస్ బౌలర్ బుమ్రా ఇంకా జట్టులోకి రాకపోవడం కూడా బౌలింగ్ పై ప్రభావం చూపుతోంది. అయితే కొత్త కుర్రాళ్లు విఘ్నేష్ పుతుర్, అశ్విని కుమార్ మాత్రం అంచనాలకు మించి రాణించారు.
ముఖ్యంగా కోల్ కత నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో యువ ఎడమచేతి వాటం బౌలర్ అశ్వని కుమార్ అద్భుతమైన బౌలింగ్ తో ఢిపెండింగ్ ఛాంపియన్ ను చిత్తుగా ఓడిపోయాడు. ఈ పంజాబీ బౌలర్ నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. అందులో అజింక్యా రహనే, మనీష్ పాండే, రింకుసింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి బ్యాట్స్ మెన్లు ఉన్నారు.
ఈ 23 ఏళ్ల పంజాబ్ బౌలర్ కేవలం నాలుగు దేశీయ మ్యాచ్ లు ఆడిన ఈ కుమార్.. ఆరంభ మ్యాచ్ లోనే తన ప్రదర్శనతో అదరగొట్టాడు. తన తొలి మ్యాచ్ లో విఘ్నష్ పుతుర్ చెన్నైకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ఎల్ఎస్జీ కూడా కేవలం నికోలస్ పూరన్ పై మాత్రమే అతిగా ఆధారపడుతోంది. అందుకే అతను విఫలం కాగానే జట్టు మొత్తం కుప్పకూలుతోంది. అలాగే బౌలింగ్ లో రవి బిష్ణోయ్ నేతృత్వంలోని ఎల్ఎస్జీ తడబడుతోంది.
ఐపీఎల్ లో యువ ఆటగాళ్లు రాణించడం ఐపీఎల్ పదే పదే వేదికగా నిలిచింది. అయితే కొద్దిమంది మాత్రమే దీనిని స్థిరంగా నిలబెట్టుకుంటున్నారు. గత సీజన్ లో తన అద్బుతమైన వేగంతో అందరిని ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ ప్రస్తుతం జట్టులో లేడు. అలాగే అశ్విని ప్రతిభపై ముంబై నమ్మకంగా ఉంది.
వాంఖడేలో అశ్విని కుమార్ బాగా రాణించడంతో దక్షిణాఫ్రికా కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ జట్టును విజయవంతంగా లక్ష్యం దిశగా నడిపించాడు. అలాగే సూర్య కుమార్ యాదవ్, రోహిత్ తన స్థాయి మేరకు రాణించాల్సి ఉంది.
ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.