ఐపీఎల్ 2025 వేలం: అయ్యర్ పై కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు

ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడటంతో రికార్డు ధరకు అమ్ముడయ్యారు.

By :  491
Update: 2024-11-24 11:17 GMT

ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ పై కాసుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అయ్యర్ ను పంజాబ్ రూ. 26. 25 కోట్లకు దక్కించుకుంది.

ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. గత సీజన్ లో స్టార్క్ కోసం కేకేఆర్ 24 కోట్లు వెచ్చించింది. అయితే ప్రస్తుతం ఈ ఏస్ బౌలర్ కేవలం రూ. 11. 75 కోట్లకే ఢిల్లీ తీసుకుంది.

అలాగే భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబే కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ రూ. 15 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది. పంత్ ఇంక వేలంలోకి రాలేదు.

ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరుగుతోంది. 204 స్థానాల కోసం ఈ వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో చాలామంది ఆటగాళ్లు తమ కనీస మద్దతు ధరను రూ. 2 కోట్లని పేర్కొన్నారు.

గత ఐపీఎల్ లో కోల్ కత కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపిన అయ్యర్ వేలంలో మంచి ధర పలికాడు. పంజాబ్, ఢిల్లీ తమ జట్లను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిశ్చయించుకోవడంతో వాటి వద్ద భారీగా డబ్బు మిగిలింది. ఆ జట్లు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. 

Tags:    

Similar News