ఐపీఎల్ మెగా వేలం: అమ్ముడయిన 72 మంది ఆటగాళ్లు..

ఐపీఎల్ మెగా వేలం లో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ చరిత్రలోనే ముగ్గురు భారత ఆటగాళ్లు 20 కోట్ల మార్క్ ను దాటారు.

By :  491
Update: 2024-11-25 05:26 GMT

ఐపీఎల్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం జరిగింది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించారు. వేలంలో భారత ఆటగాళ్లపైనే ఎక్కువగా యాజమాన్యాలు దృష్టి సారించాయి. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం పలికిన ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు.

పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ. 27 కోట్లు చెల్లించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పంత్ కోసం రూ. 20 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. కానీ లక్నో ఏకంగా ఏడు కోట్ల రూపాయలను అదనంగా చెల్లించడానికి సిద్ధం కావడంతో ఎస్ఆర్ హెచ్ బిడ్ నుంచి తప్పుకుంది.

అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా రికార్డు ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది. అతని కోసం రూ. 26 కోట్లను చెల్లించడానికి సిద్ధమైంది. వెంకటేష్ అయ్యర్ ను కోల్ కత రూ. 23 కోట్లకు కొనుగోలు చేసింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ముగ్గురు భారత ఆటగాళ్లు రూ.20 కోట్ల మార్కును అధిగమించారు.

తొలి రోజు వేలంలో 84 మంది ఆటగాళ్లు రాగా అందులో 72 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అందులో పేరున్న ఆటగాళ్లుగా ముద్ర పడ్డ డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, దేవదత్ పడిక్కల్ ను ఎవరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఫ్రాంచైజీలలో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా ఆటగాళ్లపై రూ. 467. 95 కోట్లు ఖర్చు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 7
రవిచంద్రన్ అశ్విన్ రూ.9.75 కోట్లు, డెవాన్ కాన్వే రూ.6.25 కోట్లు, రచిన్ రవీంద్ర రూ.4 కోట్లు (ఆర్టీఎం), రాహుల్ త్రిపాఠి రూ.3.40 కోట్లు, ఖలీల్ అహ్మద్ రూ.4.80 కోట్లు, నూర్ అహ్మద్ రూ.10 కోట్లు, విజయ్ శంకర్ రూ.1.20 కోట్లు .
రిటైన్డ్: రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరనా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 9
కేఎల్ రాహుల్ రూ.14 కోట్లు, మిచెల్ స్టార్క్ రూ.11.75 కోట్లు, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ రూ.9 కోట్లు, హ్యారీ బ్రూక్ రూ.6.25 కోట్లు, టీ నటరాజన్ రూ.10.75 కోట్లు, సమీర్ రిజ్వీ రూ.95 లక్షలు, కరుణ్ నాయర్ రూ.50 లక్షలు , అశుతోష్ శర్మ రూ. 3.80 కోట్లు, మోహిత్ శర్మ రూ. 2.20 కోట్లు.
రిటైన్డ్ (4): అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్.
గుజరాత్ టైటాన్స్ (GT): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 9
జోస్ బట్లర్ రూ.15.75 కోట్లు, మహ్మద్ సిరాజ్ రూ.12.25 కోట్లు, ప్రసిద్ధ్ కృష్ణ రూ.9.50 కోట్లు, కగిసో రబాడ రూ.10.75 కోట్లు, నిశాంత్ సిద్ధూ రూ.30 లక్షలు, మహిపాల్ లోమ్రోర్ రూ.1.70 కోట్లు, కుమార్ కుషాగ్రా రూ.65 లక్షలు 30 లక్షలకు రావత్, మానవ్ సుతార్ రూ. 30 లక్షలు.
రిటైన్డ్ (5): రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 7
వెంకటేష్ అయ్యర్ రూ.23.75 కోట్లు, అన్రిచ్ నార్ట్జే రూ.6.50 కోట్లు, క్వింటన్ డి కాక్ రూ.3.60 కోట్లు, రహమానుల్లా గుర్బాజ్ రూ.2 కోట్లు, అంగ్క్రిష్ రఘువంశీ రూ.3 కోట్లు, వైభవ్ అరోరా రూ.1.80 కోట్లు, మయాంక్ మార్కండే రూ. 30 లక్షలు.
రిటైన్డ్ (6): రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 7
రిషబ్ పంత్ రూ.27 కోట్లు, అవేశ్ ఖాన్ రూ.9.75 కోట్లు, డేవిడ్ మిల్లర్ రూ.7.50 కోట్లు, అబ్దుల్ సమద్ రూ.4.20 కోట్లు, మిచెల్ మార్ష్ రూ.3.40 కోట్లు, ఐడెన్ మార్క్రమ్ రూ.2 కోట్లు, ఆర్యన్ జుయల్ రూ. 30 లక్షలు.
రిటైన్డ్ (5): నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని.
ముంబై ఇండియన్స్ (MI): కొనుగోలు చేసిన ఆటగాళ్లు – 4
ట్రెంట్ బౌల్ట్ రూ.12.50 కోట్లు, నమన్ ధీర్ రూ.5.25 కోట్లు, రాబిన్ మింజ్ రూ.65 లక్షలు, కర్ణ్ శర్మ రూ.50 లక్షలు.
రిటైన్డ్ (5): జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ.
పంజాబ్ కింగ్స్ (PBKS): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 10
శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లు, యుజ్వేంద్ర చాహల్ రూ.18 కోట్లు, అర్ష్‌దీప్ సింగ్ రూ.18 కోట్లు (ఆర్‌టీఎం), మార్కస్ స్టోయినిస్ రూ.11 కోట్లు, గ్లెన్ మాక్స్‌వెల్ రూ.4.20 కోట్లు, నెహాల్ వధేరా రూ.4.20 కోట్లు, హర్‌ప్రీత్ బ్రర్ రూ.1.50 కోటి 95 లక్షలకు విష్ణు వినోద్, వైశాఖ్‌ విజయ్‌కుమార్‌ రూ. 1.80 కోట్లు, యశ్‌ ఠాకూర్‌ రూ. 1.80 కోట్లు.
రిటైన్డ్ (2): శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ (RR): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 5
జోఫ్రా ఆర్చర్ రూ.12.50 కోట్లు, మహేశ్ తీక్షణ రూ.4.40 కోట్లు, వానిందు హసరంగ రూ.5.25 కోట్లు, ఆకాష్ మధ్వల్ రూ.1.20 కోట్లు, కుమార్ కార్తికేయ రూ. 30 లక్షలు.
రిటైన్డ్ (6): సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): కొనుగోలు చేసిన ఆటగాళ్లు - 6
జోష్ హేజిల్‌వుడ్ రూ. 12.50 కోట్లకు, ఫిల్ సాల్ట్ రూ. 11.50 కోట్లు, జితేష్ శర్మ రూ. 11 కోట్లు, లియామ్ లివింగ్‌స్టోన్ రూ. 8.75 కోట్లు, రసిఖ్ సలామ్ రూ. 6 కోట్లు, సుయాష్ శర్మ రూ. 2.60 కోట్లు.
రిటైన్డ్ (3): విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): కొనుగోలు చేసిన ఆటగాళ్లు – 8
ఇషాన్ కిషన్ రూ.11.25 కోట్లు, మహ్మద్ షమీ రూ.10 కోట్లు, హర్షల్ పటేల్ రూ.8 కోట్లు, ఆడమ్ జంపా రూ.2.40, కోటి, రాహుల్ చాహర్ రూ.3.20 కోట్లు, అభినవ్ మనోహర్ రూ.3.20 కోట్లు, అథర్వ తైదే రూ.30 లక్షలు, సిమర్జీత్ సింగ్ రూ. 1.5 కోట్లు.
రిటైన్డ్ (5): పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్.
అమ్ముడు పోని ఆటగాళ్లు..
డేవిడ్ వార్నర్ (రూ. 2 కోట్లు), దేవదత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు), జానీ బెయిర్‌స్టో (రూ. 2 కోట్లు), వకార్ సలాంఖైల్ (రూ. 75 లక్షలు), యష్ ధుల్ (రూ. 30 లక్షలు), అన్మోల్‌ప్రీత్ సింగ్ (రూ. 30 లక్షలు), ఉపేంద్ర యాదవ్ (రూ. 30 లక్షలు), లువిత్ సిసోడియా (రూ. 30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 40 లక్షలు), ఉత్కర్ష్ సింగ్ (రూ. 30 లక్షలు), పీయూష్ చావ్లా (రూ. 50 లక్షలు), శ్రేయాస్ గోపాల్ (రూ. 30 లక్షలు).


Tags:    

Similar News