దులీప్ ట్రోఫి: అనంతపురం నుంచి బెంగళూర్ కు మార్పు

దులీప్ ట్రోఫి ప్రారంభ మ్యాచుల్లో ఒక దానిని అనంతపురం నుంచి బెంగళూర్ కు మార్చాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉందని..

Update: 2024-08-12 10:13 GMT

దులీప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌లో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మినహా భారత్ జట్టులోని మిగిలిన రెగ్యూలర్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరితో పాటు సీనియర్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విశ్రాంతి తీసుకోవచ్చని తెలుస్తోంది.

అయితే దీనిపై పూర్తి నిర్ణయం వీరే తీసుకోనున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓపెనింగ్ మార్చాలని కూడా బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం అనంతపురంలో దులీప్ ట్రోఫి ప్రారంభ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ను బెంగళూర్ కు మార్చబోతున్నారని సమాచారం.

దులీప్ ట్రోఫీ సెప్టెంబరు 5 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో మొదటి రౌండ్ల రెండు మ్యాచ్ లు జరగడానికి షెడ్యూల్ నిర్ణయించారు. కానీ రవాణా సౌకర్యాలు, ఇతర సమస్యల దృష్ట్యా వీటిని బెంగళూర్ లోని ఎం చిన్నస్వామి స్టేడియానికి మార్చారు.
అనంతపురం బెంగళూర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విమాన సౌకర్యాలు అందుబాటులో లేవు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికంటే ముందు ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లభించడానికి దులీప్ ట్రోఫిలో ఆటగాళ్లు పాల్గొనడానికి వస్తున్నారని సమాచారం. అయితే ఇక్కడ వసతులు చాలా తక్కువగా ఉండటంతో మ్యాచ్ ను బెంగళూర్ కు మార్చారు.
బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో, సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఈవెంట్‌లో రోహిత్, కోహ్లి ఆడవలసి ఉండగా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, KL రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కుల్దీప్ యాదవ్ వంటి మరికొందరు ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌కు పూర్తిగా లేదా పాక్షికంగా అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు.
అయితే, బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు బుమ్రా, అశ్విన్ నేరుగా భారత జట్టులో చేరాలని భావిస్తున్నందున ఏ దశలోనూ టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు.
దులీప్ ట్రోఫీలో స్టార్ బ్యాట్సమెన్ రిషబ్ పంత్‌ పాల్గొనాలని సెలెక్టర్లు ఆదేశించినట్లు కొన్ని బీసీసీఐ మూలాలు తెలియజేస్తున్నాయి. అదే కనక నిజం అయితే 2022లో జరిగిన ఆ భయంకరమైన కారు ప్రమాదం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇది అతని మొదటి రెడ్ బాల్ అసైన్‌మెంట్ అవుతుంది. గాయం తరువాత జరిగిన కొన్ని మ్యాచ్ లు, టీ20 వరల్డ్ కప్ లో పంత్ పాల్గొని తన ఫామ్ ను చాటుకున్నాడు.
శస్త్ర చికిత్సతో కోలుకుంటున్న మహ్మద్ షమీ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. బంగ్లాదేశ్ లో టెస్ట్ మ్యాచ్ లకు ముందు చెన్నైలో నిర్వహించే సన్నాహాక శిబిరంలో అందరూ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. అగ్రశ్రేణి ఆటగాళ్ళు జాతీయ గేమ్ నుంచి విముక్తి పొందినప్పుడల్లా దేశీయ క్రికెట్ పోటీలలో పాల్గొనాలి.
ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే బుచ్చి బాబు ట్రోఫీని ఆడేందుకు భారత టీ20ఐ సారథి సూర్యకుమార్ యాదవ్ (ముంబై), ఔట్ ఆఫ్ ఫేవర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ (జార్ఖండ్) తమను తాము అందుబాటులోకి తెచ్చుకున్నారని గుర్తుచేసుకోవచ్చు.



Tags:    

Similar News