ICC Champions Trophy 2025: ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ 2025 హైలైట్స్

సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్;

Update: 2025-03-02 23:57 GMT

నిన్న (2.3.25) భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై 44 పరుగులతో గెలిచి, సెమీఫైనల్ కు చేరింది. సెమీఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియా తో తలపడనుంది.

ఇంతవరకు భారత జట్టు న్యూజిలాండ్ తో 118 వన్డే లు ఆడింది. అందులో 60 భారత్ గెలిస్తే, న్యూజిలాండ్ 50 గెలిచింది. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు, న్యూజిలాండ్ చేతిలో4 వికెట్ల తేడాతో ఫైనల్స్ లో ఓడిపోయింది. 25 సంవత్సరాల తర్వాత, ట్రోఫీ గెలవడమే కాకుండా, బదులు కూడా తీర్చుకోవడానికి ఎదురుచూసిన భారత జట్టు చివరికి న్యూజిలాండ్ ని ఓడించి సెమీ ఫైనల్ కి వెళ్లడమే కాకుండా, బదులు కూడా తీర్చుకుంది.
ఆదుకున్న అయ్యర్.. అక్షర్
భారత జట్టు టాస్ ఓడిపోయి, బ్యాటింగ్ కు దిగింది. మొదటి రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. విరాట్ కోహ్లీ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అంతకు ముందు రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ అవ్వగా, గిల్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ శ్రేయస్ అయ్యర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ తో కలిసి భారత జట్టు మంచి స్కోర్ వైపుకి వెళ్లేలా చేయగలిగాడు. న్యూజిలాండ్ బౌలర్ హెన్రి, రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.శ్రేయస్, అక్షర్ పటేల్ 36 ఓవర్లలో 170 పరుగులు చేశారు. టాప్ ఆర్డర్లో మూడు వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ, భారత జట్టును ఆదుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అయితే అంతలోనే బాగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ బౌలర్ రూర్కె వేసిన బంతిని ఆడబోయి విల్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు.భారత్ కి మరోసారి కొంత ఇబ్బంది కలిగింది. సహజంగానే స్కోరు కొంచెం మందగించింది. ఇక భారం అంతా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రాహుల్, మిడిల్ ఆర్డర్ హిట్టర్ హార్థిక్ పాండ్యా ల మీద పడింది. 40వ ఓవర్లో భారత జట్టు, రాహుల్ వికెట్ కోల్పోయింది. భారత్ కు ఇది పెద్ద దెబ్బ.
రాణించిన బౌలర్లు.. సాయపడిన ఫీల్డర్లు
న్యూజిలాండ్ బౌలర్లు భారత జట్టు బ్యాట్స్మెన్ లను కట్టడి చేయడంలో విజయం సాధించారు. వారికి ఫీల్డర్లు కూడా సహాయపడ్డారు. దాదాపుగా వచ్చిన అన్ని క్యాచ్ లను పట్టుకున్నారు. జట్టు కెప్టెన్ కూడా స్ఫూర్తిదాయకమైన ఫీల్డింగ్ చేశాడు. ఒక అద్భుతమైన క్యాచ్ కూడా ఒక చేత్తో ఒడిసి పట్టుకొని, జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. బౌలర్లలో హెన్రీ 8 ఓవర్లు వేసి ఐదు వికెట్లు సాధించాడు. అదే భారత్ బ్యాటింగ్ ను దెబ్బతీసింది.
స్కోర్ ను కొంతవరకు పెంచిన పాండ్యా
ఇక భారం అంతా హార్దిక్ పాండ్యా మీద పడింది. భారత జట్టులో గుర్తింపు పొందిన చివరి బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా కూడా మంచి బ్యాట్స్మెన్ కాబట్టి భారత్ జట్టు కొంచెం మర్యాదపూర్వకమైన స్కోర్ చేసే అవకాశం ఉంది. 40 ఓవర్లలో 185 పరుగులు చేసిన భారత జట్టు 250 పరుగులు చేయడము వీరిద్దరి మీదనే ఆధారపడింది. భారత జట్టుకు ఒక మంచి భాగస్వామ్యం అవసరమైన స్థితిలో ఉంది. 41వ ఓవర్లో న్యూజిలాండ్ బౌలర్ రూర్కీ బౌలింగ్ లో ఒక సిక్స్ కొట్టి హార్దిక్ పాండ్యా భారత జట్టులో ఉత్సాహాన్ని నింపాడు. తక్కువ బంతుల్లో ఎక్కువ స్కోరు రావడం హార్దిక్ పాండ్యా చేతిలోనే ఉంది. చాలా దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ కాబట్టి. గుర్తింపు పొందిన చివరి బ్యాట్స్మెన్ జంట ఇదే కాబట్టి .ఇప్పుడు వికెట్ కోల్పోతే భారత జట్టు చాలా ప్రమాదంలో పడుతుంది. ఈ దశలో న్యూజిలాండ్ బౌలర్లు కూడా చాలా పకడ్బందీగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్ స్టాంట్నర్ తన బౌలింగ్ తో భారత జట్టు బ్యాట్స్మెన్లను అదుపులో ఉంచాడు.
చివరి 10 ఓవర్లో భారత జట్టు కనీసం 80 పరుగులు చేస్తే తప్ప పోరాడ దగ్గర స్కోరు న్యూజిలాండ్ జట్టుకు ఇచ్చే అవకాశం లేదు.లీగ్ దశలో రెండు అజేయంగా నిలిచిన జట్లే. ఏ జట్టు ఓడిపోయినప్పటికీ, సెమీఫైనల్ చేరడం ఖాయం అయిపోయింది కనుక పెద్దగా టెన్షన్ లేకపోయినప్పటికీ, విజయంతోనే సెమిస్ కు చేరాలన్న లక్ష్యంతో రెండు జట్లు ఆడడం మామూలే. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు సౌత్ ఆఫ్రికా తో ఆడాల్సి ఉంటుంది. జడేజా, పాండ్యాలు ఇద్దరు కలిసి జట్టు స్కోర్ ను 45 ఓవర్లలో 216 పరుగులు చేశారు.కీలకమైన 5 ఓవర్లలో కనీసం 30కి పైగా పరుగులు సాధిస్తే తప్ప, భారత్ న్యూజిలాండ్ తో గెలిచే అవకాశాలు పెద్దగా ఉండవు. న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. ఇంతవరకు ఇద్దరు బ్యాట్స్మెన్లు ఎలాంటి రిస్కు తీసుకోకుండా ఒక్కో పరుగు జోడిస్తూ వెళ్లారు.46 ఓవర్లో నేరుగా ఒక బౌండరీ కొట్టిన హార్దిక్ పాండ్యా తన అభిమతాన్ని న్యూజిలాండ్ బౌలర్లకు తెలియపరిచాడు.
అయితే న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియంసన్ ఒక చేత్తో డైవ్ చేస్తూ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ తో.. భారత జట్టు ఆశలు ఆవిరి అయ్యాయి. గుర్తింపు పొందిన చివరి బ్యాట్స్మెన్ జడేజా అవుట్ కావడం భారత జట్టుకు బలమైన దెబ్బ. బ్యాటింగ్ కు వచ్చిన షమీ, మంచి హిట్టరే అయినప్పటికీ, న్యూజిలాండ్ బౌలింగ్ ముందు అతని హిట్టింగ్ సామర్థ్యం పనిచేయలేదు
కీలకమైన చివరి రెండు ఓవర్లలో భారత్ కనీసం ఒక 20, 30 పరుగులు చేసుకుంటే బాగుంటుందనిపిస్తున్నప్పుడు, హార్థిక్ పాండ్యా 49వ ఓవర్లో ఒక ఫోర్ కొట్టి జట్టులో కొంత ఉత్సాహాన్ని నింపాడు, వెంటనే మరొక బౌండరీ తో పాటు ఒక సిక్సర్ కూడా కొట్టి ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్ని పెంచాడు. ఆ ఓవర్ లో 15 పరుగులు వచ్చాయి. ఇవే మ్యాచ్ లో కీలకం అయ్యాయి. ఇక చివరికి అందరి చూపులు 50 వ ఓవర్ పైన ఉన్నాయి. కానీ మిడ్ వికెట్లో న్యూజిలాండ్ర ఫీల్డర్ వీంద్ర పట్టిన క్యాచ్ తో పాండ్యా అవుట్ కావడం తో భారత జట్టు స్కోరు 250 పరుగులు దాటడం కష్టతరంగా మారింది. చివరికి షమీ కూడా అవుట్ కావడంతో భారత జట్టు 250 పరుగులు చేయలేకపోయింది గాని, న్యూజిలాండ్ జట్టుకు 250 పరుగుల లక్ష్యాన్ని మాత్రం ఇచ్చింది,
250 పరుగుల లక్ష్యంతో( ఓవర్ కు అయిదు పరుగుల రన్ రేట్ తో) బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అంతకుముందు 22 పరుగులు చేసిన యంగ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఫామ్ లో ఉన్న ప్రమాదకరమైన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రవీంద్ర ఆరు పరులకే అవుట్ కావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపింది. అయితే తర్వాత కెప్టెన్ విలియంసన్, మిచల్, కొంతవరకు నిదానంగానే అయినా సరే స్కోరును ముందుకు కదిలించారు.
25 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. అంటే ఆట సగం అయ్యే సమయానికి భారత జట్టు దే పై చేయి అనిపించింది. 25 ఓవర్లలో 157 పరుగులు చేయవలసిన స్థితిలో న్యూజిలాండ్ ఉంది. ఈ స్థితిలో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మిచెల్ కుల్దీప్ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యు కావడంతో భారత జట్టు ఆటగాళ్లలో ఉత్సాహం వచ్చేసింది. ఇంకో రెండు వికెట్లు సాధిస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్ బలహీనమవుతుందని అనిపించింది.26 ఓవర్లో న్యూజిలాండ్ జట్టు నూరు పరుగులు చేసింది.
ఈ స్థితిలో న్యూజిలాండ్ స్కోర్ వేగం తగ్గింది. రన్ రేట్ పెరిగింది. ఈ స్థితిలో భారత జట్టు బౌలర్లు బ్యాట్స్మెన్ లను కట్టడి చేయడం జరిగింది. ఈ దశలోనే న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ విలియంసన్ 77 బంతుల్లో తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 30 ఓర్లు ముగిసిన సమయానికి న్యూజిలాండ్ జట్టు భారత జట్టు స్కోర్ లో సగం(125) సాధించింది. ఇక 20 ఓర్లలో మిగతా సగం(125) సాధించాలి. ఆరు పరుగులకు పైగా రన్ రేట్ తో రాను రాను పదును తేలుతున్న భారత బౌలింగ్ ను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించడం కొంచెం కష్టమే అనిపించింది. ఈ దశలో భారత జట్టు ఒక మెట్టు పైన ఉందనిపించింది. న్యూజిలాండ్ బ్యాటింగ్లో కొంచెం వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉండింది. ఈ దశలో జడేజా బోలింగ్ లో లాతం ఎల్ బి డబ్ల్యు కావడం మ్యాచ్ ను మలుపు తిప్పే అవకాశం కల్పించింది.
మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి
ఇక న్యూజిలాండ్ జట్టు ఆశలన్నీ జట్టు సారథి విలియంసన్ పైనే ఉన్నాయి. మ్యాచ్ కాస్త రసవత్తరంగా మారింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బౌలింగ్ లోకి దింపాడు. ఈ దశలో మంచి ఫామ్ లో ఉన్న విలియంసన్ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 34 ఓవర్లో ఒక సిక్సర్ కొట్టి ఆశలు రేపిన ఫిలిప్స్ మరుసటి బంతికే ఎల్ బి డబ్ల్యు కావడం వల్ల న్యూజిలాండ్ , ఇబ్బందుల్లో పడింది. ఇక మ్యాచ్ను గెలిపించాల్సిన భారమంతా కెప్టెన్ విలియమ్స్ మీదే పడింది. ఐదు ముఖ్యమైన బ్యాట్స్మెన్లను కోల్పోయి 14 ఓవర్లలో 97 పరుగులు సాధించాల్సిన పరిస్థితిలో న్యూజిలాండ్ పడిపోయింది. ఒకవైపు వికెట్ లు పడిపోతున్నప్పటికీ కెప్టెన్ విలియమ్సన్ సంయమనాన్ని కోల్పోకుండా పరుగులు చేస్తూ పోయాడు. వరుణ్ చక్రవర్తి వేసిన తరువాతి ఓవర్లో బ్రేస్వెల్ రూపంలో ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు పూర్తిస్థాయి కష్టాల్లో పడిపోయింది. ఎల్బీడబ్ల్యూగా ప్రకటించబడినప్పటికీ రివ్యూ కు వెళ్లకుండా బ్రేస్వెల్ వెళ్లిపోయాడు. రీ ప్లే లో బంతి వికెట్లకు తగలలేదని తేలింది. ఈ దశలో మ్యాచ్ ను గెలవడం కష్టతరంగా మారింది. కేవలం విలియమ్స్ మాత్రమే ఈ మ్యాచ్ ను గెలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత బౌలింగ్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను బాగానే కట్టడి చేసింది.
ఒంటరి పోరాటం చేసిన విలియంసన్
ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ జట్టు నాయకుడు విలియంసన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. 40 ఓవర్లు దాటేసరికి 165 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లలో 8.5 పరుగుల రన్ రేట్ తో 85 పరుగులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. అది అంత సులభం కాదని విలియంసన్ కి కూడా తెలుసు. అయినా మొక్కవోని ధైర్యంతో ఆడుతూ వెళ్ళాడు. ఒంటరి పోరాటం ఆపలేదు. చివరకు 81 పరుగులు సాధించి అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ గెలవడం కష్టం అనే పరిస్థితి ఉత్పన్నమైంది. భారత స్పిన్ బౌలింగ్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది.
కొంత పోరాటం చేసిన స్టాంటనర్ ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేయడంతో న్యూజిలాండ్ కథ అయిపోయింది. అదే ఓవర్లో కోహ్లీ పట్టిన క్యాచ్ తో హెన్రీ అవుట్ కావడంతో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు సాధించిన బౌలర్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ ఇంతకుముందు న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు సాధించడం విశేషం. చివరకు కుల్దీప్ బౌలింగ్ ల్లో రూర్కీ అవుట్ కావడంతో న్యూజిలాండ్ గతం ముగిసింది. 205 పరుగులు చేసిన న్యూజిలాండ్ జట్టు ను 44 పరుగుల తేడాతో భారత్ ఓడించి సెమీఫైనల్ కి వెళ్ళింది. ఈ మంగళవారం (4.3.25) జరిగే మొదటి సెమి ఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియా తో తలపడుతుంది.
42 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సాధించిన వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు
భారత్ బ్యాటింగ్ :
249 పరుగులు/9 వికెట్లు (50 ఓవర్లు)
అక్షర పటేల్ 42 పరుగులు (61 బంతులు)
అయ్యర్ 79 పరుగులు (98 బంతులు)
హార్దిక్ పాండ్యా 44 పరుగులు (45 బంతులు)
న్యూజిలాండ్ బౌలింగ్ :
హెన్రీ 5 వికెట్లు (8 ఓవర్లు)
జేమిసన్ 1 వికెట్ (8 ఓవర్లు)
రూర్కి 1 వికెట్ (9 ఓవర్లు)
సాంట్నర్ 1 వికెట్ (10 ఓవర్లు)
రవీంద్ర 1 వికెట్ (6 ఓవర్లు)
న్యూజిలాండ్ బ్యాటింగ్:
205 పరుగులు/10 వికెట్లు (45.3 ఓవర్లు)
విలియమ్సన్ 81 పరుగులు (120 బంతులు)
స్టాంట్నర్ 28 పరుగులు (31 బంతులు)
భారత్ బౌలింగ్:
వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు (10 ఓవర్లు)
కుల్దీప్ 2 వికెట్లు (9.3 ఓవర్లు)
హార్దిక్ పాండ్యా 1 వికెట్ (4 ఓవర్లు)
అక్షర్ పటేల్ 1 వికెట్ (10 ఓవర్లు)
రవీంద్ర జడేజా 1 వికెట్ (8 ఓవర్లు)



Tags:    

Similar News