ఆర్థిక సంక్షోభం నుంచి... ప్రజా సంక్షేమం దిశగా....

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన మీద ప్రముఖ కవి జూకంటి జగన్నాథం అభిప్రాయం

By :  Admin
Update: 2024-12-04 06:22 GMT

-జూకంటి జగన్నాథం

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం పది సంవత్సరాల పాటు ప్రభుత్వంలో కొనసాగింది . దశాబ్ద కాలంలో వివిధ రంగాలలో కుంటుబడిన చోట నుంచి గత డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నది. ఈ సంవత్సర కాలంలో విధానాలు, సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ, హామీలను నెరవేరుస్తూ తెలంగాణను జాతీయస్థాయిలో అత్యున్నత రాష్ట్రంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తున్నది .

తివిరి ఇసుమున తైలం ఎవరూ తీయలేరు. పిండి కొద్దీ రొట్టె తయారవుతుంది. ఎన్నికల సమరంలో ఏ రాజకీయ పార్టీలైనా మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకర్షించేందుకు ,ప్రజల ఆలోచింపజేసేందుకు సర్వసాధారణంగా ప్రచారం చేస్తుంటాయి. ఎప్పుడైతే ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ మానిటరీ ఫండ్ సంస్థలు ఏర్పడ్డాయో అప్పుటినుంచి మన ఆర్థికవేత్తలు "అప్పు తోనే అభివృద్ధి" అనే ఒక సిద్ధాంతాన్ని బహుళ ప్రచారం చేశారు. ఆ సిద్ధాంతం వెలుగులో అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి అప్పు చేసిన ఆయా దేశాలు ఎంతవరకు సఫలీకృతం అయ్యాయో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే ఆర్థికవేత్తలు చెప్పాలి.

ఎందుకు ఈ ప్రస్తావన అంటే గత ప్రభుత్వం తెలంగాణలోని ఎన్నికలు సమయంలో సంధర్భం వచ్చినప్పుడల్లా అదే నినాదాన్ని వేనోళ్ల ప్రచారం చేసి సమర్ధించుకున్నారు కాబట్టి, ఎవరూ ఊహించని ఓటర్లు పౌర సమాజం నాడి పట్టి స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. తద్విరుద్ధంగా ఎన్నికల వ్యూహ కర్తలను సర్వే పండితులను ఆశ్చర్య పరుస్తూ ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చాడు.

సరే ,ఏదిఏమైతేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా రైతు పండుగలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్నది.. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల గురించి ఊహించినది ఒకటైతే వాస్తవంగా లెక్క తేలింది మరో విధంగా ఉన్నది. ఈ హామీల ప్రభుత్వ బండిని రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎలా లాక్కు వస్తుందోనని విపక్షాలు ఎదురుచూశాయి. వార్షిక పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాసిన ప్రభుత్వం కార్యాకారణ సంబంధాల జోలికి పోకుండా, వాస్తవిక దృష్టితో బేరీజు వేయడమే స్థాలీ పులాయక న్యాయంగా చూడడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.

ప్రధానమైన ఆరు గ్యారంటీల అమలు తీరు తెన్నులు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోగా మహాలక్ష్మి పథకం అమలులోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అంతేగాక ప్రజల ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచింది. అర్హులైన పేద కుటుంబాలకు నెల నెలా 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు వసతి గృహ జ్యోతి పథకం ద్వారా సుమారు పది లక్షల కుటుంబాలపైగా అందించింది. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను సరఫరా చేసే ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది . అదే స్ఫూర్తితో 20 24 మార్చి 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల గృహ నిర్మాణ ఆర్థిక సహాయం, ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయడానికి విధి విధానాలు రూపొందించి అందిస్తున్నది. దసరా పండుగ నాటి నుండి ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి పునాది రాయి వేసింది. ఈ యాసంగి నుంచి 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించినది. అంతేగాకుండా నిరుద్యోగులకు డిసెంబర్ వరకు నిరుద్యోగులకు సుమారు 19 వివిధ ప్రభుత్వ శాఖలలో 55143 ప్రభుత్వ ఉద్యోగాలు నియమించింది.

ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క గ్యారంటీ సంక్షేమ పథకం ద్వారా పొందిన లబ్ధిదారులు ఈ విధంగా ఉన్నారు. ప్రజా రవాణా చరిత్రలో చారిత్రిక నిర్ణయం ఇది. ఈ పథకం ద్వారా నవంబర్ చివరి నాటికి 115 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు ఇందుకుగాను సుమారు 3600 కోట్లు రూపాయలు మహిళలు ఆదా పొందారు . రాష్ట్రవ్యాప్తంగా 7300 వేల బస్సుల్లో ఈ పథకం కొనసాగుతున్నది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య 66 శాతానికి పెరిగినది. మహాలక్ష్మి పథకం 500 కి గ్యాస్ సిలిండర్ 46 లక్షల 67 వేల 510 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టయింది. ఈ పథకం కింద ప్రభుత్వం 3 56 కోట్లు రూపాయలు వెచ్చించడం జరిగినది. ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయల ఉత్స వైద్యసాయం అందించే చేయూత పథకం 91 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేపిస్తున్నది ఈ పథకం కింద 1672 వైద్య పరమైన విభిన్న ప్యాకేజీలు అందుబాటులోకి రావడం జరిగింది. ఇకపోతే గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం ద్వారా సుమారు 50 లక్షల కుటుంబాలు లబ్ధి చెందుతున్నాయి. ఈ పథకం కింద ఆయా డిస్కం లకు 1200 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం అందజేసినది. సుమారు మూడు కోట్ల 20 లక్షల జీరో బిల్లులు జారీ చేయడం జరిగినది. ఇందిరమ్మ ఇండ్లు నాలుగు లక్షల 50 వేల గృహాలు నిర్మించాలని ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగినది. రైతు రుణమాఫీ గత ప్రభుత్వం కాలంలో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడినది . మొత్తం మూడు విడతల్లో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేసినది. సుమారు 23 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయడం భారతదేశ చరిత్రలో ఇది ప్రథమం.

మరొక ముఖ్య విషయం గత ప్రభుత్వం చేసిన అప్పుకు సంవత్సర కాలంలోప్రభుత్వం 78 వేల కోట్ల వడ్డీ కింద చెల్లింలించినది .

ప్రతి నెల ప్రభుత్వ ఖర్చు అన్ని పథకాల వ్యయం కలుపుకొని 30 వేల కోట్ల వరకు ఉన్నది. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభాలను అధిగమించి, ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రజా సంక్షేమం దిశగా దక్షతతో ప్రజా పరిపాలనేపరమావధిగా పనిచేస్తున్నది.

దురదృష్టవశాత్తు మనదేశంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శించడమే ప్రధానమని మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటాయి. నిర్మాణాత్మక సూచనల ప్రతిపక్ష పార్టీలు పరిచయం సుదీర్ఘకాలంలో ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద లోటు.

(ఇవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. ఫెడరల్ తెలంగాణ బిన్నాభిప్రాయాల వేదిక)

Tags:    

Similar News