పోతూ పోతూ చిచ్చు పెడుతున్న బైడెన్..
ఎన్నికల్లో బైడెన్ పార్టీ ఓటమి పాలైంది. రెండోసారి ట్రంప్ అధ్యక్ష పీఠ ఎక్కబోతున్నారు. అయితే తాజాగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచం ముందు మరో..
By : 508
Update: 2024-11-19 07:47 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కి రెండోసారి యూఎస్ ప్రజలు వైట్ హౌజ్ ను అప్పగించారు. అధికారం చేపట్టిన నెల రోజుల్లో యుద్ధాలన్నీ ఆపివేస్తామని ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలకు హమీ ఇచ్చారు. వాస్తవం ఇలా ఉంటే .. తాజాగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరిని విస్మయపరుస్తోంది.
రష్యా భూభాగంపై సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న క్షిపణులను ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్ కు బైడెన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయాన్ని ఓటమిగా గుర్తించడం, లేదా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకున్న ట్రంప్ ముందు క్లిష్టమైన పరిస్థితిని పెట్టడం ఆయన లక్ష్యం.
అసలు నాటోలో చేరాలనే ఆలోచన ఉక్రెయిన్ కు కల్పించింది అమెరికానే అని, ఇది బైడెన్ వ్యక్తిగత ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. ఒకప్పటి సోవియట్ యూనియన్ కు మిగిలిన అవశేషంగా ఉన్న రష్యా సరిహద్దులకు నాటో చేర్చాలని, మళ్లీ ప్రపంచ శక్తిగా ఎదగాలనే ఆలోచన పుతిన్ మదిలో ఉన్నాయని బైడెన్ భావిస్తున్నాడు.
వాషింగ్టన్, కీవ్ ను రెచ్చగొట్టడం దానికి పశ్చిమ దేశాలు కోరస్ పాడటం, వీరికి తగ్గట్లగా హస్య నటుడిగా ఉండి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జెలెన్ స్కీ జై కొట్టడంతో యుద్దం ఆరంభమైంది. 1980-1990 నాటి సంఘటన ఇప్పుడు మరోసారి గుర్తుకు వస్తున్నాయి.
పుతిన్ లెక్క ఎక్కడ తప్పింది..
రష్యా సార్వభౌమత్వం భంగం కలిగిందని, ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24, 2024 లో క్రిమ్లిన్ దాడికి దిగింది. ఇదే అందరిని ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు కేజీబీ ఏజంట్ గా ఉండి, సోవియన్ పతనాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి పుతిన్. అప్పటి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ పశ్చిమ దేశాలను గుడ్డిగా నమ్మి మోసపోయాడు.
ఈ ఫలితాన్ని దేశం కూడా అనుభవించింది. అందుకే పుతిన్ ఇప్పుడు యుద్దానికి తెగబడి ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2008 లో జార్జియాను పశ్చిమ దేశాలు ఇలాగే ఉసిగొల్పగా, రష్యా దాడి చేసి, దాన్ని దారిలోకి తెచ్చుకుంది. ఇప్పుడు కూడా ఉక్రెయిన్ పై అలాంటి వ్యూహాన్నే పుతిన్ అమలు చేశాడు. కొన్ని రోజల్లోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన లెక్కలు వేశాడు.
పశ్చిమ దేశాల ప్రేరేపిత యుద్ధం..
జార్జియాపై యుద్ధం సమయంలో అమెరికా తటస్థంగా ఉంది. ఎటువంటి ఆయుధ సాయం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్ కు పూర్తి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మధ్యలో యుద్దాన్ని ముగించడానికి అవకాశం లభించింది. శాంతి చర్చలకు తాను సిద్ధం అని జెలెన్ స్కీ అంగీకరించాడు.
తొలిరోజుల్లో చర్చలు సజావుగానే సాగాయి. కానీ అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని పశ్చిమ దేశాలు కీవ్ కు చేరుకున్నాయి. అవి పోరాటాన్ని కొనసాగించమని జెలెన్ స్కీని ఒప్పించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. అంతర్జాతీయ రాజకీయ వ్యవహరాలు, వాటి లోతును అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. ఆయన నిర్ణయానికి ఉక్రెనియన్లు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి వెల్లడించిన భయంకరమైన గణాంకాల ప్రకారం.. యుద్ధంలో ఇప్పటి వరకూ 622 మంది పిల్లలతో సహా 11,973 మంది పౌరులు మరణించారు. దాదాపు 26,000 మంది గాయపడ్డారు. అనేక మౌలిక సదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసకుని విధ్వంసం స్థాయిని పెంచుతోంది. ఇటీవలీ కాలంలో దాడులు తీవ్రతను పెంచాలని పుతిన్ ఆదేశించినట్లు యూఎన్ పేర్కొంది. అక్టోబర్ 16న, దాదాపు 130 డ్రోన్లు రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించాడు.
గ్లోబల్ పవర్ ప్లే బాధితులు
రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై 1000 రోజులు పూర్తి అయింది. అయినప్పటికీ యుద్ధ భూమిలో ఎటువంటి అనుకూల ముగింపు లేకుండా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇద్దరు తమ తమ మార్గాల్లో బాధపడుతూనే ఉన్నారు. గ్లోబర్ పవర్ ల మధ్య ఉక్రెయిన్ విలవిలాడుతూనే ఉంది.
అమెరికా, నాటో దేశాలు జెలెన్ స్కీకి అనేక హమీలు ఇచ్చాయి. తన భూభాగం తిరిగి అప్పగిస్తామని చెబుతూనే వస్తున్నాయి. అయితే రష్యాని ఎక్కువగా రెచ్చగొడితే అది పెను ప్రపంచ యుద్ధంగా మారుతుందని మొదట్లో భయపడ్డాయి. అందుకే జెలెన్ స్కీ తమకు లాంగ్ రేంజ్ క్షిపణులు ఉపయోగించడానికి అనుమతి ఇవ్వాలని ఒత్తిడి పెట్టిన వైట్ హౌజ్ అంగీకరించలేదు. అయితే తాజాగా బైడెన్ దానికి సమ్మతించడం చూస్తే కీవ్ డిమాండ్లకు కట్టుబడి ఉన్నాడని తెలుస్తోంది.
సుదూర క్షిపణుల సరఫరా వెనుక రాజకీయం
సుదూర శ్రేణి లక్ష్యాలు ఛేదించడానికి బైడెన్ తీసుకున్న నిర్ణయం వెనక ఓ లక్ష్యం కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని కొనసాగించాలని, శాంతిని విధ్వంసం చేయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. తన పదవీకాలంలో చివరి రోజులు లెక్కిస్తున్నప్పటికీ బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనిపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.
ఇటీవలి ఎన్నికల ప్రచారం ప్రకారం.. ఉక్రెయిన్ యుద్దంలో అమెరికా కలుగజేసుకోవడంపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఇప్పటి వరకూ యుద్ధంలో 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. దీని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరస్తుందని ట్రంప్ ప్రశ్నలు ఆయనకు ఓట్లు సంపాదించి పెట్టింది.
తాను శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటానని ట్రంప్ చెప్పడమే కాదు, దానిని ఒక్క రోజులో చేస్తానని చెప్పారు. అతను దానిని ఎలా సాధిస్తాడో అతను పేర్కొనకపోయినా, పుతిన్‌తో ట్రంప్‌కు ఉన్న సంబంధాలే అతని విశ్వాసానికి కారణమని అందరూ భావిస్తున్నారు. అలాగే, ఉక్రెయిన్‌కు అమెరికా నిధులను నిలిపివేస్తానని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ 2.0... డైనమిక్స్‌లో మార్పు
ట్రంప్ ఎన్నికల్లో గెలిచినప్పుడు జో బైడెన్ పరిపాలన యంత్రాంగం భయపడి ఉండవచ్చు. జెలెన్ స్కీ కు ఇచ్చిన వాగ్థానాలు, మద్ధతు అన్నింటిని ఉపసంహరించుకోవచ్చు. పుతిన్ ఇప్పటి దాకా గెలుచుకున్న భూభాగాన్ని వదిలిపెట్టి, యదాతథ స్థితిని కొనసాగించమని ఒత్తిడి పెట్టవచ్చు. ఇలా వాటంన్నిటిని ఆపడానికి ఈ ఎత్తు వేశారని అంచనా.
యూరోపియన్ మిత్రదేశాలు ఇప్పుడు ఆడుతున్న ఆటను ట్రంప్ అంగీకరించరు. అలాగే అమెరికా లాగా మిగిలిన పశ్చిమ దేశాలు ఇలాంటి దుస్సాహాలు చేయవు. యూఎస్ లా ఏకమొత్తంలో కాకుండా సమష్టిగా చెల్లింపులు చేస్తారు. యూరప్ లోని అమెరికా మిత్రదేశాలు కూడా ఉక్రెయిన్ కోసం 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి.
కానీ యూరప్ దేశాలు నాటో కోసం ఖర్చు చేయవు. ఇలాంటి దుర్భుద్దితో ట్రంప్ మొదటి టర్మ్ లో నాటో కు నిధులు నిలిపివేస్తామని హెచ్చరించారు. అమెరికా హెచ్చరికలను ఎప్పుడూ యూరప్ దేశాలు పెడచెవిన పెట్టలేదు కానీ ట్రంప్ కాలంలో జరిగింది.
1956లో సూయజ్ కెనాల్ సమస్యపై UK- ఫ్రాన్స్‌లకు రక్తపాతానికి దారితీసిన అటువంటి ధిక్కరణ ఒకటి జరిగింది. అలాగే 2003లో ఇరాక్‌పై దాడికి ఫ్రాన్స్ వ్యతిరేకించడం, ఆ దేశానికి ద్రోహి అనే పేరు వచ్చేలా చేసింది. వాణిజ్యం విషయంలో పశ్చిమ యూరోప్ - యుఎస్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి.
US మిత్రదేశాలు జీ హుజుర్ అంటాయేందుకు..
ఒబామా హయాంలో ఇరాన్ తో కుదిరిన అణు ఒప్పందం నుంచి ట్రంప్ 2018 లో వైదొలిగారు. పశ్చిమ దేశాలు కూడా ఈ ఒప్పందం పై సంతకం చేశాయి. ట్రంప్ దూకుడుతో యూఎస్ మిత్రదేశాలు ఏవీ మాట్లాడలేదు. ట్రంప్ నిర్ణయంతో ఇరాన్ దిగ్భ్రాంతి చెందింది. ఈ ఒప్పందాన్ని ఎలాగైనా కొనసాగేలా చూడమని పశ్చిమ ఐరోపాను అభ్యర్థించింది. కానీ అవి పట్టించుకోలేదు. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిపై పశ్చిమ దేశాలు అమెరికా పక్షానే నిలబడ్డాయి. వైట్ హౌజ్ ఏమిచెప్పిన దానికి తలఊపుతూనే ఉన్నాయి. వారందరూ మామూలుగా US వెనుక నిలబడి అంకుల్ సామ్ చెప్పేది లేదా చేసేది చేస్తారు. UK మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌ను US మాజీ అధ్యక్షుడు జార్జ్ W బుష్ "పూడ్లే" అని పిలిచిన ప్రసిద్ధ పేరు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి.
పుతిన్ సంయమనం పాటించాలి..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయ్యాక పరిస్థితి తన చేతుల్లో లేదని బైడెన్ గ్రహించారు. ప్రస్తుతం తన మిత్రదేశాలు కూడా తనన వదిలేశాయని ఆయన గ్రహించారు. కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది ఉంటే, ఈ దశలో బైడెన్ పెద్ద నిర్ణయాలు తీసుకోకపోయి ఉండేవారు.
ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. ప్రపంచంలోఉన్న అన్ని యుద్ధాలు ముగించేస్తానని ప్రతినబూనారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలను స్వాగతించాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఒకటే. ఉక్రెయిన్ ఎంత రెచ్చగొట్టిన పుతిన్ స్పందించకుండా ఉండటం మొదటిది. క్రెమ్లిన్ అధికారులు బైడెన్ నిర్ణయాన్ని "అగ్నిలోకి ఇంధనం విసిరే చర్య" గా అభివర్ణించారు. అయినప్పటికీ, పుతిన్ ఏమి చేస్తారో తెలుసుకోవడానికి కచ్చితమైన మార్గం లేదు. ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది.