అమెరికాలో గెలిచేది ఏనుగా, గాడిదా? ట్రంప్, హారిస్ పోటా పోటీ
ఇంకో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అటు డోనాల్డ్ ట్రంప్ ఇటు కమలా హారిస్ హోరాహోరిగా తలపడుతున్నారు.
By : The Federal
Update: 2024-10-30 02:30 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై ప్రభావం చూపే ఎన్నికలివి. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష పీఠం ఈసారి ఎవరికి దక్కనున్నదనేది ఈసారి అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక ఇండియాలోనైతే మనదేశానికే అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయా అనేంతగా ఆసక్తి పెరిగింది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు చెందిన లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు హోరాహోరిగా పోరాడుతున్నాయి.
50 రాష్ట్రాలు, మరికొన్ని ఐలాండ్స్ కు చెందిన 24.4 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ది ఏనుగు గుర్తు, బ్లూ కలర్. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ది రెడ్ కలర్ రిపబ్లికన్ పార్టీ, గాడిద గుర్తు. మరో ఇద్దరు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ట్రంప్, హారిస్ మధ్యనే ఉంది. పార్టీల కున్న బలాన్నిబట్టి బ్లూ (డెమొక్రాట్) స్టేట్స్ అని, రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్ అని అంటారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఏ పార్టీ ఖాతాలోకి చేరతాయో తేలిపోయినా కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి అప్పటికప్పుడే తేలనుంది. వీటిని స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్, సేఫ్ స్టేట్స్ అని పిలుస్తుంటారు. మొత్తంగా ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే గెలిపించే ఎన్నికలు ఇవి. డెమొక్రాట్ అభ్యర్థిగా బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ బలం కొంత పెరిగింది. ధనరూపంగా కూడా సాయం పెరిగింది.
భారతీయుల ఓట్లు ఎటు?
అమెరికాలో భారతీయ ఓటర్లు ఒకటి లేదా అంతకంటే స్వల్పంగా అధికం.అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో మన బలం లేదు. ఓట్ల పరంగా గెలుపును శాసించలేకపోవచ్చు గానీ పార్టీలకు ఆర్థిక దన్నుగా నిలవగల స్థితిలో ఉంది. మొత్తం భారతీయుల్లో గుజరాత్ ఓటర్లు ఎక్కువ. తెలుగువారు (ఇండియన్స్ లో) నాలుగైదు స్థానంలో ఉన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోదీ డోనాల్డ్ ట్రంప్ గె లవాలని అనుకుంటున్నట్లుగా అమెరికాలోని గుజరాతీలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మోదీ- ట్రంప్ కాలంలో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో మార్పు జరిగాయి. ఇద్దరు వ్యాపార, కార్పొరేట్ సంస్కృతికి చెందిన వారు. ‘ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్’ అని మోదీ చెబితే మోదీ తనకు మంచి స్నేహితుడని ట్రంప్ చెప్పుకున్నారు. ఈ ప్రకటన అమెరికాలోని భారతీయ సమాజాన్ని కొంత ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గుజరాతీలు, మార్వాడిల్లో ఈ ప్రభావం ఉంటుంది. హిందుత్వ వాదులు అమెరికాలోని ఉత్తరాది భారతీయులు ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెలుగువారి అభిప్రాయాలూ భిన్న రీతుల్లో ఉన్నాయి. వీరిలో రెడ్లు, కమ్మ, బ్రాహ్మణులు ముఖ్యులు. ట్రంప్ అధ్యక్షుడుగా గెలవాలని మనసులో ఉన్నా బయటికి చెప్పుకోలేరు.
రెండుగా చీలిన అమెరికన్ సమాజం..
అమెరికన్ సమాజం రెండుగా చీలి ఉంటుంది. ఒకరు శ్వేత జాతీయులు, మరొకరు నల్లజాతి వారు. వీరు గాక హిస్పాన్సియన్స్ ఉన్నారు. వీరు రంగుపరంగా తెల్లగా ఉన్నా శ్వేతజాతీయులు కాదు. వీళ్లలో మెక్సికన్లు, ఐరిష్, బ్రెజిలియన్లు ఎక్కువగా ఉంటారు. ఆసియా దేశాలవారు ఉన్నా వీరి ప్రభావం తక్కువే. పరిస్థితిని బట్టి ఓటు వేస్తారనే అభిప్రాయం ఉంది.
ఇప్పుడున్న లెక్కప్రకారం శ్వేతజాతీయులు ఎక్కువ మంది ట్రంప్ వైపే మొగ్గుచూపుతారనే అభిప్రాయం ఉంది. బ్లాక్స్ ఎక్కువ మంది డెమోక్రాట్ల వైపు ఉంటారు. అమెరికా చరిత్రలో నల్లజాతీయులను దేశాధ్యక్ష పదవికి నిలబెట్టి గెలిపించిన చరిత్ర డెమోక్రాట్లకు ఉంది. సహజంగానే నల్లజాతీయులకు డెమోక్రాట్లతో అనుబంధం ఉంది.
సాధారణంగా మధ్యతరగతి, పేద వర్గాలు డెమొక్రాట్ల వైపు ఉంటారు. ఇటీవలి కాలంలో ప్రవాస భారతీయుల్లో సంపన్నులు పెరిగారు. వీరు అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. మొగ్గు రిపబ్లికన్ల వైపు మారడానికి ఇది ఒక కారణం. భారతీయుల్లో ప్రత్యేకించి డాక్టర్లు, ఐటీ రంగంలో ఉన్నవారు, పారిశ్రామికవేత్తలు రిపబ్లికన్ల ను సపోర్ట్ చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వీరు లభ్ది పొందారు. ట్రంప్ అధ్యక్షుడు అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే వీరు అనుకుంటున్నారు. భారతీయులకు సంబంధించినంత వరకు ఐటీ రంగం భాగుంటుందని వీరు నమ్ముతున్నారు.
అబార్షన్ సమస్యపై హారిస్ బలమైన ఆధిక్యాన్ని కలిగి ఉన్నది. ఇది డెమోక్రటిక్ పార్టీకి కలిసొచ్చే అంశం. అమెరికా రాజకీయాల్లో వృద్ధనేతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో విధానపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడం కన్నా ఇరువురు అభ్యర్ధుల వయసు, శారీరక, ఆరోగ్య పరిస్థితుల పట్ల ప్రజలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. 1946 జూన్ 14న జన్మించిన ట్రంప్ వయసు 78 ఏళ్లు. కమలా హారిస్ వయసు 60ఏళ్ళు. జర్మన్. ఇంగ్లీష్ మూలాలున్న డోనాల్డ్ జాన్ ట్రంప్ రాయకీయాల్లోకి రాక మునుపు మంచి వ్యాపారవేత్త. విలాసపురుషుడు, పక్కా అమెరికన్. ఒకసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. మూడు పెళ్ళిలు ఐదుగురు పిల్లలు. తండ్రి మూలాలు జర్మనీలో.. తల్లి మూలాలు స్కాట్లాండ్‌లో ఉన్నాయి.
డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ తల్లి తమిళ భారతీయురాలు. తమిళులు ఆమెను తమ సొంత మనిషిగా చూస్తున్నారు. దక్షిణ భారతదేశానికి చెందిన వారు కమలా హారిస్‌కు మద్దతు ఇస్తారు. కానీ ఈ వర్గాల ఓటర్లు చాలా చాలా తక్కువ. భారతీయ ఓటర్లు డెమొక్రాట్లను అభిమానించే వారే అయినా.. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. డెమొక్రాట్లు అనుసరిస్తున్న వలస విధానాలు భారతీయులకు ప్రతిబంధకంగా మారుతున్నాయనే టాక్ ఉంది.
అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నిక క్లిష్టంగా ఉంటుంది. పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిచిగన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవాడా వంటి ఏడు రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలు అంటారు. అద్యక్ష ఎన్నికల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో పెన్సిల్వేనియా కీలకం. ఈ రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వాల్‌స్ట్రీట్ జర్నల్ పోల్ సర్వే ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ రేసులో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో సమానంగా ఉన్నారు. రిపబ్లికన్‌కు సర్వే మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌లో స్వల్ప ఆధిక్యం ఉంది. హారిస్ అనుకూలత, ఆమె ప్రజామోదం రేటింగ్‌లో కొంత ప్రతికూలత కనిపిస్తోంది. ఓటర్లలో 42 శాతం మంది హారిస్ మంచి వైస్ ప్రెసిడెంట్ అని అన్నారు. ట్రంప్ వైపు మొగ్గు చూపే యువకులు, హారిస్‌ను ఇష్టపడే యువతులంతా పోలింగ్ స్టేషన్‌లకు వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల రోజున కూడా ఓటర్ల నమోదును అనుమతించే మిచిగాన్, విస్కాన్సిన్, నెవాడాతో సహా అనేక రాష్ట్రాల్లో పోటాపోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా పెద్ద మెజారిటీలు ఏమీ ఉండకపోవచ్చునని అంచనా.
దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా రెండుగా చీలిపోయి ఉంది. ఫాక్స్ మీడియా హౌస్ ట్రంప్ కి, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్ వంటివి కమలా హారిస్ కి మద్దతు ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.