లంకలో చైనా ప్రాబల్యం నిరోధించడానికి మోదీ ఏం చేయబోతున్నారు?
కొలంబో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ;
By : 491
Update: 2025-04-04 07:49 GMT
ఎం ఆర్ నారాయణ స్వామి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 4 నుంచి 6 తేదీల మధ్యలో ద్వీప దేశం శ్రీలంకలో పర్యటిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భారత్- శ్రీలంక మధ్య రక్షణ సహకారంపై సంతకం చేయబోతున్నాయి.
రెండు దేశాల మధ్య కుదిరే ఈ ఒప్పందం భారత్- శ్రీలంక సంబంధాల పథంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇంతకుముందే వివరించారు.
అయితే ఒప్పందంలోకి కొన్ని అంశాలను చాలా గోప్యంగా ఉంచారు. వీటిని బయటకు వెల్లడించడానికి ఇరుదేశాలు ఇష్టపడటం లేదు.
భారత్- శ్రీలంక ఒప్పందంపై ప్రస్తుతం కొంతమంది స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది దేశ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. దానితో పాటు బీజింగ్ లోనూ ఇది కలవరం పుట్టిస్తోంది.
శ్రీలంకలో గత ఏడాది నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనా అనుర దిసనాయకే డిసెంబర్ లో న్యూఢిల్లీ సందర్శించారు. తరువాత రెండు దేశాల సహకారంపై ఒక ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై పని ప్రారంభించాయి.
రుణాల రీ షెడ్యూల్..
మోదీ ఈ పర్యటనలో భాగంగా మరికొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మధ్య రుణాన్ని పునర్నిర్మించడానికి, కరెన్సీ స్వాప్ ఒప్పందాన్ని విస్తరించడానికి సంబంధించిన ఒప్పందం కూడా ఉంది.
ట్రింకోమలీ ఆయిల్ ట్యాంక్ ఫామ్ ను అభివృద్ది చేయడానికి భారత్- శ్రీలంక- యూఏఈ మధ్య త్రైపాక్షిక ఒప్పందం, భారత్- శ్రీలంక మధ్య పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్ ప్రధాన అవకాశాలలో ఉన్నాయి.
ప్రణాళికబద్దమైన అవగాహాన ఒప్పందంలో భాగంగా డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్య రంగం, ఇంధన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు అలాగే అనేక రంగాల గ్రాంట్లు ఉన్నాయి.
అదానీ ప్రాజెక్ట్..
ప్రధాని పర్యటన లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. తూర్పు ట్రింకోమలీలోని సంపూర్ లో భారత్ సాయంతో నిర్మించిన సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభం.
సాంపూర్ లో 50 మెగావాట్ల సౌర విద్యుత్ మొదటి దశ పనులను ప్రధానమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారు. రెండవ దశలో మరో 70 మెగావాట్లను ప్రారంభిస్తారు. శ్రీలంక ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్ట్ కీలకపాత్ర పోషిస్తుంది.
గతంలో బొగ్గు ఆధారితంగా ఉండాలని భావించిన ఈ ప్రాజెక్ట్, భారతదేశ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, శ్రీలంక కు చెందిన సిలోన్ విద్యుత్ బోర్డు మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది.
మోదీ పర్యటనలో భారత బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పై ప్రతిష్టంభన విషయంలో ముందడుగు పడే అవకాశం కనపడలేదు. దిస్సనాయకే ప్రభుత్వం సుంకాల విషయంలో కఠినమైన వైఖరిని అవలంభించడమే కారణం.
మత్స్యకారుల సమస్యలపై దృష్టి..
శ్రీలంక ఉత్తర ప్రాంతాలు, తమిళనాడుకు చెందిన మత్స్యకారుల మధ్య తరుచు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ వివాదంపై మోదీ- దిస్సనాయకే మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది.
ఈ విషయంలో శ్రీలంక తీవ్ర కోపాన్ని, భారత వ్యతిరేక భావాన్ని రేకేత్తించింది. తమిళనాడుకు చెందిన బాటమ్ ట్రాలర్లు సంపదను దాదాపుగా నాశనం చేస్తున్నారని తమిళజాలర్లు తరుచుగా ఫిర్యాదు చేస్తున్నారు.
‘‘తమిళనాడు జాలర్లు మా జాలర్లు జీవనోపాధికి తీవ్రమైన సమస్యలను కలిగించారు’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని శ్రీలంక తమిళ నాయకుడు ‘ది ఫెడరల్’ తో అన్నారు.
‘‘మా జాలర్లు పదే పదే రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ బాటమ్ ట్రాలింగ్ ను కఠినంగా ఎదుర్కోవడానికి భారత్ నిరాకరించడం సంక్షోభానికి దారి తీసింది’’.
తమిళుల అసంతృప్తి..
మోదీ పర్యటనపై పాశ్చాత్య దేశాలలో ఉన్న శ్రీలంక వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమిళ- శ్రీలంకవాసులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
తమిళ టైగర్లకు ఇప్పటికి మద్దతు ఇస్తున్న కొన్ని శక్తులు ఉత్తర ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరాలను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళుల స్వాతంత్య్రం కోసం యూఎన్ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ మద్దతు ఇవ్వాలని, 2008-09 లో జరిగిన యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
‘‘ఈ పర్యటన భారత్- శ్రీలంక భాగస్వామ్యాన్ని కొత్త శిఖారాలకు తీసుకెళ్లే కీలక ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు’’ అని కొలంబోలో భారత హైకమిషనర్ సంతోష్ ఘా కొలంబోలోని డైలీ మిర్రర్ తో అన్నారు.
2023- 24 లో భారత్- శ్రీలంక ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం 5.5 బిలియన్ డాలర్లు ఉండగా, పెట్టుబడులు మాత్రం 2.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రెండు రంగాలలో అభివృద్దికి భారీ అవకాశం ఉందని భారత్, శ్రీలంక అధికారులు అంగీకరిస్తున్నారు.
2022 లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరువాత భారత్ ఆపన్నహస్తం అందింది. ఈ సంక్షోభం అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పదవి విడిచిపెట్టి పారిపోయాడు. చివరకు మొన్న జరిగిన ఎన్నికల్లో దిస్సానాయక అధికారంలోకి వచ్చాడు.
అనురాధపుర సందర్శన..
మోదీ తన తాజా పర్యటనలో భాగంగా ఏప్రిల్ 6న అనురాధపురం సందర్శించబోతున్నారు. అక్కడ ఆయన దిస్సనాయకేతో కలిసి బోధి ఆలయంలో పూజలు చేస్తారు. భారత రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థతో చేపట్టిన రెండు ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తారు.
కొలంబోకు ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో, తమిళులు ఎక్కువగా నివసించే ఉత్తర ప్రావిన్స్ లో ఉన్న ప్రాంతమే అనురాధపురం, సింహాళ రాజ్యాల పురాతన రాజధాని, దీనిని ఒకప్పుడూ మన దేశానికి చెందిన తమిళ చోళ రాజు నాశనం చేశాడు.
బౌద్ధ దేవాలయాల గొప్ప శిథిలాలు, ప్రపంచంలోని అతిపెద్ద స్థూపాలతో ఇది సింహాళ- బౌద్దులకు మతపరమైన కేంద్రంగా ఉంది.
అనురాధపురాన్ని సందర్శించిన రెండో భారత ప్రధాని మోదీనే. ఇంతకుముందు నెహ్రూ కూడా ఇక్కడకు వచ్చారు. 1985 లో తమిళ గెరిల్లాలు ఇక్కడ ఉన్న వందలాది మంది బౌద్ద భక్తులను ఊచకోత కోశారు.
శ్రీలంక అధ్యక్షుడితో చర్చలు..
ఏప్రిల్ 5న ఉదయం కొలంబోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధికారిక స్వాగతం పలికిన తరువాత ప్రధాని, శ్రీలంక అధ్యక్షుడు అనుర నాయకేతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ప్రారంభిస్తారు.
ఈ పర్యటనలో ప్రధానితో పాటు భారత విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు ధోబాల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఉన్నారు.
శ్రీలంకలో కూరగాయల పంపిణీకి ప్రధాన కేంద్రంగా ఉన్న దంబుల్లా వద్ద ఒక శీతల గిడ్డంగి సౌకర్యాన్ని, మత పరమైన కార్యక్రమాలకు భారత్ విరాళంగా అందించింది.
అలాగే వీటికోసం ప్రత్యేకంగా సౌర విద్యుత్ యూనిట్లను సైతం నెలకొల్పింది. వీటిని మోదీ ఆన్ లైన్ లో కొలంబో నుంచి ప్రారంభిస్తారు. అలాగే ఈ పర్యటనలో శ్రీలంక ప్రతిపక్షాన్ని సైతం ఆయన కలవనున్నారు.