బిట్రా ద్వీపంలో రక్షణ శాఖకు ఎందుకు అవసరం?
నోటీస్ జారీ చేసిన రెవెన్యూ శాఖ, తీవ్రంగా వ్యతిరేకించిన స్థానికులు;
By : Praveen Chepyala
Update: 2025-07-20 12:51 GMT
జాతీయ భద్రతను పెంచే లక్ష్యంతో లక్షద్వీప్ పరిపాలన రక్షణ ప్రయోజనాల కోసం దాని అతిచిన్న దీవులలో ఒకటైన బిత్రాను స్వాధీనం చేసుకోవడానికి సిద్దంగా ఉంది. అయితే తమ చేపల వేటకు అనువైన ప్రదేశం స్థానభ్రంశం చెందుతుందనే భయం స్థానికులలో రేకెత్తించింది.
జూలై 11న జారీ చేసిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం బిట్రా ద్వీపం మొత్తం భూభాగాన్ని రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంటుందని ప్రతిపాదించింది. ఈ చర్య ద్వీపం వ్యూహాత్మక స్థానం, దాని జాతీయ భద్రత ప్రాధాన్యం, పౌర నివాసం వల్ల కలిగే స్వాభావిక లాజిస్టికల్, పరిపాలనా సవాళ్ల ద్వారా నడుపబడుతుందని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఈ ప్రణాళిక అమలు చేస్తే కొచ్చి నుంచి 483 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిత్రా, లక్షద్వీప్ లో రక్షణ సంస్థకు ఆతిథ్యం ఇచ్చే మూడో ద్వీపం అవుతుంది. కవరత్తిలో ఐఎన్ఎస్ ద్వీపరక్షక్, మినికాయ్ లో ఐఎన్ఎస్ జటాయు ఉన్నాయి.
నివాసితులు..
ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల బిట్రాలో నివసిస్తున్న 300 మంది నివాసితులు ప్రభావితమవుతారు. ఈ నివాసితులు చేపలు పట్టడం కొబ్బరిసాగును జీవనంగా చేసుకున్నారు.
ఈ ద్వీపం చాలా చిన్నదే అయినప్పటికీ ఇందులో దాదాపు 45 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న చిన్న సరస్సు ఉంది. ఇతర ద్వీపాల నుంచి కూడా మత్స్యకారులు బిట్రాకు వస్తారు. ఎందుకంటే ఇక్కడ సరస్సులో చేపలు, ట్యూనా, గ్రూపర్లు పుష్కలంగా లభిస్తాయి.
బిట్రా ద్వీపం సముద్ర పర్యావరణ వ్యవస్థతో ముడిపడి ఉంది. దీనితో ఇక్కడ నివాసితులు తమ జీవనోపాధి కోల్పోతారనే భయం వెంటాడంతో కోర్టును ఈ నిర్ణయాన్ని సవాల్ చేయాలని నిశ్చయించుకున్నారు.
లక్షద్వీప్ ఎంపీ..
బిట్రా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామనే ప్రతిపాదనలపై లక్షద్వీప్ కాంగ్రెస్ ఎంపీ ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ కూడా ఈ చర్యను వ్యతిరేకించారు. తాను బిట్రా ప్రజలకు అండగా నిలుస్తానని చెప్పారు.
బిట్రా యుటిలో అతి చిన్న జనావాస ద్వీపం అని రక్షణ అవసరాల సాకుతో పరిపాలన దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం తీవ్రంగా నిరసిస్తున్నట్లు తన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
రక్షణ ప్రయోజనాల కోసం అవసరమైన భూమిని ప్రభుత్వం ఇప్పటికే అనేక ఇతర దీవులలో స్వాధీనం చేసుకుందని సయీద్ అన్నారు. దశాబ్ధాలుగా శాశ్వత జనాభా ఉన్న బిత్రాను ఈ ప్రత్యామ్నాయాల దేనిని పరిగణలోకి తీసుకోకుండా లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.
బిట్రా ఒక చిన్న ద్వీపం అయినప్పటికీ లక్షద్వీప్ లో అతిపెద్ద సరస్సు ఇక్కడ ఉందని ఆయన గుర్తు చేశారు. స్థానికులతో సంప్రదింపులు చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు పరిపాలన శాఖను ఆయన విమర్శించారు. దీనిని రాజకీయంగా, చట్టబద్దంగా తాను ఎదుర్కొంటానని హమీ ఇచ్చారు.
బిట్రా వ్యూహాత్మక ప్రాముఖ్యత
సీఎస్ఆర్ లో జర్నల్ లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. బిట్రా అరేబియా సముద్రంలోని కీలక స్థానంలో ఉన్నందున అది భారత్ కు వ్యూహత్మకంగా ముఖ్యమైనది.
ప్రధాన అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు సమీపంలో ఉండటం వలన ఇది నిఘా, రక్షణకు చాలా ముఖ్యమైనది. జర్నల్ ప్రకారం.. ఈ నిర్ణయం భారత్ లోని కీలకమైన ద్వీప భూభాగాలపై రక్షణ ఉనికిని పెంచే పెద్ద జాతీయ ప్రణాళికలో భాగం.
‘‘మినికాయ్, ఆండ్రోత్ దీవులలోని భారత నావికాదళ స్థావరాలలో ఇటీవల వ్యూహాత్మక నవీకరణ తరువాత అరేబియా సముద్రంలో భారత్ నిఘా నెట్ వర్క్ ను పూర్తి చేయడానికి బిట్రా అవసరం’’ అని జర్నల్ పేర్కొంది.
ఈ దీవులలో సైనిక స్థావరాలపై ఏర్పాటు చేయడం వల్ల భారత్ రద్దీగా ఉండే సముద్ర మార్గాలను నిశితంగా పర్యవేక్షించడానికి , చట్టవిరుద్దమైన కార్యకలాపాలను అరికట్టడానికి, శత్రుదేశాల నుంచి వెలువడే సముద్ర ముప్పులను త్వరగా పరిష్కరించడానికి వీలు కల్పిస్తుందని రక్షణ విశ్లేషకులు హైలైట్ చేశారు.
బిట్రా గురించి.. లక్షద్వీప్ వెబ్ సైట్ ప్రకారం.. బిట్రా 0.105 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అతిచిన్న నివాసయోగ్యమైన ద్వీపం. భూభాగం చిన్నదే అయినప్పటికీ, దాని సరస్సు ప్రాంతం 45.61 చదరపు కిలోమీటర్లు. 1835 వరకు బిట్రా అనేక సముద్ర పక్షులకు సంతానోత్పత్తి ప్రదేశంగా ఉండేది. ఇది కిల్తాన్, చెట్లాట్ ప్రజలకు ఇష్టమైన వేట.
ఇక్కడ ఖననం చేయబడినట్లు చెప్పబడే పాత అరబ్ సాధువు మాలిక్ ముల్లా చిన్న సమాధి ఉందది. ఇది ఇతర ద్వీపాల ప్రజలకు యాత్రా స్థలం. ఆసక్తికరంగా బిట్రాలో మొదటి శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నది. చెట్లాట్ కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ, ఆమె తన కొడుకుతో కలిసి 1945 లో ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకుంది.