శాంతి చర్చల తరువాత ఉక్రెయిన్ భవితవ్యం ఏమిటీ?
యూరప్ ను పట్టించుకోకుండా అమెరికా చేస్తున్న చర్చలు ఫలిస్తాయా?;
By : Praveen Chepyala
Update: 2025-02-22 10:07 GMT
తాను అధికారంలోకి రాగానే ఒక్కరోజులోనే ఉక్రెయిన్ - రష్యా యుద్దాన్ని ఆపేస్తానని ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం యుద్దాన్ని ఆపడానికి పుతిన్ తో చర్చలు ట్రంప్ రహస్యంగా చర్చలు జరుపుతున్నారు.
ఈ అంశం పై ‘ ది ఫెడరల్’ మేనేజింగ్ ఎడిటర్ కేఎస్ దక్షిణామూర్తి ‘‘వరల్డ్నీ - వయిస్’’ ప్రోగ్రాంలో మాట్లాడారు. ఈ చర్చలు కేవలం ఉక్రెయిన్ గురించా లేక.. ప్రస్తుత సూపర్ పవర్, మాజీ సూపర్ పవర్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటాన్ని నిలిపివేయడానికి ఓ చర్చల కార్యక్రమమా? అనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా అధ్యక్షుడి నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24, 2022 న రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఈ యుద్దం రెండు ప్రపంచ శక్తుల మధ్య ఉక్రెయిన్ ఓ పావుగా మారిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు యుద్దం ముగించుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని వాషింగ్టన్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
అగ్రరాజ్యాల యుద్ధం
కొన్ని మీడియా కథనాల ప్రకారం..నాటో అత్యాశే యుద్దానికి దారి తీశాయని, పుతిన్ తన దేశానికి ప్రమాదకరంగా భావించడంతో యుద్దానికి తెర తీశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ను నాటో లో చేరాలని యూఎస్ పట్టుబట్టడమే ఈ యుద్దానికి మూలకారణం. అప్పట్లో ట్రంప్ దీనిని వ్యతిరేకించారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్యలో చిక్కుకుపోయారు.
ట్రంప్ వాదన ప్రకారం.. రష్యాను రెచ్చగొట్టింది మాత్రం జెలెన్ స్కీనే. అయితే నిజానికి రష్యాను రెచ్చగొట్టింది మాత్రం అప్పటి అమెరికా అధ్యక్షడు బైడెన్ మాత్రమే అని జగమెరిగిన సత్యం.
నాటోనూ తూర్పు వైపు విస్తరించాలని పశ్చిమదేశాలు అనుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రతిపాదన అమెరికా విరమించుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రెండు శక్తుల మధ్య చిక్కుకుపోయారు.
అమెరికా ద్రోహల చరిత్ర
ఉక్రెయిన్ పై ట్రంప్ ప్రతిపాదించిన సూత్రం ఆ దేశానికి చిరపరచితమైన అంశం. దీనికి ఉదాహారణ తీసుకుంటే.. అమెరికా 2001 లో ఆఫ్ఘనిస్తాన్ లో దాడికి దిగింది. దీనికి స్థానికుల సహకారాలు తీసుకున్నారు. కానీ 20 సంవత్సరాల తరువాత తిరిగి తాలిబన్లకే అప్పగించింది. అదే విధంగా 2003 లో ఇరాక్ పై యుద్దానికి దిగి సద్దాం హుస్సేన్ ను తొలగించింది. ఇక్కడ హింసాత్మక ఉగ్రవాదాన్ని పెరగడానికి అమెరికానే కారణం.
అమెరికా చరిత్రను పరిశీలిస్తే దాని సొంత ప్రయోజనాల కోసమే ఉంటుందని తెలుస్తుంది. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు సాగుతున్న కొద్ది ఈ ప్రశ్న బయటకు వస్తూనే ఉంది. మీకు కోసం మేమేందుకు యుద్దం చేయాలని ట్రంప్ వాదన. ప్రస్తుతం ఉక్రెయిన్ విధ్వంసానానికి ఎవరూ బాధ్యత వహించాలి. నగరాలకు నగరాలు శిథిలాల దిబ్బల తయారయ్యాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఉక్రెయిన్ కోల్పోయిన భూభాగాల మాటేమిటీ?
ఉక్రెయిన్ కోల్పోయిన ఆర్థిక, మానవ నష్టాలకు తోడు దాని భూభాగాన్ని పెద్ద ఎత్తున కోల్పోయింది. డాన్ బాస్ వంటి పెద్ద ప్రాంతాలు ఇప్పుడు మాస్కో ఉక్కు పిడికిలిలో ఉన్నాయి. వాటిని తిరిగి ఇచ్చే ఉద్దేశం తనకు లేదని పుతిన్ ఇప్పటికే స్పష్టం చేశారు.
రష్యా పై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావడానికి బదులు ట్రంప్, ఉక్రెయిన్ పై ఒత్తిడి చేస్తున్నారు. తన ప్రాదేశిక నష్టాలపై చర్చించకుండా యుద్దాన్ని ముగించేలా పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ తన భవిష్యత్ ను కాపాడుకోవడానికి తీవ్రంగా పెనుగులాడుతోంది. కానీ అది వృథా ప్రయాస అని అర్థమవుతోంది.
నిశ్శబ్ధానికే పరిమితమైన యూరప్
ట్రంప్ ఈ విషయంలో తన పంథానే అనుసరిస్తున్నారు. దీర్ఘకాలిక పొత్తులను పట్టించుకోకపోవడం వల్ల యూరోపియన్ దేశాలు బలహీనంగా మారాయి. వేరేదారి లేక అవన్నీ అమెరికానే అనుసరిస్తున్నాయి. చర్చల విషయంలో అమెరికా, యూరప్, ఉక్రెయిన్ ను చేర్చకపోవడాన్ని విమర్శించవచ్చు.
కానీ పాత చరిత్రను పరిశీలిస్తే వారు అమెరికా వెంటే ఉంటారు. రెండో ప్రపంచ యుద్దం మొదలు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లేదా మరెక్కడైన అమెరికా చర్యలను యూరప్ చాలా అరుదుగా వ్యతిరేకించింది.
అమెరికా మిత్ర దేశాలకు ఎలా లొంగదీస్తుంది..
అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంలో యూరప్ చాలా సార్లు తన అసమర్థతను బయటపెట్టుకుంది. 2003 లో ఫ్రాన్స్, జర్మనీలు .. ఇరాక్ పై దండయాత్రను వ్యతిరేకించాయి. కానీ అమెరికా వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు సాగింది. 2018 లో యూరప్ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఇరాన్ అణు ఒప్పందం నుంచి ట్రంప్ ఏకపక్షంగా వైదొలిగారు. ఇప్పుడు ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తోంది.
ఉక్రెయిన్ కూడా ఎదురుదెబ్బే..
ఇప్పుడు శాంతి చర్చలకు అంగీకరించకపోతే సమీప భవిష్యత్ లో ఉక్రెయిన్ చింతించే అవకాశం ఉంది. యుద్దం ప్రారంభం రోజుల్లో రష్యా, ఉక్రెయిన్ ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయి.
కానీ బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ జెలెన్ స్కీని సంతకం చేయకుండా నిరోధించారు. ఇప్పుడు ట్రంప్ తన ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కీవ్ కు జరిగే నష్టాలను ఆయన పట్టించుకోవడం లేదు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన దానిపై సంతకం పెట్టించే అవకాశం ఉంది.
ఉక్రెయిన్ చూడాల్సిన వాస్తవికత
ట్రంప్ చర్చలు ప్రధాన దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా భౌగోళిక రాజకీయ ద్రోహాల నమూనా కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా జోక్యం తరువాత తిరిగి పుంజుకోవడానికి దానికి దశాబ్ధాల పాటు పయనం అవసరం. అసలు కోలుకుంటుందని చెప్పలేం. వాషింగ్టన్ ప్రయోజనాలకు మరో దేశంగా కీవ్ మిగలబోతోంది.
జెలెన్ స్కీ ఈ విషయం స్పష్టంగా అర్థమైంది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి అమెరికా ఎప్పుడు కట్టుబడి ఉండలేదు. శాంతి చర్చలు ముగుస్తున్న కొద్ది రష్యా నిబంధనలపై పుతిన్ తో చర్చలు జరపడం అనే వాస్తవికతకు కీవ్ అర్థం చేసుకోవాలి.