ఆయన పర్యటనపై పశ్చిమ దేశాలు అసూయగా ఉన్నాయి

రష్యా పర్యటనకు వెళ్లిన మోదీపై పశ్చిమదేశాలు అసూయ చెందుతున్నాయని క్రెమ్లిన్ విమర్శించింది. ఈ స్థాయిలో..

Update: 2024-07-08 06:06 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి మాస్కోలో(రష్యా) రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. భారత ప్రధాని క్రెమ్లిన్ కు రావడంపై పశ్చిమ దేశాలు అసూయ చెందుతున్నాయని ఆ దేశ విదేశాంగ విమర్శించింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర స్థాయి చర్చల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోకు బయల్దేరారు. మా దేశంలో ముఖ్యమైన, పూర్థి స్థాయి పర్యటన జరుగుతుందని రష్యా ఆశిస్తోంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. ఇది రెండు దేశాల మధ్య 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం. 2022 ఫిబ్రవరిలో మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.
విస్తృతమైన ఎజెండా
ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షిస్తారని, పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను చర్చించుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం న్యూఢిల్లీలో తెలిపింది.
మాస్కోలో ప్రధాని మోదీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరువురు నేతలు అనధికారిక చర్చలు జరుపుకోవచ్చని పుతిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి సెర్గెవిచ్ పెస్కోవ్ రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వీజీటీఆర్‌కే టెలివిజన్ ఛానెల్‌కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “ఎజెండా విస్తృతంగా ఉంటుంది, అధినేతలు అనధికారికంగా కూడా మాట్లాడగలరని మేము ఆశిస్తున్నాము, ” అని ఆయన అన్నారు.
పూర్తి స్థాయిలో..
రష్యా-భారత సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని పెస్కోవ్ చెప్పారు. క్రెమ్లిన్‌లో ప్రతినిధులతో కూడిన చర్చలు కూడా ఉంటాయని ఆయన అన్నారు. "మేము చాలా ముఖ్యమైన, పూర్తి స్థాయి పర్యటనను ఆశిస్తున్నాము, ఇది రష్యా-భారత సంబంధాలకు చాలా కీలకమైనది," అని వివరించాడు.
పశ్చిమా దేశాలకు..
ప్రధాని మోదీ రష్యా పర్యటనను పశ్చిమ దేశాలు నిశితంగా, అసూయతో చూస్తున్నాయని పెస్కోవ్ విమర్శలు గుప్పించారు. "వారు అసూయతో ఉన్నారు - ఈ పర్యటనను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు అంటేనే వారు అసూయ చెందుతున్నారని అర్థం’’ ”అని పెస్కోవ్ మోదీ రష్యా పర్యటన పట్ల పాశ్చాత్య రాజకీయ నాయకుల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఉక్రెయిన్ వివాదం
2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది.. చూపిస్తూనే ఉంది. ఈ రెండు దేశాల అధినాయకులతో న్యూఢిల్లీ చాలా సార్లు ఫోన్ సంభాషణలు జరిపింది. యుద్దం ముగింపు ప్రాముఖ్యతను గట్టిగా రెండు దేశాల నాయకులకు వివరించింది.
పుతిన్, జెలెన్ స్కీతో చాలా సార్లు ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించారు. రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడిని న్యూఢిల్లీ ఇప్పటి వరకూ ఖండించలేదు. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. భారత్,రష్యా నుంచి రాయితీ ధరపై ముడి చమురును కొనుగోలు చేస్తోంది. దీనిపై కొన్ని పాశ్యాత్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసిన న్యూఢిల్లీ పట్టించుకోలేదు. గత సంవత్సరం ఈ మొత్తం అమాంతంగా పెరిగింది.
ఐదు సంవత్సరాల తరువాత తొలిసారి..
దాదాపు ఐదేళ్ల తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సమావేశానికి ఆయన చివరిగా వెళ్లారు. భారత ప్రధాని, రష్యా అధ్యక్షుల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యున్నత సంస్థాగత సంభాషణ యంత్రాంగం.
ఇప్పటివరకు, భారతదేశం- రష్యాలో 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. చివరి వార్షిక శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 6, 2021 న న్యూఢిల్లీలో జరిగింది. దీనికి పుతిన్ హాజరయ్యారు.
Tags:    

Similar News