ఇజ్రాయెల్ సైన్యానికి భారీ విజయం.. బందీలను రక్షించిన..
దాదాపు తొమ్మిది నెలలగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం మొదటి సారిగా ఆపరేషన్ లో బందీలను సురక్షితంగా రక్షించింది. గాజాలోని బందీలపై రక్షించడానికి పగటి..
By : Praveen Chepyala
Update: 2024-06-08 12:40 GMT
ఇజ్రాయెల్ సైన్యం ఉగ్రవాద సంస్థ హమాస్ పై పోరును ఉధృతంగా కొనసాగిస్తోంది. తాజాగా జరిపిన దాడిలో భారీ విజయాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో జరిగిన దాడిలో కిడ్నాప్ చేయబడిన నలుగురు బందీలను రక్షించినట్లు ఇజ్రాయెల్ శనివారం తెలిపింది.
నుసెయిరత్‌లో సంక్లిష్టమైన ప్రత్యేక పగటిపూట ఆపరేషన్‌లో నోవా అర్గామణి, 25, అల్మోగ్ మీర్ జనవరి 21, ఆండ్రీ కోజ్లోవ్ 27, ష్లోమి జివ్ (40)లను రక్షించినట్లు సైన్యం తెలిపింది.
రఫా నగరం నడిబొడ్డున ఉన్న నుసిరత్ అనే ప్రదేశంలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో బందీలను రక్షించినట్లు తెలిపింది. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి సందర్భంగా హమాస్ దాదాపు 250 మంది బందీలను కిడ్నాప్ చేసింది. నవంబర్‌లో వారం రోజులపాటు జరిగిన కాల్పుల విరమణలో సగం మందిని విడుదల చేశారు.
అయితే హామాస్ దగ్గర మరో 130 మందికి పైగా బందీలుగా ఉన్నారని, వారిలో నాలుగింట ఒక వంతు మంది చనిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది. వారిని సురక్షితంగా తిరిగి ఇంటికి తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రజలు దేశంలో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శలు నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఖననం చేయడం ఒక ఆచారంగా భావిస్తారు. వ్యక్తి కోల్పోయిన శరీర భాగాలను అన్నింటిని ఒక దగ్గరికి చేర్చి ఖననం చేయడం ఇక్కడి సాంప్రదాయం. అందుకే ఐడీఎఫ్ దళాలు చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుల పార్దీవ శరీరాల కోసం కూడా గాలిస్తోంది.
శనివారం నాటి ఆపరేషన్ యుద్ధం చెలరేగినప్పటి నుండి సజీవ బందీల యొక్క అతిపెద్ద రికవరీ, రక్షించబడిన బందీల మొత్తం ఏడుకు చేరుకుంది. ఇంకా చాలామంది బందీలను హమాస్ సొరంగ మార్గాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజాలోని రఫాను చుట్టుముట్టి భారీ స్థాయిలో యుద్దం చేస్తున్న ఐడీఎఫ్ దళాలు డజన్ల సంఖ్యలో హమాస్ ను ఏరిపారేస్తోంది.
మరో వైపు ఈ ఉగ్రవాద సంస్థకు ఎలాంటి సాయం అందకుండా ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్ ను తన ఆధీనంలోకి తీసుకుంది. మరో వైపు అక్కడ 14 సొరంగాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసింది. ఇవన్నీ హైవేల మాదిరిగా ఉండి నేరుగా ఈజిప్ట్ లోని సినాయ్ ద్వీపకల్పాన్ని కలుపుతున్నాయి.
ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో దాదాపు 36 వేల పాలస్తీనియన్లు మరణించినట్లు హమాస్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే వీరిలో చాలామంది చిన్నపిల్లలు, మహిళలే అని ఐరాస ధృవీకరించింది. మరోవైపు గాజా పై జరుపుతున్న దాడులను ఆపాలని ఇజ్రాయెల్ తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. అయితే వీటిని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంగీకరించట్లేదు. హమాస్ పూర్తిగా ఏరివేసే వరకు యుద్దం ఆగదని ప్రతినబూనారు. అందుకే తగ్గట్లే రఫాపై దాడుల తీవ్రతను పెంచింది కూడా.