వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

టిడిపి-వైసిపి దోబూచులాట, వ్యతిరేకించిందా , ఓటేసిందా?;

By :  Admin
Update: 2025-04-05 04:23 GMT


నిన్న అర్థరాత్రి రాజ్య సభ వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 బిల్లును ఆమోదించింది. 128 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయగా, 95 మంది సభ్యులు చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.13 మంది గైర్హాజరు అయ్యారు. లోక్సభ ఇప్పటికే బిల్లును ఆమోదించింది.సుమారు 15 గంటల పాటు సాగిన వాదనలు మరియు చర్చల అనంతరం ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది.

అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమికి చెందిన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.

మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ AIADMK కొన్ని ఇతర పార్టీలు కూడా ఈ బిల్లులోని కొన్ని అంశాలను సమర్థిస్తూ ఓటు వేశాయి .కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బిల్లులోని సంస్కరణలను సమర్థించాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఓట్లు లభించాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలు పైకి వ్యతిరేకంగా మాట్లాడి విప్ జారీచెయ్యకుండా క్రాస్ ఓటింగ్ చేయడంతో రాజ్యసభలో సులభంగా వక్స్ బిల్లు పాస్ అయ్యిందనే టాక్ వినబడుతూ ఉంది.దీనిని వైసిపి ఖండిస్తూ ఉంది.

అయితే తాము విప్‌ జారీ చేశామని, తమ పార్టీ ఎంపీలంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. సభ్యుడు నత్వానీ తాను మద్దతుగా ఓటేసినట్లు విస్పష్టంగా తెలిసింది. ఆయన బటన్‌ నొక్కి వేసిన ఓటు తొలుత నమోదు కాలేదని.. తర్వాత కాగితం తెప్పించుకుని ఓటు వేశారని కొందరు ఎంపీలు చెప్పారు. బీజేపీ వర్గాలు కూడా ఆయన బిల్లుకు మద్దతిచ్చారని చెప్పడంవిశేషం.

పార్టీల ఓట్లు ఇలా పడ్డాయి

బీజేపీకి రాజ్యసభలో 98 మంది సభ్యులుంటే 97 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ విదేశీ పర్యటనలో ఉన్నందున సభకు రాలేదు. జేడీయూ-4, ఎన్‌సీపీ(అజిత్‌ పవార్‌)-3, టీడీపీ-2..ఏజీపీ, ఎంఎన్‌ఎఫ్‌, ఎన్‌పీపీ, యూపీపీఎల్‌, జేడీఎస్‌, ఆర్‌ఎల్‌డీ, ఆర్‌పీఐ (అథావలే), శివసేన (షిండే), ఆర్‌ఎల్‌ఎం పార్టీలకు చెందిన ఒక్కో ఎంపీ బిల్లుకు మద్దతిచ్చారు. ఆరుగురు నామినేటెడ్‌ సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటేశు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకూడా ఓటేయలేకపోయారు. ఓ స్వతంత్ర సభ్యుడు కూడా అధికార కూటమికి మద్దతు తెలిపారు. వక్ఫ్‌ బిల్లుకు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మద్దతివ్వడం ఆయన పార్టీ జేడీయూలో తీవ్ర విభేదాలకు దారితీసినప్పటికి ఎంపిలంతా విప్ కు కట్టుబడి బిల్లుకు అనుకూలంగా ఓటేయడం విశేషం.

వైసిపి వాదన

వక్ఫ్ బిల్లును పార్టతీ స్పష్టంగా వ్యతిరేకించిందని ఎంపిలు చెబుతున్నారు. "తొలి నుంచి తమ పార్టీది ఒకటే విధానం వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్సభలో, నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది," పార్టీ రాజ్యసభ నేత వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్ సీపీ తన ఎంపీలకు విప్ జారీ చేసిందని ఆయన చెప్పారు. "బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోకసభ, రాజ్యసభల్లో రికార్డులే సాక్ష్యం. వక్స్ బిల్లుపై పార్లమెంట్ లో సభ్యులు చేసిన ప్రసంగాలే సాక్ష్యం," అని ఆయన అన్నారు.



Tags:    

Similar News