కమలా హ్యారిస్ కోసం రంగంలోకి దిగిన డెమోక్రటిక్ పార్టీ అతిరథులు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమలా హ్యారిస్ కోసం మాజీ అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామాతో పాటు బెర్నీ శాండర్స్, వెర్మాంట్..

By :  491
Update: 2024-08-21 11:16 GMT

అమెరికా అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ అత్యంత అర్హత కలిగిన వ్యక్తి అని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా అన్నారు. అమెరికాలో ఆశ పునరాగమనం చేస్తోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ లో మిచెల్ ఒబామా మాట్లాడారు. కమలా హ్యారిస్ ఇద్దరు తల్లుల నుంచి పాఠాలు నేర్చుకుని మధ్య తరగతి నేపథ్యం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడి దాకా వచ్చిందని మిషెల్ అన్నారు.

నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78)తో తలపడేందుకు 59 ఏళ్ల హారిస్ గురువారం (ఆగస్టు 22) డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఆమోదించాల్సి ఉంది.

ఇటీవల మరణించిన తన తల్లిని గుర్తు చేసుకున్న మిషెల్.. కమలా హ్యారిస్ తల్లి కూడా ఇలాగే కష్టపడిందని అన్నారు. హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ గురించి మాట్లాడుతూ, "ఆమె తల్లి 19 సంవత్సరాల వయస్సులో భారత్ నుంచి ఇక్కడికి," వచ్చారని వివరించింది.
“కమలా హారిస్ ఈ క్షణానికి మరింత సిద్ధంగా ఉన్నారు. అధ్యక్ష పదవిని కోరుకునే అత్యంత అర్హత కలిగిన వ్యక్తులలో ఆమె ఒకరు. ఆమె తన తల్లికి, నా తల్లికి బహుశా మీ తల్లికి కూడా అత్యంత గౌరవప్రదమైన నివాళులర్పిస్తుంది,” అని మిచెల్ అన్నారు.
'అందరికీ అవకాశం దక్కాలి'
"ఆమె కథ మీ కథ, ఇది నా కథ. ఇది మెజారిటీ అమెరికన్లు మెరుగైన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్న కథ. కమలాకు తెలుసు, మనలాగే, మీరు ఎక్కడి నుంచి వచ్చినా, మీరు ఎలా కనిపిస్తున్నారు, ఎవరిని ప్రేమిస్తారు. మీరు ఎవరిని ఆరాధిస్తారు అని ప్రశ్నించారు.
ట్రంప్‌పై విమర్శలు..
స్త్రీ ద్వేషీ, జాత్యహంకార వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారని కానీ ఆయన వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కాదని కమలా హ్యారిస్ గెలిస్తేనే అందిరికి న్యాయం చేకూరుతుందని అన్నారు. మీరు రిపబ్లిక్ అయినా, డెమోక్రాటిక్ అయిన స్వతంత్రులైన, లేదా ఇంకేవరైన సరే ప్రజాస్వామ్యం నిలబడాలంటే కమలా హ్యారిస్ గెలవాలని అన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని, కొన్నిరాష్ట్రాల్లో కేవలం కొన్ని ఓట్లు మాత్రమే విజేతలు నిర్ణయిస్తాయని కాబట్టి మనమంతా ఓటర్ల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.
హ్యారిస్ ను ఎన్నుకోండి: బెర్నీ శాండర్స్
అమెరికా తదుపరి అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఎన్నుకోవాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ మంగళవారం అమెరికా ప్రజలను కోరారు. శ్రామిక-తరగతి అమెరికన్లకు ప్రగతిశీల ఆర్థిక ఎజెండాను అందించడం, ప్రబలంగా ఉన్న కార్పొరేట్ దురాశను అదుపు చేయాలంటే దానికి కమలా హ్యారిస్ సరైన వ్యక్తి అని శాండర్స్ అన్నారు.
“బిలియనీర్ల కోసం దురాశతో కాకుండా మనందరి కోసం పని చేసే ఆర్థిక వ్యవస్థ మనకు అవసరం. నా తోటి అమెరికన్లు, మా ప్రజలలో 60 శాతం మంది కేవలం జీతం పైనే ఆధారి పడి జీవిస్తున్నారు. అగ్రశ్రేణి ప్రజలపై పన్నులు విధించకూడదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.
మేము అధికారంలోకి వస్తే ధరల పెరుగుదల నియంత్రిస్తాం. వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. సామాజిక భద్రతను అందరికి అందజేస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. టీచర్ల జీతాలను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మెడికల్ ప్రిస్కిప్షన్ ధరలను తగ్గించాలి, ఇతర దేశాల కంటే ఉన్నతమైన స్థానంలో దేశాన్ని నిలపాలని వెర్మాంట్ సెనెటర్ అన్నారు.


Tags:    

Similar News