వక్ఫ్ ఆస్తులలో ఎక్కువ భాగం ఆక్రమించినవి ఖబరిస్థాన్, మసీదులే..

రాష్ట్రాలపరంగా చూస్తే మొదటి స్థానంలో యూపీ, రెండో స్థానంలో బెంగాల్;

Update: 2025-04-04 11:43 GMT

భారత్ లో ఏకపక్షంగా ఉన్న వక్ఫ్ చట్టాన్ని భారత పార్లమెంట్ సవరించిన సంగతి తెలిసిందే. ఉభయ సభలలో ఈ అంశంపై వాడీవేడీగా చర్చలు జరిగాయి. ముస్లిం సమాజం రెండు చీలి ఓ వర్గం నిరసనలు తెలపగా మరో వర్గం వారు సంతోషంతో ర్యాలీలు నిర్వహించారు. ఏదిఏమైనప్పటికీ నిన్న అర్థరాత్రి వక్ప్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణలో ఈ బిల్లును ఒక కీలక ఘట్టంగా ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు.
వక్ఫ్ ఆస్తులు..
మార్చి 14, 2025 నాటికి వక్ఫ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. దేశంలో 38 లక్షల వైశాల్యంలో 8.72 లక్షల పైగా రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వీటిలో ధార్మిక ఇస్లామిక్ ఎండోమెంట్ లలో నిర్మించిన అనేక నిర్మాణాలు ఉన్నాయి.
వక్ఫ్ ఆస్తుల సంఖ్యలో ఉత్తర ప్రదేశ్ మొదటిస్థానంలో ఉంది. సున్నీ వక్ఫ్ బోర్డు కింద 2.17 లక్షల ఆస్తులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో 80,480 వక్ఫ్ ఆస్తులతో రెండో స్థానంలో ఉంది.
పంజాబ్ లో 75, 965, తమిళనాడు 66,092 కర్ణాటక 62,830 తో వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఈ ఐదు రాష్ట్రాలలోనే అత్యధికంగా ఉన్నాయి.
యాజమాన్య పత్రాలు..
వక్ఫ్ కింద ఉన్న 8.72 లక్షల ఆస్తులలో ఇప్పటి వరకూ 9,279 యాజమాన్య పత్రాలు మాత్రమే ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కేవలం 1083 వక్ప్ డీడీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది డాక్యుమెంటేన్ లోని లోపాలను బహిర్గతం చేస్తుంది.
ఈ వక్ఫ్ ఆస్తులలో ఎక్కువగా ఖబరిస్తాన్(శ్మశాన వాటికలు) ఉన్నాయి. ఇవి దాదాపుగా 1,50,569 ఆస్తులు లేదా మొత్తం ఆస్తులలో 17 శాతం వాటా ఆక్రమించాయి.
వాటికి దగ్గరలో ఉన్న మసీదులలో 1,19, 200 వేల ఎకరాల్లో ఉన్నాయి. ఇవి వక్ఫ్ ఆస్తులలో 14 శాతం ఆక్రమించాయి. అలాగే ఈ వక్ఫ్ ఆస్తులలో 1,13,187 దుకాణాలు,92,505 ఇళ్లు దాని యాజమాన్యంలో ఉన్నాయి. ఇది వక్ప్ కు ఆదాయానికి తోడ్పడుతున్నాయి.
ఇక వ్యవసాయ ఆస్తుల విషయానికి వస్తే వక్ప్ కింద 1,40,784 ఎకరాలు ఉంది. ఇది మొత్తం వక్ఫ్ ప్రాపర్టీలలో 16 శాతం ఆక్రమిస్తుంది. మిగిలిన వాటిలో 33,492 దర్గాలు, మజార్ లు, మక్భారాలు ఉన్నాయి.


 


వక్ఫ్ ఆస్తి రిజిస్టర్ దాని సమర్ఫణలో వైవిధ్యమైనవి, మసీదులు, శ్మశానవాటికలతో పాటు ఇందులో 64,724 ప్లాట్లు, 1,17,719 అషుర్ ఖానాలు, 14008 మదర్సాలు, 1 26,189 ఆస్తులు ఉన్నాయి.
Tags:    

Similar News