భారతీయ యువతకు అమెరికన్ డ్రీమ్ ఇక కష్టమేనా?

ట్రంప్ రాకతో వీసాలపై గరిష్ట ఆంక్షలు విధించే అవకాశం;

Update: 2025-01-21 07:01 GMT

అమెరికాకు 47 అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వస్తూనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లపై సంతకాలు చేసి తన పాలన ఎలా ఉండబోతుందో ఓ హింట్ ఇచ్చారు. తన మొదటి పరిపాలన కాలం నుంచి అమలు చేస్తున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఆయన రెండ సారి కూడా అధ్యక్షుడిగా గెలిచారు.

ముఖ్యంగా వలసదారుల పట్ల కఠినవైఖరిని అవలంభిస్తున్న ఆయన తమ ప్రథమ ప్రత్యర్థి వారే అని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా అమెరికన్ డ్రీమ్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది భారతీయ యువత వీసాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇమ్మిగ్రేషన్ పై చర్చ
అమెరికా భవిష్యత్ మొత్తం ఈ విధానం పైనే ఆధారపడి ఉందని ట్రంప్ మద్దతుదారుల వాదన. వారంతా అమెరికా ప్రవేశానికి కఠిననిబంధనలు ఉండాలని కోరుతున్నారు. అదే సమయానికి కార్పేరేట్ కంపెనీలు మాత్రం హెచ్ వన్ బీ వీసాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. వైట్ అమెరికన్లు అక్కడికి వస్తున్న వారందరినీ తమ ఉద్యోగాలు ఎత్తుకుపోతున్న దొంగలుగా భావిస్తున్నారు.
హెచ్ వన్ బీ వీసాలపై ఆంక్షలు విధిస్తారనే ఆందోళనలు భారత సిలికాన్ సిటీ గా పేరున్న బెంగళూర్, హైదరాబాద్, చెన్నైలో కనిపిస్తున్నాయి. ఈ నగరాలు దేశంలో ఐటీ ఇండస్ట్రీకి చోదక శక్తిగా ఉన్నాయి.
బెంగళూర్ ఓ ఐటీ కంపెనీ రిక్రూట్ మెంట్ హెడ్ ‘ ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. హెచ్ వన్ బీ ప్రక్రియ ఐటీ పరిశ్రమకు ముఖ్య అడ్డంకిగా మారింది. మా ఉద్యోగులు చాలా మంది యూఎస్ క్లయింట్లతో మాట్లాడానికి వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది ప్రాజెక్ట్ టైమ్ లైన్ పై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీడీపీ వృద్ధికి దోహదం..
ఐటీ ఎగుమతులు దేశ జీడీపీలో 8 శాతం వాటాను ఆక్రమించాయి. విలువపరంగా చెప్పాలంటే దాదాపు 250 బిలియన్ అమెరిక్ డాలర్లగా ఉంది. ఇందులో ఐటీ సేవల వాటా 51 శాతంగా ఉన్నాయి. ఇందులో దాదాపు 3 మిలియన్ల మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఇందులో విదేశాలలో హెచ్ వన్ బీ వీసా కింద కొంతమంది విదేశాలలో ఉంటున్నారు. హెచ్ వన్ బీ వీసాలలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. తరువాత స్థానంలో చైనా(12 శాతం) ఉంది.
డిపెండెన్సీ..
వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు హెచ్ వన్ బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించాయి. ఇవి తమ వీసా అవసరాల్లో దాదాపుగా 30 శాతం తగ్గించుకున్నట్లు ఓ అంచనా. ఆఫ్ షోరింగ్ కంటే నియర్ షోరింగ్ ఎక్కువగా ఇవి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
హెచ్ వన్ బీ వీసా ఛాలెంజ్ లు టాలెంట్ మొబిలిటీకి అడ్డంకిని సృష్టించాయని యూఎస్, బెంగళూర్ లో కార్యాలయాలు నిర్వహిస్తున్న ఐటీ సోల్యూషన్ కు చెందిన ఓ సీనియర్ మేనేజర్ ‘ది ఫెడరల్ ’ తో చెప్పారు. మేము స్థానికంగా నియామకం చేసి శిక్షణ ఇస్తున్నాం. అయితే కొన్ని కీలకమైన ప్రాజెక్ట్ ల కోసం అమెరికా వెళ్లపోవడం ఆందోళన కలిగిస్తోందని మేనేజర్ అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల పై ఒత్తిడి
దాదాపుగా 1.5 మిలియన్ భారతీయ వలసదారులు యూఎస్ లో పని చేస్తున్నారు. ఇందులో ఎఫ్-1 విద్యార్థి వీసాలపై ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 3 లక్షల మంది విద్యార్థులు యూఎస్ లో చదువుతున్నారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చెన్నైకి చెందిన ఓ విద్యార్థిని చదువు పూర్తయ్యాక హెచ్ వన్ బీ కోసం దరఖాస్తు చేసినప్పటికీ రాలేదు. తాను విద్య రుణంతో ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. వాటిని చెల్లించే ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
సెలవులో ఉన్న విద్యార్థులు జనవరి 20 లోపు అమెరికాకు తిరిగి రావాలని ఆయా విద్యా సంస్థలను విద్యార్థులను ఆదేశించాయి. ఓపీటీ వీసా దాదాపు మూడేళ్లు అమెరికాలో పని చేయడానికి అనుమతిస్తుంది. తరువాత వారు గ్రీన్ కార్డును పొందవచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఓపీటీ వీసాలు ఈ సంవత్సరంలో 41 శాతం పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు..
అమెరికాకు ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 60 నుంచి 70 వేల మంది విద్యార్థులు వెళ్తున్నారు. వీరిలో 80 శాతం మంది ఐటీ ఉద్యోగులుగా ఉన్నారు. దాదాపు పది వేల మందికి హెచ్ వన్ బీ వీసాలు ఉన్నాయి. యూఎస్ లో ఉన్న 7,25 వేల మంది పత్రాలు లేని భారతీయ వలసదారులు ఉన్నారు.
వారిలో కనీసం 17000 వేల మందికి చట్టపరమైన బహిష్కరణను ఎదుర్కొంటారు. ఇది దేశానికి ఇబ్బంది. ట్రంప్ పరిపాలన వలసలపై కఠినంగా వ్యవహరించినప్పటికీ హెచ్ వన్ బీ వీసా విధానంపై చెక్కు చెదరకుండా ఉంటారని అంతా భావిస్తున్నారు. చైనాతో పోటీ పడటానికి ఈ విధానం అమెరికాకు ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు.
అమెరికన్లకు ఉద్యోగాలు..
మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రకారం తయారీ, ఉక్కు తయారీ, బొగ్గు ఉత్పత్తిలో అమెరికన్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పాలసీ తీసుకొచ్చారు. ఈ రంగాలలో వైట్ అమెరికన్ నిరుద్యోగం అధికంగా ఉంది. బెంగళూర్ దేశం సిలికాన్ వ్యాలీ అయితే చెన్నై సాప్ట్ వేర్ రాజధానిగా ఉంది. వీసా సవాళ్లు ఉన్నప్పటికీ ఎగుమతి ఆదాయాలను కొనసాగించడంపై భారతీయ కంపెనీలు నమ్మకంగా ఉన్నాయి.
వీసా సంక్షోభం దేశానికి ఓ అవకాశంగా మార్చగలదు. దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి మంచి అర్హత కలిగిన ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలను తిరిగి దేశానికి ఆహ్వనించవచ్చు. ఇది దేశంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ లను ఉపయోగించడంలో సాయపడుతుంది.
Tags:    

Similar News