డిసెంబర్ లో శ్రీవెంకటేశుని దర్శన టికెట్ల కోటా విడుదల

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18 అంటే ఈవేళ విడుదల చేశారు. టీటీడీ ఆన్ లైన్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు

By :  491
Update: 2024-09-18 06:53 GMT

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18 అంటే ఈవేళ విడుదల చేశారు. టీటీడీ ఆన్ లైన్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం పది గంటకు నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20వ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి. ఆ తర్వాత లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


సెప్టెంబర్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల చేస్తారు. దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. సెప్టెంబరు 23న ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు విడుదల చేస్తున్నారు. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదలను సెప్టెంబర్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టిక్కెట్లు విడుదల చేస్తున్నారు. వ‌యో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23వ తేదీన మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనుంది. సెప్టెంబరు 24న ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

ఇక, తిరుమ‌ల‌, తిరుప‌తిలో గదుల కోటా సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతుంది. సెప్టెంబరు 27న శ్రీవారి సేవా కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవా టికెట్లను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవా టికెట్లు మధ్యాహ్నం 1 గంటకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. మిగిలిన వివరాలకు https://ttdevasthanams.ap.gov.in సంప్రదించవచ్చు. ఈ సైట్ నుంచే టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంది.
Tags:    

Similar News