తాడోపేడో తేల్చుకోనున్న ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్.. ఒక్కరికే ఛాన్స్

రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజరస్ హైదరాబాద్ జట్లు రేపు జరిగే క్వాలిఫయర్‌ 2 మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. చెన్నై స్టేడియంలో ఈ జట్ల రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Update: 2024-05-23 08:19 GMT

ఐపీఎల్ 2024 టోర్నీ మరింత ఉత్కంఠ బరితంగా మారింది. బెంగళూరు అభిమానులు తీవ్ర నిరాశకు గురైనా ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ మాత్రం గోళ్లు కొరికేసుకుంటున్నారు. అందుకు క్వాలిఫయర్ 2 మ్యాచ్ వీరి మధ్య జరగనుండటం ఒక కారణమయితే.. ఈ మ్యాచ్‌కు వరుణ గండం ఉండటం మరో కారణం. ఈ మ్యాచ్‌తో గెలిచి వాళ్లు ఫైనల్స్‌లో కేకేఆర్‌తో బాహాబాహీ కానున్నారు. అందుకోసం ఈ రెండు జట్లు శుక్రవారం తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఆర్‌ఆర్‌ను ఎలాగైనా ఓడించాలని సన్‌రైజర్స్, ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తు చేయాలని రాజస్థాన్ తెగ కసరత్తులు కూడా చేసేస్తున్నాయి.

ప్రత్యేక వ్యూహాలు

ఒక గేమ్ గెలవాలంటే మంచి ప్లేయర్స్‌తో పాటు సరైన వ్యూహ రచన కూడా ఉండాలని, దాంతో పాటు కాస్తంత అదృష్టం మనవైపు ఉంటే విజయం మనల్నే వరిస్తుంది అనేక మంది సీనియర్లు చెప్పారు. వీటిలో అదృష్టం మన చేతుల్లో ఉండదు. కానీ మంచి ప్లేయర్లు, వ్యూహం మన ఎలా అంటే అలా ఉంటాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2024 టోర్నీలో అమితుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన ఆర్ఆర్, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లకు ఈ రెండింటిలో ఒకటైన మంచి ప్లేయర్స్ ఉండనే ఉన్నారు. దాంతో ఇప్పుడు ఈ జట్లు ఇక తమ వ్యూహాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాయి. ప్రత్యర్థి ప్లేయర్స్‌ చేత మూడు చెరువుల నీళ్లు తాగించాలి అని రెండు జట్లు తెగ వ్యూహాలు రచిస్తున్నాయి. దాంతో పాటుగానే తమ ప్లేయర్స్ ఇబ్బంది పడుతున్న సెక్షన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిపై ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తున్నాయి.

వర్షం పడితే..

శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆర్ఆర్, ఎస్‌ఆర్‌హెచ్ తలపడనున్నాయి. కానీ ఈ మ్యాచ్‌కు వరుణ గండం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో చెపాక్ స్టేడియం ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. దీంతో అభిమానుల గుండెళ్లో ఇప్పటి నుంచే రైళ్లు పరిగెడుతున్నాయి. వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటని అందరూ గుబులు చెందుతున్నారు. అయితే ఒకవేళ శుక్రవారం వర్షం పడి క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఆగిపోతే దానిని రిజర్వ్ డే అయిన శనివారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఒక చేసేదేమీ లేక పాయింట్స్ పట్టికలో టాప్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ను ఫైనల్‌కు పంపిస్తారు.

ఈ రెండు జట్లు పాయింట్ల పరంగా ఒకేలా ఉన్నాయి. లీగ్ స్టేజ్‌లో ఇరు జట్లు కూడా 17 పాయింట్లు సాధించాయి. కానీ పాయింట్ల పట్టికలో మాత్రం మెరుగైన రన్‌రేట్‌తొ ఎస్‌ఆర్‌హెచ్ టాప్‌లో ఉంది. దీంతో ఎస్‌హెచ్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మాత్రం ఫైనల్‌కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ఆర్ఆర్ భయపడుతుందా!

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ఆడనున్న క్రమంలో ఆర్ఆర్ భయపడుతోందని ప్రచారం జరుగుతోంది. అందుకు తమ జట్టులోని సంజూ శాంసన్ సహా పలువురు కీలక ఆటగాళ్లు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతుండటమే కారణమని తెలుస్తోంది. వారి అనారోగ్యం చూసిన యాజమాన్యం రానున్న మ్యాచ్‌ విషయంలో ఆందోళన చెందుతుందని, వారి స్థానంలో వేరే వాళ్లను నిలబెట్టడం అంటే రిస్క్ అవుతుందని యాజమాన్యం ఆలోచనలో పడినట్లు సమాచారం. ‘‘నాను వంద శాతం ఫిట్‌గా లేను. దగ్గుతో ఇబ్బంది పడుతున్నాను. నాతో పాటు ఇంకొందరు ఆటగాళ్లు కూడా స్వల్ప అనారోగ్యంతో ఇబ్బండి పడుతున్నారు’’అని సంజూ తెలిపాడు. మ్యాచ్‌కు ముందు ఒకరోజు విశ్రాంతి లభిస్తున్న క్రమంలో కోలుకునే అవకాశం బాగానే ఉందని సంజూ అభిప్రాయపడ్డాడు.

నువ్వా నేనా పోటీ తథ్యం

గత రికార్డులు చూసుకుంటూ రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స హైదరాబాద్ 19 సార్లు తలపడ్డాయి. వాటిలో సన్‌రైజర్స్ 10 సార్లు విజయం సాధించగా రాజస్థాన్ తొమ్మిది సార్లు విజయం సాధించింది. దీంతో శుక్రవారం జరిగే మ్యాచ్‌ను గత రికార్డులు చూసిన అంచనా వేయలేమని, ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. దానికి తోడు చెన్నై స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి కావడం కూడా మ్యాచ్ ఫలితాలను మార్చొచ్చని అంటున్నారు.

ఈ స్టేడియంలో రెండు జట్లకు చెత్త రికార్డులే ఉన్నాయి. ఈ స్టేడియంలో సన్‌రైజర్స్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఈ స్టేడయింలో ఎస్‌ఆర్‌హెచ్ అత్యధికంగా 177 పరుగులు, అత్యల్పంగా 134 పరుగులు చేసింది. అదే విధంగా ఆర్ఆర్ కూడా ఈ స్టేడియంలో 9 మ్యాచ్‌లు ఆడగా వాటిలో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక్కడి రాజస్థాన్ జట్టు అత్యధికంగా 223 పరుగులు, అత్యల్పంగా 141 పరుగులు సాధించింది. వీటితో పాటుగా ఆర్ఆర్ గెలిచిన రెండు మ్యాచ్‌లలో కూడా తొలుత బ్యాంటింగ్ చేసింది. ఎస్ఆర్‌హెచ్‌ గెలిచిన ఒక్క మ్యాచ్‌లో ఛేజింగ్ చేసింది. దీంతో ఏ అంశంలో చూసుకున్నా ఈ రెండు జట్ల మధ్య ఎవరు గెలుస్తారు అన్నది అంచనా వేయడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

Tags:    

Similar News