పనిమనిషి ఇంట్లో రూ. 500 నోట్ల కట్టలు..లెక్కగడితే రూ. 35 కోట్లు

ఓ పనిమనిషి ఇంట్లో రూ. 500 నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు ఈడీ అధికారులు. వాటిని లెక్కపెట్టేందుకు 8 కరెన్సీ కౌంటింగ్ మిషన్లను తెప్పించారు. లోతుగా విచారిస్తే..

Update: 2024-05-07 06:40 GMT

జార్ఖండ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అవకతవకలు జరిగాయని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అలంగీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్‌ పనిమనిషి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. వారికి నగదు రూపంలో రూ. 32 కోట్లు పట్టుబడ్డింది. దీంతో సంజీవ్‌ లాల్‌తో పాటు పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి విచారించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద అరెస్టు చేశారు. కాగా ఇందులో తన ప్రమేయం లేదని, పట్టుబడ్డ నగదులో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి ఆలం చెప్పుకొచ్చారు.

ఈడీ అధికారులు సోమవారం రాత్రి పనిమనిషి ఇంటిని తనిఖీ చేశారు. రూ. 500 నోట్ల కట్టలు గుట్టలుగా కనిపించడంతో లెక్కపెట్టడం మనుషులతో అయ్యే పనికాదని, ఏకంగా 8 కరెన్సీ మిషన్ల తెప్పించారు. డబ్బునంతా జాగ్రత్తగా లెక్కపెట్టి ట్రంకు పెట్టెలో సర్ది తీసుకెళ్లారు. నగదు లెక్కిస్తున్న సమయంలో ఇంటి చుట్టూ కేంద్ర పారామిలటరీ బలగాలను రక్షణగా ఉంచారు.

2019లో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌ నుంచి కూడా ఈడీ అధికారులు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మనీలాండరింగ్ కేసులో ఆయనను రాంచీలో అరెస్టు చేశారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు జరిగాయని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. 

Tags:    

Similar News