రాజ్యసభలో వక్ఫ్ బిల్ పాస్
13 గంటల పాటు సాగిన చర్చలతో వేడెక్కిన పెద్దల సభ;
న్యూఢిల్లీ: వక్స్ బిల్లును గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చల అనంతరం పెద్దల సభ ఆమోదించింది. 13గంటల చర్చలతో సభ వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వర్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్స్ (సవరణ) బిల్లు-2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు.128 మంది సభ్యులు బిల్లుకు మద్దతు తెలిపితే 95 మంది వ్యతిరేకించారు.
ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. "ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దుష్పచారమే" అని పేర్కొన్నారు. "2004లో 4.9 లక్షలుగా ఉన్న వర్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వర్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది" అని రిజిజు వివరించారు.
“వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు" అని పునరుద్ఘాటించారు. "అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వర్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది,” అని ఆయన అన్నారు.
మరొక విశేషమేమిటంగే, ఒదిశా బిజు జనతా దళ్ పార్టీ మొదట్లోబిల్లును వ్యతిరేకించినా, చివర్లో ఆ విషయాన్ని సభ్యుల మనస్సాక్షికి వదిలేసింది.